బ్రిటన్ కు ప్రిన్స్ షాక్ !



బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన వయసు 71 ఏళ్లు. ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారని క్లారెన్స్ హౌస్ తెలిపింది.

క్విన్ ఎలిజబెత్ II పెద్ద కుమారుడు ప్రిన్స్ చార్లెస్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఆఫీసు బుధవారం ధ్రువీకరించింది. 71 ఏళ్ల చార్లెస్‌లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆయన కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయనని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని క్లారెన్స్ హౌస్ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఆయన ఇంట్లో నుంచి పని చేస్తున్నారని స్పష్టం చేసింది. ఆయన భార్య కమిల్లా (72)కు కూడా కోవిడ్ పరీక్షలు చేయగా నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రిన్స్ చార్లెస్, ఆయన భార్య స్కాట్లాండ్‌లోని తమ నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరికి అబెర్డీన్‌‌షైర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ సర్వీస్ కరోనా పరీక్షలు నిర్వహించింది.

గత కొద్ది వారాల్లో చార్లెస్ చాలా మందిని కలిశారు. ఈ నెల ఆరంభంలో ప్రిన్స్ చార్లెస్ మొనాకో ప్రిన్స్ ఆల్బర్ట్‌ను కలిశారు. మార్చి 19న ఆల్బర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. రాచకుటుంబంలో కోవిడ్ బారిన పడిన తొలి వ్యక్తి ఆల్బర్ట్ కావడం గమనార్హం. ఇప్పటి వరకూ యూకేలో 7500 మందికిపైగా కరోనా వైరస్ బారిన పడగా.. 422 మంది ప్రాణాలు కోల్పోయారు. చార్లెస్ మార్చి 12న ఆస్ట్రేలియా బుష్ ఫైర్ రిలీఫ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆయన కొద్ది రోజుల నుంచి ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. తనను పలకరించిన వారికి నమస్తే పెడుతున్నారు.

బకింగ్‌హమ్ ప్యాలెస్‌లో పని చేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో.. ఈ వారం ఆరంభంలో చార్లెస్ తల్లిదండ్రులు క్వీన్ ఎలిజబెత్ II (93 ఏళ్లు), ప్రిన్స్ ఫిలిప్ (98) బకింగ్‌హమ్ ప్యాలెస్ నుంచి విండ్సర్ కాస్ట్లే‌కు వెళ్లిపోయారు. కరోనాపై పోరాటం కోసం బ్రిటన్ ప్రజలంతా కలిసి రావాలని క్వీన్ ఎలిజబెత్ పిలుపునిచ్చారు.

-----------------------------------------------------------------------------------------

Prince Charles Corona, the eldest son of Queen Elizabeth II, was infected with the virus. His office confirmed this on Wednesday. The 71-year-old Charles was tested positive for Covid's symptoms and found to be positive.

Clarence House said he had only a few symptoms. It has become clear that he has been working from home for the past few days. His wife, Camilla, 72, was also reportedly tested positive for Covid. Prince Charles and his wife are in isolation at their home in Scotland on government instructions. They were screened by the state-owned National Health Service Corona in Aberdeenshire.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !