పౌరసత్వం కూడా అమ్ముకునే ఓ దేశముంది తెలుసా..?


పుట్టుకతో వచ్చే పౌరసత్వం ఇప్పుడు అంగడి సరకుగా మారింది. అదొక పెట్టుబడిగా మారింది. వ్యాపారంగా విస్తరించింది. ఒక దేశ పౌరసత్వం అనేది గతంలో ఎన్నడూ లేనంత అనిశ్చిత భావనగా మారింది. 50 ఏళ్ల కిందట.. ద్వంద్వ పౌరసత్వాన్ని దేశాలు అనుమతించేవి కాదు. కానీ, ఇప్పుడు రెండు దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండటం అనేది విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు పెట్టుబడి ద్వారా పౌరసత్వం కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. నిపుణుడు, స్విస్ న్యాయవాది క్రిస్టియన్ కలిన్ అభిప్రాయం ప్రకారం, ఇప్పుడు పౌరసత్వం అనేది ఒక ప్రపంచ పరిశ్రమ. దీని విలువ ఏడాదికి రూ. 1.77 లక్షల కోట్లు.

ప్రస్తుతం వేగంగా వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌లో ఉన్న ప్రపంచస్థాయి పెద్ద సంస్థల్లో ఒకటైన హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ చైర్మన్‌ కలిన్‌ను 'మిస్టర్ పాస్‌పోర్ట్' అని కూడా పిలుస్తుంటారు. ఇతర దేశాల పౌరసత్వం లేదా ఆయా దేశాల్లో నివాసం పొందేందుకు ధనికులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడమే ఈయన వ్యాపారం. పౌరసత్వం గురించి మన సంప్రదాయ అభిప్రాయాలన్నీ పాతబడిపోయాయని ఆయన అంటారు. ''ప్రపంచంలో ఇప్పటికీ రక్త సంబంధాలతో ముడిపడిన, లేదంటే మీరు ఎక్కడ పుట్టారన్నదానిపై ఆధారపడిన కొన్ని విషయాల్లో ఇదొకటి'' అని కలిన్ బీబీసీతో చెప్పారు. పౌరసత్వంపై పునరాలోచించాల్సిన అవసరం వచ్చిందని ఆయన చెబుతున్నారు. మనం ఎక్కడ పుట్టామనేది మన నైపుణ్యాలు, ప్రతిభతో ఏమాత్రం సంబంధం లేని వ్యవహారమని, ఇది కేవలం అదృష్టం కారణంగానే జరుగుతుందని కలిన్ తెలిపారు. 'ఇది అత్యంత అన్యాయమైన విషయం' అని అభిప్రాయపడ్డారు.

'సభ్యత్వం ఇచ్చినట్లుగా పౌరసత్వం ఇవ్వటంలో తప్పేముంది? ప్రతిభ ఉన్న, ఉన్నతికి పాటుపడే ప్రజలను తీసుకోవటంలో తప్పేముంది?' అని ఆయన ప్రశ్నిస్తున్నారు. కలిన్ వాదనను సమర్థించేవారు కూడా కొందరు ఉన్నారు. కానీ, చాలామందికి మాత్రం పాస్‌పోర్టు అనేది ఒక గుర్తింపు. అలాంటివారు పాస్‌పోర్టు ఒక కొనుగోలు చేయదగ్గ వస్తువు అంటే ఒప్పుకోరు. నాలుగేళ్ల కిందట ఈ దేశం తన నూతన పౌరసత్వ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ దేశ పౌరసత్వంపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. వానువాటు దేశ ప్రభుత్వ ఆదాయంలో అతిపెద్ద భాగం ఇప్పుడు పాస్‌పోర్టుల నుంచే వస్తోంది. వానువాటు పాస్‌పోర్టు ఉన్నవారు ఎలాంటి వీసా లేకుండానే యూరప్ మొత్తం ప్రయాణించొచ్చు. ఈ పాస్‌పోర్టు కోరుకుంటున్న వారిలో ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది ఇదే.

వానువాటు పాస్‌పోర్టులు పొందుతున్న విదేశీయుల్లో చాలామంది ఆ దేశంలో కాలుపెట్టరు. విదేశాల్లోని కార్యాలయాల్లోనే పౌరసత్వం కోసం వారు దరఖాస్తు చేస్తున్నారు. అలాంటిదే హాంగ్‌కాంగ్‌ కేంద్రంగా పనిచేసే పీఆర్‌జీ కన్సల్టింగ్. ఈ సంస్థ వనవాటు పౌరసత్వం ఇచ్చేందుకు లైసెన్స్ ఉన్న బ్రోకరింగ్ సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద సిటిజన్‌షిప్ మార్కెట్ ప్రాంతాల్లో హాంగ్‌‌కాంగ్‌ ఒకటి. హాంగ్‌కాంగ్ విమానాశ్రయంలోని ఒక కెఫేలో మేం పౌరసత్వం ఏజెంట్ 'ఎంజే'ని కలిశాం. ప్రైవేట్ బిజినెస్‌ మ్యాన్ అయిన ఎంజే... హాంగ్‌కాంగ్‌లో పెరిగిపోతున్న చైనీయులకు రెండు.. లేదంటే మూడో పాస్‌పోర్టు పొందేందుకు సహాయం చేస్తుంటారు. ''వాళ్లు (చైనాలో) భద్రంగా ఉన్నామనుకోవట్లేదు'' అని తన క్లయింట్ల గురించి ఆయన చెబుతుంటారు. ''యూరప్‌కు వెళ్లేందుకు, ఒక బ్యాంకు ఖాతా తెరిచేందుకు, ఆస్తులు కొనేందుకు, వ్యాపారాలు ప్రారంభించేందుకు వాళ్లు మార్గం కోరుకుంటున్నారు.'' పౌరసత్వం ఒక పోటీతత్వం ఉన్న ప్రపంచ మార్కెట్. చాలా చిన్న, ద్వీప దేశాలకు.. ముఖ్యంగా కరీబియన్ ప్రాంతంలోని వాటికి... ఒక పాస్‌పోర్ట్ పొందేందుకు అయ్యే ధర దాదాపు 1.06 కోట్ల రూపాయలు. వానువాటు పాస్‌పోర్ట్ పొందాలన్నా కూడా సుమారు అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

ఒక పాస్ట్‌పోర్ట్ కొనాలంటే ఎంత ఖర్చవుతుంది?
ఆంటిగ్వా అండ్ బార్బడా - రూ. 71 లక్షల నుంచి మొదలు
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ - రూ. 1.06 కోట్ల నుంచి మొదలు
మాంటెనెర్గో - రూ. 1.94 కోట్ల నుంచి మొదలు
పోర్చుగల్ - రూ. 2.72 కోట్ల నుంచి మొదలు
స్పెయిన్ - రూ. 3.90 కోట్ల నుంచి మొదలు
బల్గేరియా - రూ. 3.97 కోట్ల నుంచి మొదలు
మాల్టా - రూ. 7.10 కోట్ల నుంచి మొదలు
అమెరికా - పది ఉద్యోగాలు కల్పించే ఒక వ్యాపారంలో రూ. 3.55 కోట్ల నుంచి రూ. 7.10 కోట్ల వరకూ పెట్టుబడి
బ్రిటన్ - రూ. 17.75 కోట్ల నుంచి మొదలు

వానువాటు పాస్‌పోర్టును చాలా వేగంగా (30 రోజుల్లో) పొందవచ్చునని ఎంజే వివరించారు. దాన్ని పొందడం మంచి ఎంపిక అని చెప్పారు. అయితే, వానువాటు అవినీతికి పేరొందిన దేశమని కలిన్, ఇతరులు హెచ్చరిస్తున్నారు. అందువల్లనే హెన్లీ అండ్ పార్ట్‌నర్స్, ఇతరులు వానువాటు సిటిజన్‌షిప్ కార్యక్రమంతో వ్యాపారాలు చేయట్లేదు. అయినప్పటికీ, చైనా నుంచి పెరుగుతున్న ఆసక్తిని మాత్రం ఇది ఆపలేదు. కొన్నేళ్ల క్రితం హాంగ్‌కాంగ్ టెలివిజన్ చానెళ్లు వనవాటు పౌరసత్వాన్ని ప్రచారం చేసే ఆసక్తికరమైన టీవీ యాడ్స్‌ని ప్రసారం చేశాయి. చైనా నుంచి పెరుగుతూ ఉన్న పర్యాటకులను ఆకర్షించడమే ఈ ప్రకటనల లక్ష్యం. అయితే, వనవాటు పౌరసత్వం పొందిన తర్వాత ఎంత మంది చైనీయులు ఆ దేశం వెళతారు? బహుశా 10 మందిలో ఒకరు అని ఎంజే అంచనా వేశారు. వానువాటు రాజధాని పోర్ట్ విలా, పరస్పర వైరుధ్యాలతో కూడిన నగరం. ఇక్కడ రోడ్లపై తరచూ నీళ్లు ప్రవహిస్తుంటాయి, గుంతలు భయపెడుతుంటాయి. ట్రాఫిక్ లైట్ల సిగ్నల్ వ్యవస్థ ఒక్కటి కూడా ఉండదు, కానీ చిన్నచిన్న నాలుగు చక్రాల వాహనాలతో పాటే ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతోంది.

పన్ను ఎగవేతదారుల స్వర్గంగా భావించే వానువాటు అవినీతి, పారదర్శకత లేకపోవటం వంటి సమస్యల కారణంగా... యురోపియన్ యూనియన్ 'బ్లాక్‌లిస్ట్' దేశాల జాబితాలో ఈ మధ్యనే తిరిగి చేరింది. 'ని వానువాటు' అని పిలిచే ఈ దేశ ప్రజలు అధికారికంగా తమంతట తాముగా పౌరులుగా గుర్తింపు పొందింది 1980లోనే. అప్పుడే వానువాటు దేశానికి స్వతంత్రం లభించింది. అంతకుముందు ఇది ఆంగ్లో-ఫ్రెంచి ఉమ్మడి ఆధీనంలోని ప్రాంతం. దీన్ని న్యూ హెర్బైడ్స్ అని పిలిచేవాళ్లు. ఈ ప్రాంత ప్రజలంతా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో విసిరేసినట్లుగా ఉండే 80 దీపాల్లో నివసిస్తారు. 40 ఏళ్ల కిందట వారికి ఒక దేశమంటూ లేదు. మాజీ ప్రధాని బరాక్ సోపే పోర్ట్ విలా ప్రధాన రహదారిపై ఉన్న ఒక హోటల్ కాసినోలో బీబీసీతో మాట్లాడుతూ, ''1980 వరకూ నాకు పాస్‌పోర్ట్ లేదు. బ్రిటిషర్లు, ఫ్రెంచివాళ్లు నాకు ఇచ్చిన ఒక కాగితం ముక్క పట్టుకుని నేను ప్రయాణించాల్సి వచ్చేది. అది చాలా అవమానకరంగా ఉండేది'' అని అన్నారు. ''పౌరసత్వాన్ని అమ్మడం వనవాటుకు వెన్నుపోటు పొడవటమే. చైనీయులకు మా కంటే చాలా ఎక్కువ డబ్బు ఉంది'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో చైనీయుల పెట్టుబడులు వరదలా పెరుగుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. చైనా పెట్టుబడులపై సోపే లాంటి చాలామంది స్థానికులు విమర్శలు చేస్తున్నారు. చైనా కంపెనీలు డబ్బు మొత్తాన్నీ తమదగ్గరే పెట్టుకుంటాయని, చైనా కార్మికులకే ఉపాధి కల్పిస్తాయని వారు ఆరోపిస్తున్నారు. వానువాటు ప్రభుత్వంలో అంతా పురుషులే ఉన్నారు. రాజకీయాల నుంచి మహిళలను పూర్తిగా తప్పించిన ప్రపంచంలోని మూడు దేశాల్లో వనవాటు ఒకటి. ఈ సిటిజన్‌షిప్ కార్యక్రమం గురించి బీబీసీతో మాట్లాడేందుకు వనవాటు ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించలేదు. అయితే, మేం ప్రభుత్వం నియమించిన సిటిజన్‌షిప్ ఏజెంట్ బిల్ బానీతో మాట్లాడాం.

''వానువాటును ప్రపంచ స్థాయి దృష్టితో చూడాలి. ఆదాయం కోసం, జీవనం కోసం ఇతర దేశాలు పాస్‌పోర్టులు విక్రయిస్తుంటాయి. మాకు సహజ వనరులు ఎక్కువగా లేవు. ఇది (సిటిజన్‌షిప్ కార్యక్రమం) మాకు చాలా డబ్బు తెస్తోంది'' అని ఆయన అన్నారు. 2015లో ప్రారంభమైనప్పటి నుంచీ ఈ కార్యక్రమం.. గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న ఈ దేశంలో చాలా వివాదాస్పదం అయ్యింది. యాన్ పకోవా అనే ఒక కమ్యూనిటీ లీడర్ మాకు వానువాటులోని ఒక గ్రామాన్ని చూపించారు. ఈ గ్రామంలో ఇళ్లన్నీ ఇనుప రేకులతో తయారయ్యాయి. రాజధాని నగరం షాపులు, రెస్టారెంట్ల నుంచి 10 నిమిషాల పాటు ప్రయాణిస్తే ఈ గ్రామం వస్తుంది. అయితే, ఈ పది నిమిషాల్లో మరో ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. 2015లో వచ్చిన పామ్ తుపాను వల్ల దెబ్బతిన్న ఇళ్లను, మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే, పాస్‌పోర్టు అమ్మకాల నుంచి వచ్చిన డబ్బు స్థానికులకు కనిపించడం లేదని అన్నే చెప్పారు. ''మా పూర్వీకులు మా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు విడిచారు. ఇప్పుడు నాకు ఉన్న గ్రీన్ పాస్‌పోర్టునే ఇతర ప్రజలు కూడా పొందుతున్నారు. దాని ధర 1.06 కోట్ల రూపాయలు? ఆ డబ్బు ఎక్కడుంది? ఇది ఆగాలి'' అని ఆమె అన్నారు. ఇదే గ్రామానికి చెందిన సుసాన్ అనే మరో మహిళ ఒక మురికి బావిని మాకు చూపించారు. ''నిరంతరం నీటిని అందించే నల్లా ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. నల్లా ఉంటే పిల్లలు స్నానం చేయగలరు, స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని తాగగలరు'' అని ఆమె చెప్పారు.

చైనీస్ మార్కెట్ నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ విధానంలో ఈ మధ్యకాలంలో మార్పు రావటం కష్టమని స్థానికంగా ఒక న్యూస్ పేపర్ నడిపే డాన్ మెక్‌గ్యారీ అన్నారు. ''మాలాంటి చిన్న దేశానికి ఇదొక గొప్ప డీల్. అయితే, మమ్మల్ని మేం ఒకటి అడగాలి. దీనికోసమేనా మనం పోరాడింది? ఇది సరైనదేనా? ఎంతో కష్టపడి సొంతం చేసుకున్న సార్వభౌమత్వాన్ని వేలంలో ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి అమ్మేయడం కరక్టేనా?'' వానువాటు మాత్రమే కాదు.. పెరుగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో చాలా దేశాలు ఎదుర్కోవాల్సిన ప్రశ్న ఇది. అయితే, కలిన్ చెప్పినట్లు.. ''పెట్టుబడి ద్వారా పౌరసత్వం, పెట్టుబడి వలస కార్యక్రమాలు అనేవి.. అనిశ్చిత స్థితికి ప్రతిరూపంగా మారుతున్న ప్రపంచాన్ని ప్రతిబింబిస్తున్నాయి.''
-----------------------------------------------------------

Citizenship by birth has now become a commodity. It became an investment. Expanded into business. Citizenship of a country has become more uncertain than ever before. 50 years ago .. Dual citizenship is not allowed by countries. But now it is universal to have citizenship of both countries. More than half the countries in the world are investing in citizenship initiatives. According to expert, Swiss lawyer Christian Kalin, citizenship is now a global industry. Its value is Rs. 1.77 lakh crore.

One of the world's largest corporates in this rapidly growing market, Kalin is also known as Mr Passport. His business is to help wealthy people and their families to obtain citizenship or residency in other countries. He says that all of our traditional views on citizenship are outdated. "It's one of the few things in the world that is still tied to blood or where you were born," Kalin told the BBC. He says there is a need to rethink on citizenship. Kalin said that where we are born is an affair that has nothing to do with our skills and talents. 'This is the most unjust thing'.

'What is wrong with giving citizenship as membership? What's wrong with taking on talented, up-and-coming people? ' He asked. There are also some who uphold Kalen's claim. But for many, a passport is an identity. Such people do not accept the passport as a commodity. Four years ago, the country launched its new Citizenship Program. Since then the interest in the citizenship of this country has increased tremendously. A large portion of the airline's government revenue now comes from passports. People who have a passport can travel all over Europe without a visa. This is what attracts the most people who want this passport.

Most foreigners who get air passports do not land in that country. They are applying for citizenship in workplaces abroad. Such is Hong Kong-based PRG Consulting. The company is a licensed brokerage firm that provides licensed citizenship. Hong Kong is one of the largest citizenship market areas in the world. We met with Citizenship Agent Enge at a cafe in Hong Kong Airport. Enzi, a private business man ... is helping two Chinese growing up in Hong Kong or else get a third passport. “They don't feel safe (in China),” he says of his clients. "They want a way to go to Europe, open a bank account, buy property, start a business." Citizenship is a competitive global market. Most small, island nations, especially those in the Caribbean ... The cost of getting a passport is around Rs 1.06 crore. To get a passport, you have to pay around the same amount.

How much does it cost to buy a passport?
Antigua and Barbada - Rs. 71 lakh starting from Rs
St. Kitts and Nevis - Rs. Starting from 1.06 crores
Montenergo - Rs. Starting from 1.94 crores
Portugal - Rs. Starting from 2.72 crores
Spain - Rs. Starting from 3.90 crores
Bulgaria - Rs. Starting from 3.97 crores
Malta - Rs. Starting from 7.10 crores
US - a business that provides ten jobs at a cost of Rs. 3.55 crore to Rs. 7.10 crore investment
Britain - Rs. Starting from Rs 17.75 crore

Enge explained that Vanuatu passport can be obtained very fast (within 30 days). That said, getting it is a good option. However, Kalin and others warn that the country is known for its corruption. This is why Henley and Partners and others do not do business with the Vanuatu Citizenship program. However, this did not stop the growing interest from China. Several years ago, Hong Kong television channels broadcast interesting TV ads promoting Vanuatu citizenship. The ads aim to attract growing tourists from China. However, how many Chinese will go to Vanuatu after they obtain citizenship? Enge estimated that maybe one in 10 people. Port Vila, the capital of Vanuatu, is a city of mutual conflicts. There is frequent watering down the roads and the potholes are intimidating. There is not a single signal system of traffic lights, but there is an increasing traffic congestion with smaller four-wheelers.

Due to issues such as air corruption and lack of transparency, which are considered a haven of tax evaders ... the European Union has recently rejoined its list of 'blacklist' countries. Known as 'Ni Vanuatu', the people of this country officially recognized themselves as citizens in 1980. It was then that Vanuatu gained independence. Earlier it was an Anglo-French joint territory. They call it New Herbides. All the inhabitants of the region live in the 80 islands that are thrown into the South Pacific Ocean. They don't have a country under 40 years old. Former Prime Minister Barack Soppe told the BBC at a hotel casino on the Port Vila main road, “I didn't have a passport until 1980. I had to travel by grabbing a piece of paper given to me by the British and the French. It was very humiliating. '' “Selling citizenship is a backbone to Vanuatu. The Chinese have a lot more money than us, ”he said. He noted that Chinese investment in the region is growing like a flood. Many locals, such as Soap, criticize Chinese investment. They allege that Chinese companies invest all their money and employ Chinese workers. In the Vanuatu government, there are men. Vanuatu is one of only three countries in the world to completely exclude women from politics. The Vanuatu government was not interested in talking to the BBC about the Citizenship program. However, we spoke with Bill Baney, a government-appointed Citizenship Agent.

“Vanuatu needs to be viewed from a global perspective. Other countries sell passports for income and livelihood. We don’t have much natural resources. This (Citizenship Program) is bringing us a lot of money, ”he said. Since its inception in 2015, the program has become increasingly controversial in this country with a rural population. Yan Pacova, a community leader, showed us a village in Vanuatu. All the houses in this village are made of iron. The village is about 10 minutes drive from the capital city shops and restaurants. However, these ten minutes seemed to come into another world. Anne said the government had promised to rebuild the homes and infrastructure damaged by the 2015 palm storm, but that the proceeds from the sale of passports were not visible to locals. '' Our ancestors gave their lives for our independence. Other people are getting the green passport that I have now. Is it worth Rs 1.06 crore? Where's that money going? It must be stopped, '' she said. Another woman, Susan, from the same village, showed us a dirty well. '' I urge the government to give Nullah a regular supply of water. Children can bathe and drink clean, safe water if it is not, '' she said.

Dawn McGarry, who runs a local news paper locally, said that, due to rising demand from the Chinese market, this process is unlikely to change in the meantime. '' This is a great deal for a small country like me. However, we need to ask ourselves one. Is this what we fought for? Is this correct? '' Who can sing the hard-earned sovereignty of the auction? '' However, as Culin says, "Investment through citizenship and investment migration initiatives reflect the world that is becoming the epitome of uncertainty."

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !