సాధువుల హత్య కేసులో 101 మంది అరెస్ట్.. వీరిలో ఒక్క ముస్లిం కూడా లేదు.. పైగా దాడి చేసిన వారిలో అధికులు బీజేపీ కార్యకర్తలేనట !
మహారాష్ట్రలో ఈమధ్య మతవిద్వేషాలకు కారణమైన ముఖ్య ఘటన సాధువుల హత్య! పాల్గర్ జిల్లాలోని దివాసి గఢ్ చిన్చలే గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోగా.. కొంత మంది మతతత్వవాదులు దీనికి మతం రంగు పులిమి హిందూ-ముస్లిం విద్వేషాలను రాజేయడానికి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులను వైరల్ చేశారు. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై జరిపిన విచారణలో ఇదంతా అసత్యమని తేలిపోయింది. ఆ రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశముఖ్ దీనిపై వివరణ ఇస్తూ తమ ప్రభుత్వం డీఎస్పీ రేంజ్ అధికారితో కూడిన సీఐడీ బృందం ద్వారా జరిపించిన విచారణలో ఈ ఘటనకు ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సాధువుల అత్యంత కిరాతకంగా కొట్టి చంపినా ఈ కేసులో మొత్తం 101 మందిని అదుపులోకి తీసుకోగా, వీరిలో ఒక్క ముస్లిం కూడా లేడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు వివరించారని తెలిపారు. ఎవరైనా ఈ సాధువుల హత్య ఘటనకు మతాన్ని అంటగట్టి విద్వేషపూరిత అల్లర్లకు కారణమైతే, అలాంటి వారిని తమ ప్రభుత్వం విడిచిపెట్టదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోమ్ మంత్రి హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్ మరో బాంబు పేల్చారు. సాధువులపై దాడి చేసిన వారిలో ఎక్కువ మంది బీజేపీ కార్యకర్తలేనని ఆయన ఆరోపించారు. దాడి జరిగిన గ్రామం బీజేపీకి కంచుకోటనీ, ఇక్కడి ప్రస్తుత సర్పంచ్ కూడా బీజేపీ అభ్యర్థియేనని సచిన్ తెలిపారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేని ముస్లింలకు అంటగడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీన్ని ధృవీకరించేలా ప్రశాంత్ కణైజియా అనే విలేఖరి సాధువుల హత్యకు బీజేపీ కార్యకర్తలే కారణమని ఓ వార్తను తమ 'లోక్ మత్' పత్రికలో ప్రచురించడం గమనార్హం!
---------------------------------------------------------------------
A major incident in Maharashtra,
which is the cause of religious hatred, is the murder of saints! The incident
took place in the village of Diwasi Garg Chinchale in Palghar district. But the
Maharashtra government's investigation into the incident turned out to be
false. Anil Deshmukh, the Home Minister of the state, said in an inquiry
conducted by the CID team comprising the DSP Range officer of his government,
that the incident had nothing to do with Muslims. A total of 101 people were
taken into custody in the case of the most brutal killing of saints, noting
that there was not a single Muslim. Chief Minister Uddhav Thackeray also
briefed Union Home Minister Amit Shah on the same. The Home Minister has warned
that if anybody causes a riot in the name of religion, the murder of these
saints will cause them to abandon their government.
Meanwhile, Maharashtra Pradesh
Congress Committee general secretary Sachin Sawant bombed another incident. He
alleged that most of those who attacked the saints were BJP activists.
Tendulkar said that the village was attacked and the present Sarpanch is also a
BJP candidate. He added that Muslims are not involved in the event for
political gain only. It is noteworthy that BJP activists are responsible for
the murder of journalist Prashant Kanaijia to prove this!
Comments
Post a Comment