ఆర్నవ్ అబద్ధాలు అన్నీఇన్నీ కావయా..!
ఇప్పుడు దేశం మొత్తం కరోనాతోపాటు రెండు రోజులుగా రిపబ్లిక్ న్యూస్ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నవ్ గోస్వామిపై జరిగిన దాడి గురించి కూడా చర్చించుకుంటున్నారు. తాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తనపై ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని ఆర్నవ్ ఆరోపించాడు. ఇదే విషయాన్ని అతనిపై దాడి జరిగిన రాత్రే ట్విట్టర్ ద్వారా వైరల్ చేశాడు. కానీ ఇతడు చెప్పిన దాంట్లోనే ఎన్నో విషయాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవేమిటంటే..
అనుమానం-1)
ఆర్నవ్ చెప్పిన ప్రకారం అతనిపై రాత్రి 10.58 గంటలకు దాడి జరిగింది. దాడిలో ఇద్దరు పాల్గొన్నారు. కానీ, అందరికీ తెలిసిన వివాదాస్పద బీజేపీ నాయకుడు 10.35 గంటలకు, మరో ఆరెస్సెస్ నాయకుడు అశోక్ పండిట్ 10.25 గంటలకే ఆర్నవ్ పై జరిగిన దాడిని ఖండించారు. ఆర్నవ్ చెప్పిన ప్రకారం అతనిపై 10.58 గంటలకు దాడి జరిగితే ఈ ఇద్దరు భగ్వా నాయకులు అంతకు ముందే ట్వీట్ చేయడం గమనార్హం!
అనుమానం-2)
దాడి చేసిన వారిని ఆర్నవ్ సెక్యూరిటీ ఆఫీసర్లు పట్టుకొని విచారిస్తే వారు కాంగ్రెస్ కార్యకర్తలమని ఒప్పుకున్నారట! అలాంటప్పుడు ఆ పట్టుకున్న వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు బంధించలేదు ? పోలీసులకు ఎందుకు అప్పజెప్పలేదు?
అనుమానం-3)
ఇది అతిముఖ్యమైనది. ఆర్నవ్ గోస్వామి 'చాలా పొడిచే' పాత్రికేయుడు అని గుర్తించిన కేంద్రం అతనికి మన ప్రధాని మోదీ ఆదేశాలతోనే 'వై' కేటగిరీ భద్రత కల్పించారు. ఇంతటి భద్రతను చీల్చుకొని, దాడి చేసిన ఆ ఇద్దరు అర్ణవ్ దగ్గరికి ఎలా రాగలిగారు? ఇది దాదాపు అసాధ్యం.
ఇవి కాకుండా.. ఆర్నవ్ గోస్వామి కుటుంబానికి బీజేపీతో మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. అవేలాగంటే తండ్రి భాజపా టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు, మేనమామ భాజపా ఎమ్మెల్యే. ఇవ్వన్నీ పరిగణలోకి తీసుకొని ఆర్నవ్ పై జరిగిన దాడిని ఆయనే స్వయంగా ప్లాన్ చేశాడని, తమ కార్యకర్తల పని కాదని కాంగ్రెసీయులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పై అనుమానాలను పరిశీలిస్తే కాంగీయుల అనుమానమే నిజమేమోనని అనిపించకమానదు.
Comments
Post a Comment