నూతిలో తొమ్మిది శవాలు.. ఉలిక్కిపడ్డ ఓరుగల్లు


వరంగల్ నుంచి నర్సంపేట వెళ్లేదారిలో కాశిబుగ్గ దాటి కాస్త ముందుకు వెళితే ఎడమవైపు ఒక దారి ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళితే బోలెడన్ని పరిశ్రమలు, ముఖ్యంగా కోల్డ్ స్టోరేజీలూ, వాటిల్లో పనిచేసే కార్మికులు.. ఇలా ఎంతో హడావుడిగా ఉంటుంది. పరిశ్రమల ప్రాంతం కావడంతో లారీల దెబ్బకు గుంతలు పడ్డ రోడ్డు మీదుగా తిన్నగా వెళ్తే ఎడం వైపున పచ్చటి రంగు వేసి ఉన్న ఒక పెద్ద కోల్డ్ స్టోరేజ్, దాని ఎదురుగా ఒక మట్టి రోడ్డు ఉంటుంది. ఆ దారిలో కాస్త ముందుకు వెళ్లాక కుడివైపున నీలం గేటున్న పెద్ద కాంపౌండ్ అందులో గొడౌన్ రెండు చిన్న గదుల బిల్డింగూ కనిపిస్తాయి. ఏం జరిగినా ఎవరికీ తెలియనంత దూరమూ కాకుండా, అలాగని ఏం జరిగినా తెలిసిపోయేంత దగ్గరా కాకుండా ఇళ్లున్నాయి ఆ గొడౌన్ పక్కన.

వరంగల్ లో ఎండుమిర్చి, పత్తి, వరి ఎగుమతులు, నిల్వ కోసం గోనెసంచుల అవసరం బాగా ఉంటుంది. ఈ నీలం గేటున్న గోదాంలో ఆ గోనెసంచులు బాగు చేసే వ్యాపారం చేస్తారు సంతోష్, భాస్కర్ అనే ఇద్దరు పార్టనర్లు. గురువారం పొద్దుట ఒక కష్టమర్ కి సరుకు అందించడం కోసం ఒక ఆటోను తమ గొడౌన్ కి పంపారు పార్టనర్ భాస్కర్. అడ్రస్ చెప్పి అక్కడ మా వాళ్లు రిసీవ్ చేసుకుంటారని చెప్పాడు. ఆటో డ్రైవర్ అక్కడకు వెళ్లి చూశాడు. ఎవరూ రాలేదు. లోపలకి వెళ్లి పిలిచాడు. ప్చ్.. ఎవరూ లేరు. అక్కడంతా మరోసారి చూసి ఎవరూ రాకపోవడంతో ఆ యజమానికి ఫోన్ చేసి తిరిగి వెనక్కు వెళ్లిపోయాడు. ఆటో డ్రైవర్ మాటలు విన్న భాస్కర్ ఫోన్ పెట్టేసి అక్కడే కాపురం ఉంటోన్న తన ఉద్యోగి మక్సూద్ కి ఫోన్ చేశాడు. స్విచాఫ్ వచ్చింది. దీంతో బండి స్టార్ట్ చేసాడు. నిజానికి అక్కడ మామూలుగా అయితే ఎవరూ కాపురం ఉండరు. కేవలం పగలు పనిచేసి వెళ్లిపోతారు. లాక్ డౌన్ వచ్చాక మొదట్లో పది రోజులు కూడా ఎవరూ ఉండేవారు కాదు. కానీ లాక్‌డౌన్ మొదలైన పదిరోజులకు అక్కడ కాపురం పెట్టాడు మక్సూద్.

మక్సూద్, అతని భార్య ఎప్పుడో ఇరవైయేళ్ల కిందటే బెంగాల్ నుంచి పనికోసం వరంగల్ వచ్చారు. ఆరు నెలల క్రితం ఈ కార్ఖానాలో పనిలో చేరారు. లాక్ డౌన్ సమయంలో రాకపోకలు లేకపోవడంతో గోదాంకి వెళ్లే అవకాశం లేదు. దీంతో ఓ పది రోజులు గడిపేశాడు. ఇంకా ఇలానే ఉంటే ఇల్లు గడవడం కష్టం అనుకున్నాడు. యజమానికి ఫోన్ చేసి తాము గోదాం దగ్గర ఉన్న గదుల్లోకి మారిపోతామనీ, దాంతో లాక్ డౌన్ వల్ల రవాణా ఇబ్బంది ఉండదనీ, అదే సమయంలో పని కూడా చేసుకుని ఎంతో కొంత సంపాదించుకోవచ్చనీ చెప్పాడు. దీనికి అంగీకరించాడు యజమాని. లాక్ డౌన్ మధ్యలోనే కుటుంబంతో సహా అక్కడకు వచ్చేశాడు. మక్సూద్, అతని భార్యా అక్కడే పనిచేస్తారు. వాళ్లకు ముగ్గురు పిల్లలు. అబ్బాయిలు ఇద్దరు, ఒకమ్మాయి. అమ్మాయికి పెళ్లి అయి చిన్న బాబు ఉన్నాడు. భర్తతో విడిపోయి పుట్టింట్లోనే ఉంటోంది. అదే క్యాంపస్ లో మరో చివర ఒక చిన్న డాబాపై ఇద్దరు బిహారీ కుర్రాళ్లు ఉంటున్నారు. వాళ్లు కూడా పనిలో చేరి 25 రోజులే అయింది. లాక్ డౌన్ మధ్యలోనే అక్కడ పనిలో చేరారన్నాడు యజమాని. వాళ్లు ఉండేదీ అక్కడే. ఈ మక్సూద్ ఉండే ఇంటికీ, బిహారీ కుర్రాళ్లుండే ఇంటికీ మధ్యలో ఖాళీ స్థలం, గోదాం ఉంటుంది. గోడకి ఆ చివర వాళ్లు, ఈ చివర వీళ్లు.

పార్టనర్ భాస్కర్ బండి తిన్నగా, గతంలో, అంటే లాక్ డౌన్ కి ముందు మక్సూద్ ఉండే ఇంటివైపు వెళ్లింది. రంజాన్ పండుగ దగ్గర పడుతోంది కాబట్టి సొంతింటికి వెళ్లి ఉండొచ్చనుకుని నేరుగా అటెళ్లాడు అతను. అక్కడ ఆరా తీస్తే రాలేదని చెప్పారు చుట్టుపక్కల వాళ్లు. దీంతో నేరుగా తన గోదాం దగ్గరకే బయల్దేరాడు పార్టనర్ భాస్కర్. ఈలోపు ఫోన్ చేసి తన పార్టనర్ కి కూడా విషయం చెప్పాడు. గోదాం దగ్గర ఎవరూ లేరని వివరించాడు. అంతకుముందు ,బుధవారం సాయంత్రం ఐదున్నరకు వాళ్లు పనికి సంబంధించిన రికార్డులు రాసుకుని వెళ్లిపోయారు యజమానులు. ఆ తరువాత వాళ్లు గోదాం వైపు వెళ్లలేదు. వాళ్లు వెళ్లాక, అంటే బుధవారం రాత్రి ఆ గోదాం దగ్గర మక్సూద్ ఇంట్లో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. వేడుకలంటే పెద్ద పార్టీ కాదు. చిన్నగా జరుపుకొన్నారు. ఇది యజమానులకు తెలియదు. గురువారం భాస్కర్ గోదాం దగ్గరకు చేరుకున్నారు. బయట చూస్తే అందరి చెప్పులూ అక్కడే ఉన్నాయి. ఉతికి, నీళ్లు పిండి ఆరేయడానికి సిద్ధంగా ఉంచిన బట్టలు అక్కడే ఉన్నాయి. భోజనాలు చేసిన పళ్లాలు కనిపిస్తున్నాయి. కానీ మనుషుల్లేరు. కాస్త ముందుకు వెళ్లి, బిహారీ కార్మికులు శ్రీరాం, శ్యాంలు ఉన్న గదులు చూశారు. అక్కడా ఎవరూ లేరు. చాలాసేపు వెతికారు. ఎవరూ కనపడలేదు. తరువాత మరో పార్టనర్ సంతోష్ వచ్చారు. వెతికారు. లాభం లేదు. దీంతో అనుమానం పెరిగి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు మళ్లీ వెళ్లారు. సెక్యూరిటీ లేదు కాబట్టి కొన్ని తాళాలు వేసుకోవాలని బయల్దేరారు సంతోష్. మెయిన్ కీ ఒకటి తన షాపులో ఉంటుంది. షాపుకు వెళ్లి తాళం చెవి తీసుకుని వెనక్కు గోదాం దగ్గరకు వచ్చి, షటర్ ఓపెన్ చేసి, అందులోని డ్రాలో ఉన్న మిగిలిన షటర్ల తాళాలు తీసుకుని అన్నీ ఒక్కొక్కటీ చెక్ చేస్తూ తాళాలు వేస్తున్నారు. కింద ఉన్న అన్ని గదుల తాళాలూ వేసేశారు. కాంపౌండ్ వెనుకవైపు చివర డాబా మీద బిహారీ కార్మికులున్న గదుల తాళాలు మాత్రం వేయాల్సి ఉంది. ఆ బిల్డింగు పక్కనే, ఆనుకునే ఒక చిన్న ప్రహరీగోడ, అవతల ఒక కొద్దిగా దున్నిన నేల, దాని పక్కనే కంప చెట్లు పెరిగిన ఖాళీ స్థలం ఉంటాయి. కంప చెట్లున్న స్థలంలోనే, ఓమూలగా పక్కనున్న మెట్ట పొలం, గోదాం ఉన్న స్థలం.. ఈ మూడు స్థలాల సరిహద్దుల్లో వచ్చేలా ఒక పెద్ద, లోతైన బావి ఉంది. ఆ డాబా మెట్లెక్కుతున్నా, పైన బాల్కనీలో ఉన్నా ఇదంతా స్పష్టంగా కనిపిస్తుంది.

మిట్ట మధ్యాహ్నం.. చుట్టూ ఏ అలకిడీ లేదు. భవనానికి ఎదురుగా వేపచెట్టు మాత్రం ఉంది. కింది ఖాళీగా ఉన్న మెషీన్లు వాటి దగ్గర కొద్దిపాటి గోనెసంచె తయారీ సామగ్రి ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ బిహారీలుండే గది తాళం వేయడానికి వెళ్తూ, మెట్లెక్కుతూ యథాలాపంగా పక్కకు చూశాడు సంతోష్. అంతే.. ఒక్క క్షణం షాక్.. చెమటలు పట్టాయి.. గబగబా వెనక్కు తిరిగి మెట్లు దిగి కిందే కూర్చుండిపోయాడు రెండు నిమిషాలు.. తేరుకున్న వెంటనే తన పార్టనర్ కీ, తన దగ్గర పనిచేసే ఇతరలకూ ఫోన్ చేశాడు. వాళ్లు వెంటనే వచ్చారు. ఎవరికీ నోట మాట లేదు.. ఆ బావిలో మూడు శవాలు తేలుతున్నాయి. పోలీసులకూ చెప్పారు. వాళ్లొచ్చారు.

ఇంక అంతా హడావుడి. సాయంత్రానికి మరో శవం తేలింది మొత్తం నాలుగు శరీరాలు.. వలస కార్మికుల మృతి అంటూ వార్త గుప్పుమంది. అక్కడుండే వాళ్ల నుంచి చనిపోయిన వారి లెక్క తీసేయగా, ఇంకా నలుగురు మిస్సింగ్.. వాళ్ల గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. పోలీసులు చేయాల్సిన ఫార్మాలిటీస్ నడుస్తున్నాయి. రాత్రి పొద్దుపోయింది. తెల్లారి శుక్రవారం మరో శవం తేలింది. డౌటొచ్చిన పోలీసులు మొత్తం బావిలోని నీరంతా తోడడం మొదలెట్టారు. నీరు తగ్గే కొద్దీ టెన్షన్.. ఎవరూ ఊహించనది జరిగింది. మరో నాలుగు శవాలు.. చిన్నపిల్లాడితో కలపి మొత్తం 9. పరారీలో ఉన్నారనుకున్న వాళ్లూ శవాలుగా తేలారు. మక్సూద్ ఆలం, అతని భార్య నిషా, కూతురు బుష్రా, ఆమె కుమారుడు, మక్సూద్ కుమారులు షాబాద్ ఆలం, సొహైయిల్ ఆలం, బిహారీ కార్మికులు శ్రీరాం, శ్యాం. వీరంతా అక్కడుండేవారే. కానీ మరో శరీరం కూడా ఉంది! ఎవరిదా శరీరం? అంతా కలకలం.. గందరగోళం.. ఏం జరిగిందో? ఎలా జరిగిందో? ఎందుకు జరిగిందో తెలియదు. పోలీసులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. అక్కడ పనిచేసే మక్సూద్ కుటుంబంలో చిన్నపిల్లాడితో కలపి ఆరుగురు. బిహారీలు ఇద్దరు. మొత్తం ఎనిమిది. కానీ తొమ్మిదో శరీరం ఎవరిది. పరిశోధించగా తేలింది. ఆ తొమ్మితో మృతుడు ఈ మక్సూద్ కి పరిచయం ఉన్న మరో కార్మికుడు షకీల్. త్రిపుర రాష్ట్రం అగర్తల నుంచి వరంగల్ చేరి మెషీన్ పని చేసుకుంటున్నాడు. క్లూస్ టీం వచ్చింది. ఒకసారి కాదు. నాలుగుసార్లు వచ్చారు. ప్రతీదీ క్షుణ్ణంగా వెతుకుతున్నారు. పరిశీలిస్తున్నారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలోనూ, బయటక కాంపౌండ్ లోనూ వెతికారు. ఉపయోగం లేదు.

చుట్టు పక్కల జనం గుంపులుగా వస్తున్నారు. ఆ స్థలాన్నీ, ముఖ్యంగా బావినీ చూస్తున్నారు. తలో మాటా అనుకుంటూ వెళ్తున్నారు. బావిలోకి దిగి వస్తువులు వెతికే వారి కోసం వెతుకుతున్నారు పోలీసులు. అంత లోతుకు దిగే వారు దొరకడం లేదు. ఎలాగోలా సాధించారు. శుక్రవారం అర్థరాత్రికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అయిన వెంటనే మృతదేహాలు ఇచ్చేసి అంత్యక్రియలు చేయించాలనుకున్నారు. కానీ ఎందుకైనా మంచిదని కేసు చిక్కుముడి తేలే వరకూ ఆగారు. పోస్టు మార్టానికి ముందే ఆ మృతదేహాలను మంత్రులు యర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోర్, కలెక్టర్ ఇతర నాయకులు అధికారులు పరిశీలించారు. మృతదేహాలను పంపించడానికి సహాయం చేస్తామని తెలిపారు. సత్యవతి రాథోర్ వ్యక్తిగతంగా బాధితులకు లక్ష రూపాయలు, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్ లు చెరో 50 వేల చొప్పున సాయం ప్రకటించారు. కానీ సాయం తీసుకునేవారేరీ? కేవలం త్రిపుర కార్మికుడు షకీల్ భార్యా, పిల్లలు మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా వారి బంధువులెవరూ ఇక్కడ లేరు.

ఆమెకు హిందీ రాదు. త్రిపుర యాసలో మాట్లాడే బెంగాలీతో ఆమె నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. కలకత్తాలో ఉన్నప్పుడు బడికి వెళ్లి, వరంగల్ వచ్చాక చదువు మానేసిన ఆమె పదేళ్ల కూతురు మాత్రం హిందీ కొద్దిగా మాట్లాడుతోంది. మధ్య మధ్యలో ఆమె చిన్న తమ్ముడు తండ్రి గురించి ఏదో చెబుతున్నాడు. వారి మాటలను బట్టి షకీల్ అప్పుడప్పుడు మద్యం తాగేవాడని మాత్రం తెలుస్తోంది. నిజంగానే పోలీసులకు ఈ కేసు ఒక చిక్కుముడిలా ఉంది. కాస్త అనుభవం ఉన్న పోలీసులు ఎవరైనా జరిగిన ఘటన, అక్కడి దృశ్యాలూ చూసి ఏం జరిగిందో ఒక అంచనాకు వచ్చేయగలరు.. అదే మాట అడిగాం గీసుకొండ సీఐ శివరామయ్య గారిని.. ''నాకే కాదు, మా సీనియర్ ఆఫీసర్లకు కూడా ఇది ఒక మిస్టరీగానే ఉంది. ఇన్నాళ్లలో ఎన్నో చూశాం. సీన్ చూడగానే చెప్తాం, ఎలా జరిగిందా అని.. కానీ ఇది భిన్నంగా అనిపిస్తోంది. తొందరగా నిర్ణయం తీసుకునేది కాదు. శాస్త్రీయ ఆధారం, సాంకేతిక ఆధారం చూడాలి.'' అన్నారు.

వాళ్ల కుటుంబంలో గొడవలేమన్నా ఉన్నాయా అని అడిగాం పార్టనర్ సంతోష్ ని. ''మంచి ఫామిలీ మనస్పర్థలు ఉన్నట్టు తెలియవు. అటు బిహార్ వాళ్లతో కూడా సమస్య లేదు. బయటి వారితో గొడవులన్నాయా అన్నది నాకు తెలియదు. ఇక మక్సూద్ పిల్లలతో పెద్ద పరిచయం లేదు. త్రిపుర కార్మికుడనైతే నేనెప్పుడూ చూడలేదు. మక్సూద్ వాళ్లకి డబ్బు సమస్య కూడా లేదు. భార్యాభర్తలిద్దరూ కలపి 700-800 సంపాదిస్తారు. అవసరమైతే ఎడ్వాన్స్ తీసుకునేవారు.'' అన్నారతను.

తెల్లారింది. శనివారం. కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పోలీసు, నిఘా వర్గాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. విషయాలను ఆరా తీసాయి. నిందితులు, వారి రాష్ట్రాలూ, నేపథ్యాలూ, ఘటన జరిగిన విధానమూ.. అంతా అనుమానాల్నీ, గందరగోళాన్నీ పెంచుతోంది. అందుకే ఇంత శ్రద్ధ కేసుపై. స్నేహాలు, గొడవలు, ప్రేమలు, విడిపోయిన వివాహ బంధం, డబ్బు.. ఇలా ఎవరికి తోచిన కారణం వారు విశ్లేషిస్తున్నారు. ఆ కుటుంబంతోనూ, ఆ కుటుంబంలోని వ్యక్తులతోనూ పరిచయం ఉన్న అందర్నీ ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఫోన్లు కేసులో కీలక ఆధారాలయ్యాయి. ఆ కోణంలోనూ పరిశోధన సాగుతోంది. పోస్టు మార్టం చేసిన డాక్టర్ రజా మాలిక్ ఖాన్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ నిపుణులు. మృతదేహాల్లో విషం ఉందనీ, చిన్న గాట్లూ ఉన్నాయని మీడియాతో చెప్పారు. ప్రస్తుతానికి కేసు విచారణలో ఉందని చెబుతున్నారు వరంగల్ పోలీసులు.

బుధవారం పుట్టిన రోజు జరిగింది మక్సూద్ పెద్ద కొడుకు షాబాద్ ది. వరంగల్లో ఆరు నుంచి పదో తరగతి వరకూ షాబాద్ తో కలసి చదువుకున్న అతని స్నేహితులు ఎంజిఎం మార్చురీ దగ్గరకు వచ్చారు. ఎంతో డీసెంటుగా ఉండేవాడంటూ తమ స్నేహితుణ్ణి గుర్తు చేసుకున్నారు. షాబాద్ ములుగు దగ్గర ఐటిఐ చదువుతున్నాడు. బుధవారం నాడు ఈ మిత్రుల్లో కొందరు షాబాద్ కి ''హ్యాపీ బర్త్ డే'' మెసేజ్ చేశారు. అతను రిప్లై ఇచ్చాడు. ''థ్యాంక్స్'' అని.
--------------------------------------------------------------

On the way from Warangal to Narsampet, you will find a way to the left if you cross the Kashibugga. If you go in there, you will find many industries, especially Cold Storage, and the workers who work in them. Being an industrial area, a large cold storage with greenery on the side and a muddy road on the side of the lorry's road. Going a little further along that path, to the right is a large compound with a blue gate, which looks like two small rooms. Next to that godown, there is a house far away from anyone who knows what happened, or even close enough to know what happened.

Exports of coconut, rice, cotton and rice are required for storage in Warangal. Santosh and Bhaskar are two partners in the business of repairing the sacks in this blue-tiled warehouse. Partner Bhaskar sent an auto to their godown to deliver goods to a hardman on Thursday. The address said that they will accept our receipts there. The auto driver went there and saw. No one came. Went inside and called. Pl .. nobody else. Once again, when no one came, he phoned the owner and went back. Bhaskar phoned the auto driver and phoned his employee, Maqsood, who was there. Came the switchoff. With this, Bundy started. In fact there is usually no one but the camp. Just work in the day and leave. No one had been there for ten days before the lockdown came. But Maqsood camped there for ten days after the lockdown began.

Maqsood and his wife came to Warangal for work from Bengal at the age of twenty. He joined the workshop six months ago. Due to lack of traffic during lockdown, there is no chance of going to the goddamn. He spent ten days there. Still, it was difficult to get home. He phoned the owner and told them that they would move into the rooms near the goddamn, so that the lockdown would not be a problem for transportation, and at the same time work and earn some. The owner agreed. He arrived there, including the family, in the middle of the lockdown. Maqsood and his wife work there. They have three children. Two guys, one. The girl is married and has a small baby. Separated with husband and staying puttin. At the other end of the campus are two Bihari boys on a small patio. It was only 25 days after they had joined the work. The owner had joined the job down the middle of the lockdown. They were there. In the middle of this house of Maqsood and the house of the Bihari boys, there is a space and a goddamn. They are at that end of the wall, this is the end.

Partner Bhaskar ate the cart and went to the house where Maqsood was in the past, before the lockdown. He was going straight to Sontinti's place as he was getting close to the festival of Ramadan. The neighbors said that they did not come to visit there. Partner Bhaskar went straight to his goddamn. He also phoned his partner in the meantime. He explained that there was no one near the goddamn. Earlier, the owners had gone to work on Wednesday evening to write down records of their work. After that they did not go to the goddamn. After they left, there was a birthday celebration at the house of Maqsood on Wednesday night. Celebrations are not a big party. Celebrated short. It is unknown to the owners. Bhaskar reached the goddamn on Thursday. If you look at it, everyone's sayings are there. There are clothes that are ready for washing and watering. Looks like fruit made of lunches. But not manly. Going a little farther, the Bihari workers saw the rooms of Sriram and Shyam. There was no one there. Long gone. No one was showing up. Another partner Santosh came later. Sought. There is no profit. Suspicion grew and the police lodged a complaint with the police.

Back in the afternoon shit went again. Santosh says they have to go for some locks so there is no security. The main key is in his shop. Go to the shop, take the locksmith's ear and come back to the goddamn door, open the shutter and lock the rest of the shutters in the drawer, checking each one. All the rooms below were locked. Behind the compound is the locks of the Bihari workers' rooms on the patio. Next to the building, there is a small stream adjacent to it, a little plowed floor, and next to it is an empty space where the trees have grown. In the place of the compact trees, the adjoining paddy field, the place of the goddamn. The terrace is upstairs and the balcony above it is clearly visible.

Noon .. There was no alarm around. The building is opposite the building. The following empty machines have little gunpowder equipment in them. Santhosh looked at all this, going to lock the room of the Bihariland, and walking down the stairs. It was a moment of shock and sweat. Gabagaba went back down the stairs and sat down for a couple of minutes. They arrived right away. There are three corpses floating in the well. He told police. Valloccaru.

All rights reserved. Another body was found in the evening. All four bodies. The dead are taken from the dead, and four more are missing. The formalities that police have to do are running. The night was sunny. Another corpse was found in Telluri Friday. Deutsche police began to pour water all over the well. Tension as the water recedes. Four more corpses, including a small child. Maqsood Alam, his wife Nisha, daughter Bushra, her son and Maqsood sons Shabad Alam, Sohail Alam and Bihari workers Sriram and Shyam. All rights reserved. But there is another body too! Whose body? It's all confusion. Confusion. What happened? How's that going? Don't know why it happened. The police are unable to come to an estimate. There are six in the family of Maqsood who work there as a child. Biharis are two. All eight. But the ninth body is anyone's. Investigated. Another worker familiar with this maqsud was Shakeel. Warangal from Tripura State Agartala is working machine. Got the clue team. Not once. Arrived four times. Everything is looking thorough. Investigating. Some items were seized. Search in the home and outside compound. There is no use.

People from all over are coming in crowds. All over the place, especially the well. Talo Mata wants to go. Police are searching for those who got into the well. They do not find it so deep. How to achieve. The postmortem was completed at midnight on Friday. Immediately after the postmortem, the bodies were ordered to be cremated. But the case is good until the implication stops. The bodies were examined by ministers Yarrabeli Dayakara Rao, Satyavathi Rathore and other leaders of the Collector before the post mortem. He said they would help dispatch the bodies. Satyavati Rathore has personally donated Rs 1 lakh to the victims, MLAs Vinay Bhaskar and Narender to the tune of Rs. But who is the helper? Only Tripura worker Shakil Bharya and the children were there. The rest of their relatives are not here.

She does not come to Hindi. The police were trying to get information from a Bengali speaking in Tripura. Her 10-year-old daughter, who left school in Calcutta and studied after her arrival in Warangal, speaks little Hindi. She says something about her little brother's father in the middle. It seems that Shakeel occasionally drank alcohol because of their words. The case is, of course, a tangle for the police. The police officers with some experience can look at the scene and the scene and give an estimate of what happened. We have seen many of these years. Sean says while watching, how it happened .. But it looks different. Not a quick decision. We need to see scientific evidence and technical evidence. ”

Asked if there is any conflict in their family, Partner Santosh Ni. '' There is no such thing as good family minds. And they have no problem with Bihar. I don't know if they have owls with outsiders. No longer a big acquaintance with Maqsood children. I have never seen a Tripura worker. The Maqsud have no problem with money. Both husband and wife earn 700-800. Advance can be taken if necessary.

Tellarindi. Saturday. The case has created a nationwide buzz. The police and intelligence agencies of the central and state governments inspected the site of the incident. Things have changed. The accused, their states, their backgrounds, the course of the incident .. Everything is raising suspicion and confusion. That's why this is the focus of attention. Friendships, quarrels, romances, estranged marriages, money .. The reason for this is that they are evolving. Police are questioning Anthony, who is familiar with the family and the family. Phones are the key to the case. Research is also underway in that sense. Dr. Raza Malik Khan, who made the post mortem, is a forensic expert at Kakatiya Medical College. He told the media that the bodies were poisonous and there were small bites. Warangal police say the case is currently under investigation.

Wednesday's birthday was Maqsood's eldest son, Shabad the. His friends, who studied with Shabad from sixth to tenth grade, came to MGM Marchery. They remembered their friend as being very descent. Shabad is studying at ITI near Mulag. On Wednesday, some of these friends messaged Shabad a "Happy Birthday". He replied. '' Thanks ''.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !