లాక్ డౌన్ ఇంకెంత కాలం ? పొడిగింపు ఎంత వరకు సమంజసం ?
లాక్ డౌన్ ఇంకెంత కాలం ? దీన్ని పొడిగించడం ఎంత వరకు సమంజసం ? అనే విషయం ఇప్పుడు ప్రతి భారతీయున్ని తొలుస్తున్న ప్రశ్న! ఈ ప్రశ్నకు దాదాపు సమాధానం చెప్పేలా మన పెద్దపల్లికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు "శ్రీనివాస్ ఆడెపు" లాక్ డౌన్ వల్ల కలిగే లాభనష్టాలను గణాంకాలతో సహా పేర్కొంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. (యథావిధిగా..)
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
మన దేశ జనాభా 135,26 కోట్లు, ప్రపంచ జనాభాలో 17.7% భారతీయులే! జనాభాలో అతి పెద్ద రెండో దేశం. అందులో నగరాల్లో నివసించే వారు 35% (48.30కోట్లు)
25 మార్చి, 2020 నాటికి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోఢీ 25 మార్చి నుండి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాడు. లాక్ డౌన్ విధించే నాటికి దేశంలో 618 మంది కోవిడ్19 కేసులు నమోదయ్యాయి. అందులో 562 యాక్టివ్ కేసులు. ఆనాటికి తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో మొదటిసారిగా కోవిడ్19తో మృతి చెందగా, గుజరాత్ రాష్ట్రంలో కోవిడ్19తో రెండో వ్యక్తి మరణించడం గమనార్హం.
లాక్డౌడన్ విధించిన 31 రోజుల తరువాత
23 ఏప్రిల్ 2020 నాటికి...
మోఢీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి 30రోజులు (+1 జనతా ఖర్ప్యూ) కలిపితే ఈనాటికి 31 రోజులు అవుతాయి. దేశంలో లాక్డౌన్ తరువాత 20,000 కోవిడ్19 కేసులు నమోదు కాగా, 4000 మంది కోలుకోగా, అందులో 600 మంది కోవిడ్19తో మృతి చెందారు. అయితే అందులో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్య ప్రదేశ్, తమిళనాడులో రోగుల సంఖ్య అధికంగా ఉంది.
లాక్డౌన్ 2.0...
ప్రధాన మంత్రి నరేంద్ర మోఢీ మొదటి దఫా విధించిన 21 రోజుల లాక్‍డౌన్ 15 ఏప్రిల్ 2020తో ముగియనుండగా, దాన్ని రెండో విఢత 3 మే, 2020 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పిమ్మట దీన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 7 మే, 2020 వరకు పొడిగించారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోఢీ 20 ఏప్రిల్ నుండి కొన్ని వర్గాలకు సఢలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్19 మరణాల సంఖ్య...
ఇది నేను రాసే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్19 కేసులు 26,61,506 నమోదు కాగా, 730,774 మంది రికవర్ కాగా, 185,504 మంది మృతి చెందారు. కాగా, 17,45,228 మంది యాక్టివ్ కోవిడ్19 కేసులు!! అనగా నమోదైన 26.61లక్షల కేసుల్లో మృతుల సంఖ్య 185,504 (7శాతం) మాత్రమే !!
భారతదేశంలో మరణాల శాతం..
2018 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు 7.3శాతం మరణాల శాతం నమోదైంది.
అంటే 2018లో ఒక రోజుకు 27,052 మంది హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం, వృద్యాప్యం, పోషకాహారం లోపం ఇలా వివిధ రకాలుగా దేశంలో చనిపోయారు. అంటే 31 రోజుల కాలంలో సాధారణంగా దేశంలో సంభవించే మరణాల సంఖ్య 27052ను 31తో గణిస్తే 8,38,612 !
31 రోజుల్లో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 838,612 మంది!
31 రోజుల్లో దేశవ్యాప్తంగా కోవిడ్19 మరణాల సంఖ్య 600 మంది మాత్రమే అన్న విషయాన్ని మనం గమనించాలి.
అంటే దేశంలో వివిధ రకాల మరణాలతో పోల్చితే ...
కోవిడ్19 మృతుల 0.0715 శాతం మాత్రమే !!
భారత దేశ జనాభా 135,26,42,280 లో 20,000 కోవిడ్ కేసులు 0.00147 శాతం.
భారత దేశ జనాభా 135,26,42,280 లో ఒక నెల రోజుల మరణాల సంఖ్య 838,612 అంటే 0.0619శాతం.
భారత దేశ జనాభా 135,26,42,280 లో 0.1శాతం అంటే 13,52,642.28 !!
ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మృతుల సంఖ్య 2 లక్షలు కూడా దాటలేదు.. ఇది గణాంకాలు తెలుపుతున్న సత్యం !
లాక్‍డౌన్ సర్వరోగ నివారిణా ??
మన దేశంలో ఇప్పటికి లాక్డౌన్ విధించి 31 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం లాక్ డౌన్ విధించి, భౌతిక దూరం పాటించమని సూచనలు చేస్తు, ప్రజల బాధ్యతలను రాష్ట్రాలపైకి నెట్టి కేంద్రం చోద్యం చూస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోఢీ టివి లైవ్ల ద్వారా ఇచ్చిన పలు సందేశాలు అందర్ని ఆశ్చర్య పరిచాయి. ఒకసారి చప్పట్లు కొట్టమని, రెండో సారి 9 నిమిషాలు లైట్లు ఆర్పి దీపాలు పెట్టమని, మూడోసారి సప్తపది, పిమ్మట భాజపా కార్యకర్తలను ఉపవాసం చేసి తొమ్మిది మందిని ఆదుకోవాలని అంటూ ఏవో ఏవో సూచనలు చేస్తు ప్రజల చేతులు ప్రజల నెత్తిమీదే పెట్టారు. వీటి వల్ల వైరస్ నుండి ప్రజలను ప్రభుత్వం ఏవిధంగా రక్షిస్తుందో, ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఎపాటిదో అర్థం చేసుకోవచ్చు.
135 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో
లాక్ డౌన్ ఎన్ని రోజులు అమలు చేస్తారు ?
అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న !
భారత దేశ జనాభా 135,26,42,280 లో 20,000 కోవిడ్ కేసులు 0.00147 శాతం. కనీసం దేశంలో ఒక శాతం కూడా లేని కోవిడ్ రోగుల గురించి 99.99% మంది ప్రజలకు ఎందుకు శిక్ష.
మితండవాదం...
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం లాక్ డౌన్ అనేది కోవిడ్19 వైరస్‍కు కేవలం తాత్కాలిక పరిష్కారమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. దేశ ప్రజలను కోవిడ్19 వైరస్ నుంచి రక్షించుకునేందుకు లాక్ డౌన్ విధించి, దీన్ని ధపా ధఫాలుగా పొడిగిస్తే కోట్ల మంది ప్రజలు తట్టుకునే స్థితిలో లేరన్నది వాస్తవం కూడా.
దేశంలోని కోట్ల మంది నిరుపేదలు, వలస కూలీలు, సంఘటిత, అసంఘటిత రంగాలలో పని చేసే కార్మికులకు ఇప్పటికే తినడానికి ఏమి లేక దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం వీళ్ళ ప్రయోజనార్థం ప్రకటించిన రూ.1.70లక్షల కోట్లు ప్యాకెజీ, రేషన్ బియ్యం/గోదుమలు, పప్పులు, 3 నెలల పాటు రూ.500 నగదు, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎంత మందికి అందిందో మాత్రం సందేహమే.
ప్రధానమంత్రి మోఢీ విధించిన లాక్డౌన్ కారణంగానే దేశం కోవిడ్19 వైరస్ నుంచి సురక్షితంగా ఉందని 18కోట్ల మంది ప్రతి సెకండు వివిధ మాధ్యమాల్లో భజన చేస్తున్న.. వాస్తవానికి లాక్డౌన్ ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకసారి ఎత్తివేయక తప్పదని వాళ్ళు గ్రహించడం లేదు. దేశ ప్రజల క్షేమానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యవసరం కూడా. అదే విధంగా దేశంలో అధిక శాతం రైతులు, కూలీలు, వలస కార్మికులు, నిరుపేదలు, స్వయం ఉపాధి రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఇతరులు, పారిశ్రామిక వేత్తలు కూడా లాక్ డౌన్ను అంతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని అందరు గమనించాలి.
లాక్డౌన్ తొలగిస్తే కోవిడ్19 వైరస్ ప్రబలుతుంది.. దాని వల్ల ఎక్కువ మంది ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందనేది సత్యమే అయినప్పటికి .. లాక్ డౌన్ సుధీర్ఘకాలం కొనసాగిస్తే దేశంలో కోట్ల మంది నిరుపేదలు, వలస కూలీలు, ఇతరులు, రోగులు భారీ సంఖ్యలో ఆకలితో, ఇది వరకే ఉన్న రకరకాల జబ్బులతో, మానసిక సమస్యలతో చనిపోవడం మాత్రం ఖాయం.
ప్రస్తుతానికి ప్రపంచంలో కోవిడ్19 వైరస్కు ఏ వ్యాక్సిన్ లేనప్పటికి.. దేశంలోని కోట్ల మంది ఆలమటించే ఆకలి అనే వైరస్‍కు వాక్సిన్ అయిన భోజనం అనే మందు మాత్రం మన చేతుల్లోనే ఉంది.
లేని కోవిడ్19 వ్యాక్సిన్ గురించి 135 కోట్ల మంది అమాయక ప్రజలను బలి పశువులను చేయడం కంటే ...
ఎలాంటి నిర్మోహమాటం లేకుండా దేశ జనాభాలో 0.1% శాతం చచ్చిన సరే .. 135 కోట్ల మంది ప్రజల ప్రాణాలను, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే బాధ్యత మాత్రం తప్పకుండా ఢిల్లీ పాలకులదే! ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మెజార్టీ ఎటు ఉంటే అటే ప్రభుత్వం అటే మొగ్గు చూపక తప్పదు!!
లాక్ డౌన్ సడలింపులు..
సుధీర్ఘ కాలం లాక్ డౌన్ పొడిగించలేమని ప్రధాని మోఢీకి బాగా అర్థమయింది. అందుకే మే 3వరకు లాక్ డౌన్ రెండోసారి పొడిగించి, ఏప్రిల్ 20 నుండి అనేక సడలింపులు ఇచ్చారు. వాస్తవానికి ఇదే పెద్ద సంకేతం. లాక్ డౌన్ వల్ల ఏర్పడుతున్న ఆర్థిక మాంద్యానికి, ప్రజల నుండి ఏర్పడే వ్యతిరేకతను చల్లర్చాడానికి పాలకుల కుటీల పన్నాగమని. ఈ సడలింపుల వల్ల కూడా పెద్ద ప్రయోజనం ఉండక పోవచ్చు ఎందుకంటే..
ఇటీవల ఒక వ్యక్తి దగ్గితే తుఫాకీతో కాల్చిన వార్తను చూశాం...
ఒక వ్యక్తి తుమ్మితే నడి రోడ్డుపై చెలరేగిన వివాదం చూశాం..
నగరాల్లోని చాలా అపార్టుమెంట్ల బిల్డింగ్ లోపలికి కనీసం పాలవాన్ని, గ్యాస్/మినరల్ వాటర్ క్యాన్లు మోసే వ్యక్తులను కూడా లోపలికి రానీయడం లేదు..
కనీసం (కోవిడ్19 వైరస్ కాకుండా) జబ్బు చేసి చనిపోయిన మృతుల శవాలను మోయడానికి కూడా వారి స్వంత బంధువులే ముందుకు రాకపోవడం అత్యంత అమానుషం.
ఇలాంటి పరిస్థితుల్లో ఉదాహరణకు ఒక ప్లంబర్, ఒక ఎలక్రిష్టియన్ ఎలా స్వేచ్ఛగా పని చేయగలుగుతాడో పాలకులకే తెలియాలి.
లాక్డౌన్ సమర్థించే మేధావులకు సూచన...
లాక్ డౌన్ ను బలంగా సమర్థించే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండి కోవిడ్19 వైరస్‍కు వాక్సీన్ కనుగొన్న తరువాతే ఇంటి నుండి బయటికి రావచ్చు లేదా మీకు మీరే స్వయంగా నచ్చినన్ని రోజులు లాక్డౌన్ విధించుకోవచ్చు. దానికి ప్రభుత్వంతో సంబంధం లేదు. మోఢీ, కెసిఆర్, జగన్మోహన్ రెడ్డిలు మీకు చెప్పాల్సిన ఆగత్యం లేదు. మీతో చర్చలు జరపాల్సిన అవసరం అంత కంటే లేదు. నీ సుఖం, నీ ప్రాణం గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే నువ్వు ఆలోచించినప్పుడు.. దేశంలోని 135 కోట్ల మంది మెజార్టీ ప్రజల ఇబ్బందుల గురించి కూడా ఆలోచించాలి. ఆ ఆలోచన నీకు లేనప్పుడు నీకు నువ్వే లాక్ డౌన్ విధించుకో..నీ కాళ్ళకు చెప్పులు వేసుకుంటే సరిపోతుంది.. దేశమంతా తివాచీ పరవాల్సిన అవసరం లేదు కదా !!
Comments
Post a Comment