పల్లెకోసం.. మేముసైతం

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామాలు నడుం బిగించాయి. పల్లె ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కలిగించే పనిలో నిమగ్నమయ్యారు. కరోనా కట్టడిలో ప్రజాప్రతినిధులు కూడా భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునివ్వడంతో పల్లెల్లోని ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో వార్డుసభ్యులు మొదలుకొని సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు మంగళవారం రాత్రి నుంచే రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా కార్మికులకు అండగా ఉంటూ బ్లీచింగ్‌, ఫినాయిల్‌ చల్లడంలో పాలుపంచుకొంటున్నారు. గ్రామాల్లో దుకాణాల దగ్గరకు వెళ్లేవారిని కనీసదూరం పాటించేలా ఉంచడంతోపాటు కరోనా ఎలా వ్యాప్తి చెందుతున్నదో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల సరిహద్దుల్లో ముండ్ల కంచెలు, రాళ్ల కంచెలు ఏర్పాటు చేసుకొన్నారు. ‘మా గ్రామానికి రావద్దు’ అంటూ బోర్డులు పెట్టారు. దీంతో రాష్ట్రంలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొందరు ప్రజాప్రతినిధులు గ్రామాల సరిహద్దుల్లో కాపలా బాధ్యతలను భుజాలకెత్తుకొన్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని మదపురం సర్పంచ్‌ ఉడుత అఖిల, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో రాష్ట్ర రహదారిపై సర్పంచ్‌ నిరంజన్‌రెడ్డితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు బందోబస్తుగా ఉన్నారు. అత్యవసర వాహనాలనే అనుమతించారు. 
ఇండ్ల నుంచి రాకుండా కట్టడి

గ్రామాల్లో ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా నేతలు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముంబై, గల్ఫ్‌ ప్రాంతాల నుంచి వచ్చినవారికి అధికా రులు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో బుధవారం ఇద్దరు గల్ఫ్‌ నుంచి వచ్చినట్టు గుర్తించి.. వారిని హోం క్వారంటైన్‌ చేశారు. సిద్దిపేటలో 160 మంది, కామారెడ్డి జిల్లాలో 1,075 మంది ఇటీవల విదేశాల నుంచి వచ్చినట్టు గుర్తించిన అధికారులు.. వారిని ఇండ్లకే పరిమితం చేశారు. నిత్యావసరాలను ఇండ్లకే పంపుతున్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లి తండాకు ముంబై నుంచి 29 మంది రాగా, వైద్య పరీక్షలు నిర్వహించారు.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !