Posts

గూఢచారి "పావురం" అరెస్ట్ !

Image
పాకిస్తాన్ గూఢచర్యం కోసం శిక్షణనిచ్చినట్లు అనుమానిస్తున్న ఒక పావురాన్ని జమ్మూకశ్మీర్‌లోని కటువా జిల్లాలో బంధించినట్లు 'ఏఎన్ఐ' వార్తా సంస్థ తెలిపింది. పాకిస్తాన్ - భారత మధ్య అంతర్జాతీయ సరిహద్దులోని కంచె సమీపంలో పట్టుకున్న ఈ పావురం కాలికి ఒక రింగ్ ఉందని, దాని మీద కొన్ని నంబర్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఏఎన్ఐ కథనం ప్రకారం.. కటువా జిల్లాలోని మన్యారీ గ్రామంలో స్థానికులు సోమవారం నాడు ఈ పావురాన్ని పట్టుకున్నారు. దానిని అధికారులకు అప్పగించారు. ''అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. స్థానికులు మన కంచె సమీపంలో దీనిని బంధించారు. పావురం కాలికి ఒక రింగ్ ఉంది. దాని మీద కొన్ని నంబర్లు ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్నాం'' అని కథువా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర మిశ్రా పేర్కొన్నారు. ఆ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది, దాని మీద ఉన్న నంబర్లకు అర్థం ఏమిటి అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ''ఈ కేసులను (చొరబాట్లకు సంబంధించిన కేసులను) చూసుకునే ఆపరేషన్స్ గ్రూప్ జమ్మూకశ్మీర్‌లో ఉంది. తాజా పరిణామం గురించి వారికి సమాచారం ఇచ్చాం. వారు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తు...

పౌరసత్వం కూడా అమ్ముకునే ఓ దేశముంది తెలుసా..?

Image
పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఇప్పుడు అంగడి సరకుగా మారింది. అదొక పెట్టుబడిగా మారింది. వ్యాపారంగా విస్తరించింది. ఒక దేశ పౌరసత్వం అనేది గతంలో ఎన్నడూ లేనంత అనిశ్చిత భావనగా మారింది. 50 ఏళ్ల కిందట.. ద్వంద్వ పౌరసత్వాన్ని దేశాలు అనుమతించేవి కాదు. కానీ, ఇప్పుడు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండటం అనేది విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు పెట్టుబడి ద్వారా పౌరసత్వం కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిపుణుడు, స్విస్ న్యాయవాది క్రిస్టియన్ కలిన్ అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు పౌరసత్వం అనేది ఒక ప్రపంచ పరిశ్రమ. దీని విలువ ఏడాదికి రూ. 1.77 లక్షల కోట్లు. ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌లో ఉన్న ప్రపంచస్థాయి పెద్ద సంస్థల్లో ఒకటైన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ చైర్మన్‌ కలిన్‌ను 'మిస్టర్ పాస్‌పోర్ట్' అని కూడా పిలుస్తుంటారు. ఇతర దేశాల పౌరసత్వం లేదా ఆయా దేశాల్లో నివాసం పొందేందుకు ధనికులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడమే ఈయన వ్యాపారం. పౌరసత్వం గురించి మన సంప్రదాయ అభిప్రాయాలన్నీ పాతబడిపోయాయని ఆయన అంటారు. ''ప్రపంచంలో ఇప్పటికీ రక్త సంబంధాలతో ముడిపడిన, లేదంటే మీరు ఎక్కడ ...

గర్భవతని కూడా చూడకుండా ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు?

Image
స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 2.30కు ఆగ్నేయ‌ దిల్లీలోని స‌ఫూరా జ‌ర్గ‌ర్ ఇంటికి పోలీసులు వ‌చ్చారు. నిద్ర‌పోతున్న‌ ఆమెను లేపి, త‌మ‌తో రావాల‌ని అడిగారు. జామియా మిలియా యూనివ‌ర్సిటీలో సోషియాల‌జీ విద్యార్థిని అయిన 27ఏళ్ల‌ స‌ఫూరాకు 19 నెల‌ల కిందట పెళ్ళయింది. వారం రోజుల క్రితమే గ‌ర్భం దాల్చిన‌ట్లు ఆమెకు తెలిసింది. "త‌న‌కు వాంతులు అవుతున్నాయి. చాలా నీర‌సంగా కూడా ఉంది"అని ఆమె భ‌ర్త బీబీసీకి తెలిపారు. దిల్లీ పోలీసుల్లోని ఉగ్ర‌వాద నిరోధ‌క విభాగ‌మైన స్పెష‌ల్ సెల్ నుంచి తాము వ‌చ్చామ‌ని, సెంట్ర‌ల్ దిల్లీలోని త‌మ కార్యాల‌యానికి త‌మ‌తో రావాల‌ని ఆమెకు చెప్పారు. పౌర‌సత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన నిర‌స‌న‌లో ఆమె పాత్రపై కొన్ని ప్ర‌శ్న‌లు అడ‌గాల‌ని అనుకుంటున్నామ‌ని చెప్పారు. ముస్లింల‌పై వివ‌క్ష చూపేలా ఉంద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న ఈ పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ చ‌ట్టం (సీఏఏ)పై దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర‌స‌న‌లు జ‌రిగాయి. దిల్లీలో అయితే మ‌త ఘ‌ర్ష‌ణ‌లూ చోటుచేసుకున్నాయి. పోలీస్ స్టేష‌న్‌లో కొన్ని గంట‌ల‌పాటు ప్ర‌శ్నించిన అనంత‌రం ఏప్రిల్ 10, శుక్ర‌వారం, రాత్రి 10.30కు స‌ఫూరాను అరెస్టు చేసినట్లు పో...

అక్కడ వెండి నాణేల వాన కురిసిందట !

Image
ఓ ఇంటి పునాది గోడ కూలిపోవడంతో.. అందులో వెండి నాణేలు బయటపడ్డట్టు చెబుతున్నారు. ఈ నాణేలు బ్రిటీష్ కాలం నాటివి అని అంటున్నారు. అప్పట్లో బొందు అమ్మోరయ్య,ఎల్లమ్మ అనే ధనవంతులైన మత్స్యకార కుటుంబం ఆ ఇంట్లో నివసించేదని.. ఆ సమయంలోనే గోడల్లో వెండి నాణేలు దాచిపెట్టి ఉంటారని అంటున్నారు. అయితే తూర్పుగోదావరి సాగర తీరంలో వెండి నాణేల తుఫాన్ కురిసింది. తుఫాను కారణంగా సముద్ర అలల ఉద్ధృతికి తీరంలో కూలిన ఇంటి గోడల్లో వెండి నాణేలు కురిశాయ్. జనం కాస్తా ఎగబడి వెండి నాణాలు ఏరుకున్నారు. వీటిని పురావస్తు శాఖ ఇప్పుడు వెండి నాణేలు ఎక్కడ లాక్కుపోతారోనని గోప్యంగా దాచేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్రతీరంలో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలల తాకిడికి తీర ప్రాంతంలోని గ్రామాల్లో ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోయాయ్. ఉప్పాడ కొత్తపల్లిలో కాలనీల్లోకి సముద్ర జలాలు ప్రవేశించాయ్. అలల తాకిడికి కొన్ని ఇళ్లు కొట్టుకుపోయాయ్. సుమారు 8 గృహాలు వరకూ నేలకు ఒరిగాయ్. యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో కూలిన ఇంటి గోడల్లో నుంచి వెండి నాణేలు రాలిపడ్డాయ్. ఓ ఇంటి పునాది గోడ కూలటంతో వెండి నాణే...

బిర్యానీని బిర్యానీ అనే ఎందుకంటారు ?

Image
బిర్యానీ (Biryani) అనే ప‌దం Birian అనే ప‌ర్షియ‌న్ ప‌దం నుంచి వ‌చ్చింది. Birian అంటే.. ప‌ర్షియ‌న్ భాష‌లో fried before cooking అనే అర్థం వ‌స్తుంది. అంటే వండేందుకు ముందుగా ఫ్రై చేయ‌డ‌మ‌ని అర్థం. ఇక బిర్యానీని కూడా దాదాపుగా ఇలాగే చేస్తారు, అందుక‌నే దాన్ని బిరియ‌న్ అని మొద‌ట్లో పిలిచేవారు. త‌రువాత అదే బిర్యానీ అయింది. కాగా మొద‌ట బిర్యానీని 1398లో త‌యారు చేసిన‌ట్లు చ‌రిత్ర చెబుతోంది. అప్ప‌ట్లో ట‌ర్క్ మంగోల్ చ‌క్ర‌వ‌ర్తి టిమూర్.. ఓ కుండ‌లో బియ్యం, మ‌సాలాలు, మాంసం త‌దిత‌ర అన్ని ప‌దార్థాల‌ను వేసి బాగా ఉడికించి బిర్యానీ త‌ర‌హా ఆహారాన్ని త‌యారు చేయించాడ‌ని చ‌రిత్ర‌కారులు చెబుతారు. అయితే క్రీస్తు శ‌కం 2వ శ‌తాబ్దంలోనే అర‌బ్ వ‌ర్త‌కులు బిర్యానీని మ‌న దేశానికి ప‌రిచ‌యం చేశారని మ‌రికొంద‌రు అంటారు‌. అప్ప‌ట్లో వారు దీన్ని Oon Soru అనే త‌మిళ పేరుతో పిలిచేవార‌ట‌. అయితే నిజానికి అస‌లైన హైద‌రాబాద్ బిర్యానీని మాత్రం మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులే త‌యారు చేయించిన‌ట్లు ఆధారాలున్నాయి. మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల కాలంలో ఓ సారి మ‌హారాణి ముంతాజ్ సైనిక స్థావ‌రాల వ‌ద్ద‌కు వెళ్లి చూడ‌గా.. సైనికులంద‌రూ చాలా బ‌ల‌హీనంగా, శ‌క్...

హత్య చేయగల భర్తలను ముందే పసిగట్టవచ్చు!

Image
ప్రపంచవ్యాప్తంగా 2017లో దాదాపు 30,000 మంది మహిళలను వారి ప్రస్తుత లేదా మాజీ జీవిత భాగస్వాములు హత్యచేశారు. భార్య కానీ, సహచరి కానీ.. తమ జీవిత భాగస్వాములను హత్య చేసే పురుషులు ''ఒక హత్యా క్రమాన్ని'' అనుసరిస్తారని నేరశాస్త్రం ప్రవీణులైన డాక్టర్ జేన్ మాంక్టన్ స్మిత్ చెప్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ గ్లోసెస్టర్‌షైర్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆమె బ్రిటన్‌లో 372 హత్యలను అధ్యయనం చేశారు. ఆ హత్యలన్నిటిలోనూ ఎనిమిది దశలుగా సాగిన ఒక హత్యా క్రమాన్ని గుర్తించారు. ఎవరైనా ఒక పురుషుడు తన జీవిత భాగస్వామిని హత్య చేయగలడనటానికి.. భౌతికంగా నియంత్రించే అతడి ప్రవర్తన కీలక సూచిక కావచ్చునని డాక్టర్ జేన్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో గుర్తించిన అంశాలు.. ప్రాణాలను కాపాడటానికి దోహదపడగలవని ఒక హతురాలి తండ్రి అభిప్రాయపడ్డారు. పోలీసులు ఈ ఎనిమిది దశలను పసిగట్టగలిగితే చాలా హత్యలను నివారించవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. జీవిత భాగస్వాముల చేతుల్లో హత్యకు గురవుతున్న వారిలో మహిళలు 80 శాతం పైగా ఉన్నారని.. అత్యధిక ఉదంతాల్లో హత్య చేసిన భాగస్వామి పురుషుడేనని డాక్టర్ జేన్ చెప్పారు. ఈ అధ్యయనం కోసం.. హతురాలి...

అగ్నిగుండంలా తెలంగాణ

Image
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రచండ భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడింది. ఎండ వేడికితోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రిపూట కూడా ఆ వేడి తగ్గలేదు. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు అల్లాడిపోయారు. రోహిణి కార్తె కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత దాటితే ఆయా ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించిందని నమస్తే తెలంగాణ చెప్పింది. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నందున వడగాల్పుల తీవ్రత సైతం పెరగనున్నట్లు, ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్‌ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతా...

నూతిలో తొమ్మిది శవాలు.. ఉలిక్కిపడ్డ ఓరుగల్లు

Image
వరంగల్ నుంచి నర్సంపేట వెళ్లేదారిలో కాశిబుగ్గ దాటి కాస్త ముందుకు వెళితే ఎడమవైపు ఒక దారి ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళితే బోలెడన్ని పరిశ్రమలు, ముఖ్యంగా కోల్డ్ స్టోరేజీలూ, వాటిల్లో పనిచేసే కార్మికులు.. ఇలా ఎంతో హడావుడిగా ఉంటుంది. పరిశ్రమల ప్రాంతం కావడంతో లారీల దెబ్బకు గుంతలు పడ్డ రోడ్డు మీదుగా తిన్నగా వెళ్తే ఎడం వైపున పచ్చటి రంగు వేసి ఉన్న ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్, దాని ఎదురుగా ఒక మట్టి రోడ్డు ఉంటుంది. ఆ దారిలో కాస్త ముందుకు వెళ్లాక కుడివైపున నీలం గేటున్న పెద్ద కాంపౌండ్ అందులో గొడౌన్ రెండు చిన్న గదుల బిల్డింగూ కనిపిస్తాయి. ఏం జరిగినా ఎవరికీ తెలియనంత దూరమూ కాకుండా, అలాగని ఏం జరిగినా తెలిసిపోయేంత దగ్గరా కాకుండా ఇళ్లున్నాయి ఆ గొడౌన్ పక్కన. వరంగల్ లో ఎండుమిర్చి, పత్తి, వరి ఎగుమతులు, నిల్వ కోసం గోనెసంచుల అవసరం బాగా ఉంటుంది. ఈ నీలం గేటున్న గోదాంలో ఆ గోనెసంచులు బాగు చేసే వ్యాపారం చేస్తారు సంతోష్, భాస్కర్ అనే ఇద్దరు పార్టనర్లు. గురువారం పొద్దుట ఒక కష్టమర్ కి సరుకు అందించడం కోసం ఒక ఆటోను తమ గొడౌన్ కి పంపారు పార్టనర్ భాస్కర్. అడ్రస్ చెప్పి అక్కడ మా వాళ్లు రిసీవ్ చేసుకుంటారని చెప్పాడు. ...

మహమ్మారికి దీటుగా వ్యాపిస్తున్న అపోహలు

Image
కరోనావైరస్‌తోపాటు దాని గురించి అనేక అపోహలు, తప్పుడు సమాచారం ప్రపంచమంతటా వ్యాపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రచారంలోకి వచ్చిన అలాంటి కొన్ని కథనాలను మేం గుర్తించాం. వాటి నిగ్గు తేల్చే ప్రయత్నం చేశాం. శాకాహారమే తినాలని లేదు తప్పుదోవ పట్టించే, కొన్ని సార్లు హాని కలిగించే విషయాలను కూడా మంచి విషయాలతో కలిపి కొందరు ప్రచారంలో పెడుతుంటారు. ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా వేదికల్లో ప్రచారమవుతున్న కారణంగా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించడం కష్టం. భారత వైద్య సంస్థలు, ఓ ప్రముఖ డాక్టర్ ఇటీవల వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారమవుతున్న ఓ సందేశాన్ని ఖండించారు. ఆ సందేశంలో కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు ఉన్నాయి. భౌతిక దూరం పాటించడం, జనం ఎక్కువగా ఉండే చోట్లకు వెళ్లకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ కొన్ని మంచి విషయాలు కూడా వాటిలో ఉన్నాయి. కానీ, ఇదే సందేశంలో శాకాహారాన్ని ఎంచుకోమన్న సలహా ఉంది. బెల్టులు, ఉంగరాలు, చేతి గడియారాలు ధరించవద్దని ఉంది. ఈ చర్యల వల్ల కరోనావైరస్ రాకుండా ఉంటుందని ఎక్కడా నిరూపితం కాలేదు. ప్రపంచ, ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పోషకాల సమత...