దాయాది దేశంలోనూ మహమ్మారి ఉగ్రరూపం
కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 18,810కి చేరింది. కాగా 4,21,413 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. యూరోపియన్ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు యూరోపియన్ దేశాల్లో 10 వేలకు పైగా మృతి చెందారు. 1,95,000 మంది కరోనాతో బాధ పడుతున్నారు. ఇక అమెరికాలో రోజురోజుకు కరోనా మృతుల సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్ హరిస్ పేర్కొన్నారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి భారత్ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. పాకిస్తాన్ లోనూ ఈ మహమ్మారి విజృంభిస్తోంది. పాక్ లో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 959కి చేరుకోగా, మృతుల సంఖ్య 9కి చేరుకుంది. అక్కడ అత్యధికంగా సింధూ ప్రావిన్స్ లో 410, పంజాబ్ ప్రావిన్స్ లో 267 కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు స్వదేశీ విమానాలను పాక్ ప్రభుత్వం రద్దు చేసింది.
---------------------------------------------------------------
The coronavirus is haunting the world. Worldwide, Corona death toll reached 18,810. A total of 4,21,413 people were infected. Corona prevalence is severe in European countries. More than 10 thousand people have died in European countries this year. 145,000 people suffer from coronary artery disease. Margaret Harris, spokesman for the World Health Organization, said coronary deaths are increasing day by day in the US.
Comments
Post a Comment