ఫైనల్లీ.. కదిలిన ప్రిన్సెస్ డైమండ్
ఫిబ్రవరిలో సుమారు మూడు వేల మంది ప్రయాణికులతో డైమండ్ ప్రిన్సెస్ నౌక జపాన్‌లోని యొకహోమా తీరంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. కోవిడ్19 నేపథ్యంలో ఆ భారీ నౌకను నిలిపివేశారు. అయితే రెండు నెలల క్వారెంటైన్ తర్వాత ఆ నౌక ఇవాళ యెకహోమా తీరం నుంచి కదిలి వెళ్లింది. మళ్లీ మే నెలలో అది సర్వీసు స్టార్ట్ చేయనున్నది. జపాన్‌కు చెందిన కార్నివల్ సంస్థ ఈ నౌకను ఆపరేట్ చేస్తున్నది. షిప్‌ను పూర్తిగా డిస్ఇన్‌ఫెక్ట్ చేసిన తర్వాత దానికి సర్టిఫికెట్ ఇచ్చారు. 3711 మంది ప్రయాణికులతో ఫిబ్రవరి 3వ తేదీన డైమండ్ ప్రిన్సెస్ నౌక యొకహోమా తీరంలో ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ షిప్‌లో 712 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. మరో పది మంది మృతిచెందారు. లగ్జరీ క్రూయిజ్ సర్వీసులకు కావాల్సిన అన్ని వస్తువులను డైకోకూ తీరంలో తీసుకోనున్నారు. మళ్లీ మే 16వ తేదీన డైమండ్ ప్రిన్సెస్ ఎనిమిది రోజుల ట్రిప్ స్టార్ట్ చేయనున్నది. అయితే అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తే ఆ టూర్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
---------------------------------------------------------------------------------
In February, the Diamond Princess Ship with about three thousand passengers aboard the Japanese coast of Japan. That huge vessel was stopped by the Kovid19. Two months after the Quarantine, however, the ship sailed off the coast of present-day Yokohama. It will launch the service in May. The ship is operated by a Japanese carnival company. After the ship was completely disinfected, it was given a certificate.
Diamond Princess ship sailed off the coast of Yokohama on February 3 with 3711 passengers on board. A total of 712 Corona positives were reported. Morrow killed ten people. All the goods needed for luxury cruise services will be taken off the coast of Daiko. The Diamond Princess is set to begin its eight-day trip on May 16th. But if the conditions are favorable then the tour will be there, the organizers said.
Comments
Post a Comment