కరోనా కలిపింది..


గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఓ బాలీవుడ్‌ జంటకు మాత్రం మంచే చేసింది. గతంలో విడిపోయిన వాళ్లిద్దరినీ మళ్లీ ఒక దగ్గరకు చేర్చింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 14 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తన భార్య సుసానే ఖాన్ నుంచి 2014లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయినా తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తుంటారు. హృతిక్ పిల్లల్ని హాలీడే టూర్లకు తీసుకెళ్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. 

ప్రస్తుతం కరోనా కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో తమ పిల్లల కోసం హృతిక్, సుసానే ఒకే ఇంట్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలు హ్రేహాన్, హృదాన్‌కు అండగా నిలిచేందుకు సుసానే తన ఇంటికి వచ్చిందని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా హృతిక్ వెల్లడించాడు. ఈ 21 రోజులు తమందరం కలిసే ఉంటామని తెలిపాడు. 

‘కొద్ది రోజులుగా సుసానే మా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటోంది. పిల్లల పట్ల తన ప్రేమకు ఇది నిదర్శనం. తల్లిదండ్రులగా మన బాధ్యతలను గుర్తు చేస్తూ నీవు తీసుకున్న ఈ నిర్ణయానికి, కో-పేరెంటింగ్‌లో నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్ సుసానే’ అంటూ హృతిక్ కామెంట్ చేశాడు. విపత్కర సమయంలో పిల్లల కోసం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్న హృతిక్, సుసానే మంచి తల్లిదండ్రులు అంటూ నెటిజన్లు వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
---------------------------------------------------------------------------------

Corona pandemonium has rocked the world for the past few days. Reunited with the formerly separated couple. Bollywood star Hrithik Roshan divorced his wife Susanne Khan in 2014 after 14 years of marriage. The two split up and occasionally meet for their children. Hrithik takes the children on holiday tours and shares them on social media.

Hrithik and Susanne have decided to stay in the same house for their children as the country is currently on lockdown due to corona. Hrithik revealed through his Instagram account that Susanne had come to her house to support their children Hrehan and Hridan. He said they would meet all these 21 days.

Hrithik and Susanne have decided to stay in the same house for their children as the country is currently on lockdown due to corona. Hrithik revealed through his Instagram account that Susanne had come to her house to support their children Hrehan and Hridan. He said they would meet all these 21 days.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

ఈ భర్త మానసిక క్షోభను పట్టించుకునేవారే లేరా..?

హత్య చేయగల భర్తలను ముందే పసిగట్టవచ్చు!

బిర్యానీని బిర్యానీ అనే ఎందుకంటారు ?