Posts

మహమ్మారికి మందు ఎప్పుడు వస్తుంది.. దాన్ని ఎలా తయారు చేస్తారు?

Image
చైనాలో పుట్టుకువచ్చిన కరోనావైరస్ ఇప్పుడు 177కుపైగా దేశాలకు పాకింది. శనివారం (మార్చి 28) మధ్యాహ్నం వరకు భారతదేశంలో 775 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. 19 మంది చనిపోయారు. ఏపీలో 12, తెలంగాణలో 45 మందికి కోవిడ్-19 సోకినట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా 5,98,245కు పైగా ప్రజలకు కరోనావైరస్ సోకింది. 27,762 మంది చనిపోయారు. అయితే, ఈ వ్యాధి రాకుండా చేసే వ్యాక్సిన్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇందుకు కారణం ఏంటి? అసలు వ్యాక్సిన్ వస్తుందా?  ఎప్పుడు వస్తుంది?  కరోనావైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్ తయారీ దిశగా అడుగులు పడ్డాయి. ఇప్పటికి 20 వ్యాక్సిన్లు తయారీలో ఉన్నాయి. వీటిలో ఒకదానిని నేరుగా మనుషులపైనే ప్రయోగిస్తున్నారు. మిగతా వాటిని జంతువులపై ప్రయోగిస్తున్నారు. ఇవి విజయవంతం అయితే మనుషులపై ప్రయోగాలు మొదలు పెడతారు. ఈ ఏడాది చివరాఖరికి ఫలితాలు వెలువడొచ్చు. ఈ వ్యాక్సిన్ల సామర్థ్యం, భద్రత ఎంత అనేది తెలుసుకునేందుకు పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఒకవేళ ఈ ఏడాది చివరి నాటికి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాల్లో విజయవంతమైనా, వాటిని భారీగా ఉత్పత్తి చేయడం పెద్ద సవాలే. వాస్తవికంగా ఆలోచిస్తే, వచ్చే సంవ...

భారత్ డబ్బులు ముద్రించొచ్చు - నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ

Image
దేశంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన లక్షలాది మందికి ఉపశమనం కల్పించడంలో భారతదేశం "మరింత ఉదారంగా" వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ వినాయక్ బెనర్జీ పేర్కొన్నారు. "మనం తగినంత కృషి చేయలేదు" అని ఈ భారతీయ-అమెరికన్ విద్యావేత్త, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రొఫెసర్ బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మార్చి 24న లాక్‌డౌన్ విధించిన తరువాత భారతదేశం 2300 కోట్ల డాలర్ల ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. అందులో ఎక్కువ భాగం నగదు బదిలీ, పేదలకు ఆహార భద్రతకు కేటాయించింది. "ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదు. ఎవరూ చేతిలో డబ్బు లేకుండా ఉండకూడదు" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ సమయంలో చెప్పారు.  సహ పరిశోధకులు ఎస్తేర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్‌లతో కలిసి 2019లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ బెనర్జీ.. కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించటానికి "వ్యవస్థను స్తంభింపజేయాలన్న ప్రభుత్వ ఆలోచన సరైనదే.. కానీ లాక్‌డౌన్‌తో కథ ముగియదు. టీకా లభ్యమయ్యే వరకూ ఈ వ్యాధి చాలా కాలం పాటు మనను వెంటాడుతూనే ఉంటుం...

లాక్‍ డౌన్ ఇంకెంత కాలం ? పొడిగింపు ఎంత వరకు సమంజసం ?

Image
లాక్ డౌన్ ఇంకెంత కాలం ? దీన్ని పొడిగించడం ఎంత వరకు సమంజసం ? అనే విషయం ఇప్పుడు ప్రతి భారతీయున్ని తొలుస్తున్న ప్రశ్న! ఈ ప్రశ్నకు దాదాపు సమాధానం చెప్పేలా మన పెద్దపల్లికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు "శ్రీనివాస్ ఆడెపు" లాక్ డౌన్ వల్ల కలిగే లాభనష్టాలను గణాంకాలతో సహా పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. (యథావిధిగా..) -------------------------------------------------------------------------------------------------------------------------------------------- మన దేశ జనాభా 135,26 కోట్లు, ప్రపంచ జనాభాలో 17.7% భారతీయులే! జనాభాలో అతి పెద్ద రెండో దేశం. అందులో నగరాల్లో నివసించే వారు 35% (48.30కోట్లు) 25 మార్చి, 2020 నాటికి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోఢీ 25 మార్చి నుండి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‍ డౌన్‍ విధించాడు. లాక్‍ డౌన్‍ విధించే నాటికి దేశంలో 618 మంది కోవిడ్‍‌19 కేసులు నమోదయ్యాయి. అందులో 562 యాక్టివ్‍ కేసులు. ఆనాటికి తమిళనాడు, గుజరాత్‍ రాష్ట్రాల్లో మొదటిసారిగా కోవిడ్‍19తో మృతి చెందగా, గుజరాత్‍ రాష్ట్రంలో కోవిడ్‍19తో ర...

జంతువుల నుంచి మనుషులకు.. కరోనా ప్రయాణం ఇలా సాగిందేమో !

Image
ప్రాణాంతక కరోనావైరస్ వన్యప్రాణుల నుంచి మనుషులకు ఎలా వ్యాపించిందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జంతువుల నుంచి మనుషులకు కరోనా ఎలా వ్యాపించింది అనే విషయమై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అలాంటి పరిశోధనల్లో తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ''చైనాలో ఎక్కడో ఒక చోట గబ్బిలం ఒకటి ఆకాశంలో ఎగురుతూ విసర్జిస్తే అది అడవిలో పడి ఉంటుంది. అందులో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉండుంటాయి. అడవి జంతువు ఏదైనా, బహుశా అలుగు(పాంగోలిన్) ఆకుల మధ్య పురుగుల కోసం వెతుకుతూ ఆ గబ్బిలం విసర్జితాలను సమీపించినప్పుడు అందులోని కరోనా వైరస్ దానికి సంక్రమించి ఉండొచ్చు. అక్కడి నుంచి ఈ వైరస్ వన్యప్రాణుల్లో వ్యాపించగా అలాంటి ఒక వన్యప్రాణిని వేటాడినప్పుడు ఎవరైనా ఈ వైరస్ బారిన పడి.. వన్యప్రాణులను అమ్మే మార్కెట్లో ఉండేవారికి సంక్రమింపజేయడంతో ఇది ప్రబలడం ప్రారంభమై ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఈ వైరస్ ఏ జంతువుల్లో ఉంటుందన్నది గుర్తించి దాని ద్వారా తమ సూత్రీకరణ నిజమని నిరూపించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది కనుక్కోవడం ఒక రకంగా డిటెక్టివ్ కథలాంటిదని జ...

ఆర్నవ్ అబద్ధాలు అన్నీఇన్నీ కావయా..!

Image
ఇప్పుడు దేశం మొత్తం కరోనాతోపాటు రెండు రోజులుగా రిపబ్లిక్ న్యూస్ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నవ్ గోస్వామిపై జరిగిన దాడి గురించి కూడా చర్చించుకుంటున్నారు. తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఆర్నవ్ ఆరోపించాడు. ఇదే విషయాన్ని అతనిపై దాడి జరిగిన రాత్రే ట్విట్టర్ ద్వారా వైరల్ చేశాడు. కానీ ఇతడు చెప్పిన దాంట్లోనే ఎన్నో విషయాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవేమిటంటే.. అనుమానం-1) ఆర్నవ్ చెప్పిన ప్రకారం అతనిపై రాత్రి 10.58 గంటలకు దాడి జరిగింది. దాడిలో ఇద్దరు పాల్గొన్నారు. కానీ, అందరికీ తెలిసిన వివాదాస్పద బీజేపీ నాయకుడు 10.35 గంటలకు, మరో ఆరెస్సెస్ నాయకుడు అశోక్ పండిట్ 10.25 గంటలకే ఆర్నవ్ పై జరిగిన దాడిని ఖండించారు. ఆర్నవ్ చెప్పిన ప్రకారం అతనిపై 10.58 గంటలకు దాడి జరిగితే ఈ ఇద్దరు భగ్వా నాయకులు అంతకు ముందే ట్వీట్ చేయడం గమనార్హం! అనుమానం-2) దాడి చేసిన వారిని ఆర్నవ్ సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకొని విచారిస్తే వారు కాంగ్రెస్ కార్యకర్తలమని ఒప్పుకున్నారట! అలాంటప్పుడు ఆ పట్టుకున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు బం...

ఎస్సై సారు.. అడ్డదొడ్డంగా కొడుతుండు..

Image
లాక్ డౌన్ ఆంక్షల పేరు చెప్పి ఓ ఎస్సై తమ గ్రామ ప్రజలను చిత్తబడుతున్నారని గరిడేపల్లి పోలీస్ స్టేషన్  పరిధిలోని కీతవారిగూడెం సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి సోషల్ మీడియా ద్వారా బహిరంగ వినతిపత్రం రాశారు. గరిడేపల్లి ఎస్సై వెంకన్నగౌడ్ స్థానికులను ఎలా చావగొట్టారనే విషయాన్ని ఈ కింది విధంగా వివరించారు. 1) కల్మల్ చెరువులో బోధకాల పేషెంటును, 2) కీతవారిగూడెం గ్రామంలో పొలంలోకి వెళ్లి మరీ రైతును కొట్టారు. 3) ఇదే గ్రామంలో కాటా వేస్తున్న కూలీలను తరిమితరిమి కొడుతుంటే ఒక వ్యక్తికి కాలు విరిగింది. 4) గరిడేపల్లిలో కిడ్నీ పేషెంటును, 5) రాయినిగూడెంలో వ్యాపారిని 6) చర్చివద్ద అన్నం తింటున్న ఓ క్రైస్తవున్ని సదరు ఎస్సై గారు తీవ్రంగా చితకబాదారని కీతవారిగూడెం సర్పంచ్ కీత జ్యోతి రామారావు, ఉపసర్పంచ్ ఎల్లావుల అంజయ్య ఎమ్మెల్యేతో తమ గోడు వెల్లబోసుకున్నారు. కరోనాతో చస్తామో లేదో తెలియదు గానీ గరిడేపల్లి ఎస్సై దెబ్బలకు మాత్రం మండలంలో ఎవరో ఒకరు చనిపోయే భయానక పరిస్థితి నెలకొందని వారు ఆరోపించారు. కనీస మానవత్వం కూడా మరిచి, కారణం కూడా అడుగకుండ...

పెళ్లి కోసమై వలలో చిక్కెనే పాపం పిలగాడు..!

Image
కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న వారి పెళ్లిళ్లు వాయిదా పడగా కొత్తగా వివాహం చేసుకుందాం అనేవారికీ నిరాశే మిగిలింది ..ఈ లాక్ డౌన్ తర్వాత కూడా ముహుర్తాలు లేకపోవడంతో ఇంకా చాలా కాలం వేచి ఉండాల్సి ఉంది ..ఈ నేపథ్యంలో ఓ యువకుడు పెళ్లి కోసమని సైకిల్ మీద వెళ్తుండగా అనుకోని పరిస్థితుల్లో క్వారంటైన్ సెంటర్ కు వెళ్లాల్సి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన సోనుకుమార్ చౌహన్ అనే 24 ఏళ్ళ యువకుడు పంజాబ్ లోని లుధియానాలోని టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. దేశంలో కరోనా ప్రభావం రాకముందు అంటే ఏప్రిల్ 15 న సోను పెళ్లి నిశ్చితార్థం జరిగింది. అయితే తర్వాత విధించిన లాక్ డౌన్ కారణంగా సోను పంజాబ్ లోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడడంతో ఎలాగైనా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఎలాంటి రవాణా మార్గాలు లేకపోవడంతో సైకిల్ పై అతని స్నేహితులతో కలిసి ప్రయాణం చేసేందుకు సిద్ధపడ్డాడు. కాగా నేపాల్ సరిహద్దులో ఉన్న మహారాజగంజ్ జిల్లాలో సోను పెళ్లి జరగనుంది. దీంతో తన ముగ్గురి స్నేహితులతో కలిసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా దాదాపు 850 కిలోమీటర్లు ...

అబద్దపు వార్తలను చీల్చుకొని ఒక్కటొక్కటిగా బైటికొస్తున్న నిజాలు..

Image
యావత్ భారతదేశం కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, వీడియోల ఆధారంగా మొత్తం ముస్లిం సమాజాన్ని కరోనా వ్యాప్తిలో దోషిగా చూస్తోంది. నిజానిజాలు తెలియని ప్రజలే కాకుండా, ఏకంగా మంత్రులు కూడా ఈ అసత్య ఆరోపణలను నమ్మి ముస్లింలను నేరస్థులుగా ప్రకటించేశారు. కానీ, ఇప్పుడు ఒక్కటొక్కటిగా ఆ వార్తలన్నీ అబద్దమని, ఆ వీడియోలన్నీ కల్పితాలని బైటకు వస్తున్నా.. అప్పుడు ఈ అసత్య వీడియోలనే ఆధారంగా చేసుకొని ముస్లింలపై తమ అక్కసు వెళ్లగక్కిన 'గోదీ మీడియా'.. ఇప్పుడు బైటికొస్తున్న నిజాలను మాత్రం తమ పత్రికలూ ఛానళ్లలో రాకుండా జాగ్రత్తపడుతూ ఎప్పటిలాగే ముస్లింలపై వివక్ష చూపుతోంది. కానీ, మన సలాం తెలంగాణ బ్లాగ్ స్పాట్ మాత్రం తనకు అందిన ఆ అబద్దపు వీడియోలు.. వాటి వెనుకున్న నిజాలను ఇలా మీ ముందుకు సాక్ష్యాలతో తీసుకువచ్చింది. అవే ఇవీ.. # 1_వ_అబద్ధం : "తబ్లిక్ జమాత్ ముస్లిములు వైద్యసిబ్బందిపై ఉమ్మేశారు" అసలు నిజం: http://english.varthabharati.in/…/tableeghis-never-misbehav… #2_వ_అబద్ధం : “కరోనా వ్యాప్తి చేయటానికి ముస్లిములు ఆహారపదార్ధాలపై ఉమ్మేస్తున్నారు” అసలు నిజం: https://www.altnews.in/o...

సాధువుల హత్య కేసులో 101 మంది అరెస్ట్.. వీరిలో ఒక్క ముస్లిం కూడా లేదు.. పైగా దాడి చేసిన వారిలో అధికులు బీజేపీ కార్యకర్తలేనట !

Image
మహారాష్ట్రలో ఈమధ్య మతవిద్వేషాలకు కారణమైన ముఖ్య ఘటన సాధువుల హత్య! పాల్గర్ జిల్లాలోని దివాసి గఢ్ చిన్చలే గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోగా.. కొంత మంది మతతత్వవాదులు దీనికి మతం రంగు పులిమి హిందూ-ముస్లిం విద్వేషాలను రాజేయడానికి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులను వైరల్ చేశారు. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై జరిపిన విచారణలో ఇదంతా అసత్యమని తేలిపోయింది. ఆ రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ దీనిపై వివరణ ఇస్తూ తమ ప్రభుత్వం డీఎస్పీ రేంజ్ అధికారితో కూడిన సీఐడీ బృందం ద్వారా జరిపించిన విచారణలో ఈ ఘటనకు ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సాధువుల అత్యంత కిరాతకంగా కొట్టి చంపినా ఈ కేసులో మొత్తం 101 మందిని అదుపులోకి తీసుకోగా, వీరిలో ఒక్క ముస్లిం కూడా లేడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు వివరించారని తెలిపారు. ఎవరైనా ఈ సాధువుల హత్య ఘటనకు మతాన్ని అంటగట్టి విద్వేషపూరిత అల్లర్లకు కారణమైతే, అలాంటి వారిని తమ ప్రభుత్వం విడిచిపెట్టదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోమ్ మంత్రి హెచ్చరించారు. ఇదిలా ఉంటే, ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రదేశ్ క...

సంస్కారంలో ధనికులు.. ఈ పేదలు !

Image
రాజస్థాన్ లోని సికర్ జిల్లా లోని ఒక గ్రామంలో కొంతమంది కార్మికులను ఒక పాఠశాల భవనంలో క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. ఊరక తిని కూర్చోవడంతో విసుగెత్తిపోయింది. ఆ పాఠశాల భవనానికి ఎన్నో ఏళ్ళుగా సున్నం లేదా పెయింటింగ్ చేయడం జరగలేదని ఆ క్వారంటైన్ లో ఉన్న కార్మికులకు అనిపించింది. వాళ్ళు వెంటనే ఆ గ్రామ సర్పంచ్ తో పాఠశాల భవనానికి పెయింట్ వేస్తామని ప్రస్తావన చేశారు. దాంతో ఆ సర్పంచ్ అవసరమైన వస్తువులు తెప్పించాడు. కార్మికులు తమ క్వారంటైన్ వ్యవధి ముగిసేలోగా భవనానికి పెయింట్ వేసేశారు. ఆ పని చేసినందుకు ఆ గ్రామ సర్పంచ్ , వారికి డబ్బులివ్వబోతే, మాకు ఇన్నాళ్ళూ ఉచితంగా భోజనాలు పెట్టారు. అందుకుగాను మేమూ ఏదో ఒకటి చేయాలనుకున్నాము. పాఠశాల భవనానికి పెయింట్ వేసే అవకాశం లభించింది. మాకు డబ్బులివ్వాల్సిన అవసరం లేదు.అయినా మీరు ఏమైనా ఇవ్వదలచుకుంటే మీ ఊరి ఈ పాఠశాలకే ఇవ్వండి అని , డబ్బును నిరాకరించారు. ----------------------------------------------------------------------------- In a village in Sikar district of Rajasthan, some workers were placed in Quarantine in a school building. Bored with eating and sittin...

ఆమె సేవ అజరామరం !

Image
రోజూ పదిహేను గంటల డ్యూటీ. అది కూడా రాజ్‌భవన్‌లో. ఎప్పటికో కానీ విరామం దొరకదు. విధి నిర్వహణలో ఏమాత్రం రాజీపడకుండానే... కరోనా నివారణకు తనవంతు పోరాటం చేస్తున్నది ఈ మహిళా కానిస్టేబుల్‌. వీక్లీ ఆఫ్‌ రోజుల్లో ఆమె ఎన్ని మాస్క్‌లు కుట్టిందో తెలుసా? హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ అమరేశ్వరి ఒకవైపు విధినిర్వహణలో పాల్గొంటూనే సామాజిక సేవా చేస్తున్నది. తెలంగాణ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న అమరేశ్వరి.. రోజూ తెల్లవారుజామున 3.30 గంటలకే నిద్రలేస్తుంది. తెల్లారేలోపు ఆహారం సిద్ధం చేసుకుంటుంది. ఉదయం 6 గంటలకు... కాటేదాన్‌ నుంచి బయలుదేరి గవర్నర్‌ నివాసానికి చేరుకుంటుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి రాత్రి అయిపోతుంది. ఆమె తల్లికి, అమ్మమ్మకు మిషన్‌ కుట్టే అలవాటు ఉంది. కరోనా దెబ్బతో మాస్క్‌ల కొరత తీవ్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో తన వీక్లీ ఆఫ్‌ రోజుల్లో మాస్క్‌లు కుడుతూ.. వాటిని ప్రజలకు అందిస్తున్నది అమరేశ్వరి. అవికూడా సరిపోకపోవడంతో, ప్రతిరోజూ కనీసం రెండు గంటలు సమయాన్ని మాస్క్‌లు కుట్టేందుకు వినియోగిస్తున్నది. ఇప్పటివరకు దాదాపు 3వేలకు పైగా సిద్ధం చేసింది. ‘ఈ విషయంలో నాకు గ...