మహమ్మారికి దీటుగా వ్యాపిస్తున్న అపోహలు
కరోనావైరస్‌తోపాటు దాని గురించి అనేక అపోహలు, తప్పుడు సమాచారం ప్రపంచమంతటా వ్యాపిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రచారంలోకి వచ్చిన అలాంటి కొన్ని కథనాలను మేం గుర్తించాం. వాటి నిగ్గు తేల్చే ప్రయత్నం చేశాం.
శాకాహారమే తినాలని లేదు
తప్పుదోవ పట్టించే, కొన్ని సార్లు హాని కలిగించే విషయాలను కూడా మంచి విషయాలతో కలిపి కొందరు ప్రచారంలో పెడుతుంటారు. ఎన్‌క్రిప్టెడ్ సోషల్ మీడియా వేదికల్లో ప్రచారమవుతున్న కారణంగా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించడం కష్టం. భారత వైద్య సంస్థలు, ఓ ప్రముఖ డాక్టర్ ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారమవుతున్న ఓ సందేశాన్ని ఖండించారు. ఆ సందేశంలో కరోనావైరస్ బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు ఉన్నాయి. భౌతిక దూరం పాటించడం, జనం ఎక్కువగా ఉండే చోట్లకు వెళ్లకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ కొన్ని మంచి విషయాలు కూడా వాటిలో ఉన్నాయి. కానీ, ఇదే సందేశంలో శాకాహారాన్ని ఎంచుకోమన్న సలహా ఉంది. బెల్టులు, ఉంగరాలు, చేతి గడియారాలు ధరించవద్దని ఉంది. ఈ చర్యల వల్ల కరోనావైరస్ రాకుండా ఉంటుందని ఎక్కడా నిరూపితం కాలేదు. ప్రపంచ, ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పోషకాల సమతుల్యత కోసం ప్రొటీన్ (మాంసంలో ఎక్కువగా ఉంటుంది), పండ్లు, కూరగాయలు లాంటివన్నీ తీసుకోవాలని కోవిడ్-19 నేపథ్యంలో సూచన చేసింది.
ఫ్లూ వ్యాక్సిన్ వల్ల కోవిడ్-19 ముప్పు పెరగదు
ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కోవిడ్-19 ముప్పు గణనీయంగా పెరుగుతుందని పేర్కొంటున్న ఓ పోస్టు ఫేస్‌బుక్‌లో చాలా ప్రచారమైంది. అమెరికా సైన్యం ప్రచురించిన ఓ అధ్యయనం లింక్‌ను కూడా అందుకు ఆధారంగా చూపిస్తూ ఈ పోస్ట్‌లో పెట్టారు. వాస్తవంగా జరిగిన ఓ అధ్యయనం గురించి ప్రస్తావిస్తూ ఈ వదంతి ప్రచారమవుతోంది. కానీ, ఆ అధ్యయనంలో తేలిన విషయాలను వక్రీకరించి ఇందులో చెప్పారు. ఆ అధ్యయనం ప్రచురితమైంది 2019 అక్టోబర్‌లో. అంటే, కరోనావైరస్ కేసులు రాకముందు. 2017-18 ఫ్లూ సీజన్ సమాచారం ఆధారంగా ఆ అధ్యయనం జరిగింది. ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కోవిడ్-19 ముప్పు పెరుగుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. ‘‘ఫ్లూ వ్యాక్సిన్ వల్ల మిగతా శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్ల సోకే ముప్పేమీ పెరగదు’’ అని అమెరికా సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ స్పష్టంగా చెప్పింది.
మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే సమస్యేమీ లేదు
మాస్క్‌లు ఎక్కువ సేపు ధరిస్తే ఆరోగ్యానికి ప్రమాదం ఉందంటూ ఓ తప్పుడు కథనం సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. స్పానిష్ వెబ్‌సైట్లలో మొదటగా ఈ కథనం కనిపించింది. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో చాలా ప్రచారమైంది. దీన్ని అనువదించి ఇంగ్లీష్ వెబ్‌సైట్లు కూడా కథనాలు రాశాయి. ఓ నైజీరియన్ వెబ్‌సైట్‌లో వచ్చిన ఇదే కథనాన్ని ఫేస్‌బుక్‌లో 55వేలకు పైగా మంది షేర్ చేశారు. ఎక్కువ సేపు మాస్క్ ధరించడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుందని, శరీరానికి ఆక్సిజన్ కొరత ఏర్పడి తల తిరగడం మొదలవుతుందని ఆ కథనం పేర్కొంది. ప్రతి పది నిమిషాలకోసారి మాస్క్‌ను తొలగించి, మళ్లీ వేసుకోవాలని సూచించింది. ఈ వాదనలో వాస్తవం లేదని, ఇలా చేయడం ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓకు చెందిన డాక్టర్ రిచర్డ్ మిహిగో బీబీసీతో చెప్పారు.
‘‘వైద్యపరమైన, ఇతర మాస్క్‌లు శ్వాస బాగా అందేలా ఉన్న వస్త్రంతోనే తయారవుతాయి. గాలిని రానిస్తూనే, కొన్ని కణాలను ఆపేసేలా మాస్క్‌లు ఉంటాయి. మాస్క్‌లను తరచూ తీసేస్తూ ఉంటే, ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది’’ అని ఆయన అన్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందని చిన్నారులు, శ్వాసకోశ సమస్యలతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు మాత్రం మాస్క్‌లు ధరించకుండా ఉండాలని చెప్పారు.
పొగ తాగితే వైరస్ పోదు
పొగ తాగేవారికి కోవిడ్-19 ముప్పు తక్కువగా ఉంటుందని బోలెడు కథనాలు వచ్చాయి. యూకే మెయిల్ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్రచురించిన ఇలాంటి కథనానికి ఫేస్‌బుక్‌లో వేల సంఖ్యలో షేర్లు వచ్చాయి. పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఇది నిజమైతే బాగుండని కోరుకుంటూ ఉండవచ్చు. కానీ, ఇది నిజమని చెప్పేందుకు ఆధారాలు లేవు. చాలా దేశాల్లో పొగ తాగే అలవాటున్నవారిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ల రేటు తక్కువగా ఉందని, నిపుణులు కూడా దీనికి వివరణ ఇవ్వలేకపోతున్నారని యూకే మెయిల్ ఆన్‌లైన్ కథనం పేర్కొంది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వ్యాప్తిని నికోటిన్ ఆపుతుండవచ్చని ఫ్రాన్స్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రి అధ్యయనం సూచించింది. నికోటిన్ ప్యాచ్‌లు, నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీలు కరోనావైరస్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి నివారణతో పొగాకు, నికోటిన్‌లకు సంబంధం ఉందని చెప్పేందుకు తగినంత సమాచారం ఇప్పటికైతే లేదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. పొగ తాగేవారికి మిగతా ఆరోగ్య సమస్యలు కూడా ఉండే అవకాశాలున్న కారణంగా, వారికి కరోనావైరస్ నుంచి ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉందని తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న కారణంగా పొగ తాగేవారు ఇప్పుడు ఆ అలవాటుకు దూరంగా ఉండటం మేలని అనేక వైద్యపరమైన సలహాలు సూచించాయి.
-----------------------------------------------------------------
There are many misconceptions and misinformation about coronavirus spreading throughout the world. We have identified some such articles that have come up in the latest campaign. We have tried to restore them.
Some campaigns are misleading, sometimes even harmful, with good things. Because they are advertised on encrypted social media platforms, it is difficult to determine where they came from. A medical doctor, a prominent doctor, recently denied a message circulating in WhatsApp groups. There are many precautions to avoid getting infected with coronavirus. There are also some good things to say about the importance of keeping physical distance, not going to crowded areas, and personal hygiene. But the same message is advised to choose vegetarianism. Don't wear belts, rings, or watches. These actions nowhere prove to prevent coronavirus infection. The World Health Organization (WHO) has instructed the Kovid-19 theme to take in protein (high in meat), fruits and vegetables for nutrient balance.
The flu vaccine does not increase the Covid-19 threat
A post claiming to increase the Kovid-19 threat to flu vaccine users has been widely publicized on Facebook. A link to a study published by the US Army is included in this post. The rumor has been circulating in reference to an actual study. But the findings of the study were twisted and said. The study was published in October 2019. That is, before the arrival of coronavirus cases. That study was based on 2017-18 flu season information. There is no evidence to suggest that the flu vaccine sufferers are at increased risk of Covid-19. The American Center for Disease Control has made it clear that the flu vaccine does not increase the risk of respiratory infections by more than a third.
There is no problem with wearing masks for long
A false narrative is shared on social media that masks may pose a health risk if worn for too long. This article first appeared on Spanish websites. South America and Central America. Translate it and write articles on English websites. A similar article on a Nigerian website has been shared by more than 55 thousand people on Facebook. The article states that wearing a mask for longer periods of time will cause more carbon dioxide to be absorbed, causing the body to experience a shortage of oxygen. Every ten minutes it is suggested to remove the mask and reapply. Dr Richard Mihigo of the WHO told the BBC that this is not true and that it is dangerous to do so.
Other medical and other masks are made of breathable fabric. There are masks that stop some particles while the air is coming off. If the masks are removed frequently, there is a risk of infection, he said. Children who are not fully developed lungs and who have difficulty breathing are advised not to wear masks.
The virus does not go away if you smoke
There have been numerous reports that the Covid-19 threat is lower for smokers. This article, published by the UK Mail Online website, received thousands of shares on Facebook. People who are addicted to smoking may wish it were not good. But, there is no evidence that this is true. According to a UK Mail Online article, the rate of Covid-19 infections is lower among smokers in many countries, and experts are unable to explain it. A leading hospital study in France has suggested that nicotine may stop the spread of Kovid-19 infection. Research is ongoing on how nicotine patches and nicotine replacement therapies have an effect on the coronavirus. The WHO said there is currently insufficient information to determine whether tobacco and nicotine are associated with the prevention of coronavirus outbreaks. Smokers are at greater risk of coronavirus, as they have other health risks. A number of medical advices suggest that smokers should now avoid the habit because of the spread of Kovid-19.
Comments
Post a Comment