గర్భవతని కూడా చూడకుండా ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు?
సరిగ్గా మధ్యాహ్నం 2.30కు ఆగ్నేయ దిల్లీలోని సఫూరా జర్గర్ ఇంటికి పోలీసులు వచ్చారు. నిద్రపోతున్న ఆమెను లేపి, తమతో రావాలని అడిగారు. జామియా మిలియా యూనివర్సిటీలో సోషియాలజీ విద్యార్థిని అయిన 27ఏళ్ల సఫూరాకు 19 నెలల కిందట పెళ్ళయింది. వారం రోజుల క్రితమే గర్భం దాల్చినట్లు ఆమెకు తెలిసింది. "తనకు వాంతులు అవుతున్నాయి. చాలా నీరసంగా కూడా ఉంది"అని ఆమె భర్త బీబీసీకి తెలిపారు. దిల్లీ పోలీసుల్లోని ఉగ్రవాద నిరోధక విభాగమైన స్పెషల్ సెల్ నుంచి తాము వచ్చామని, సెంట్రల్ దిల్లీలోని తమ కార్యాలయానికి తమతో రావాలని ఆమెకు చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఆమె పాత్రపై కొన్ని ప్రశ్నలు అడగాలని అనుకుంటున్నామని చెప్పారు. ముస్లింలపై వివక్ష చూపేలా ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశంలోని చాలా ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. దిల్లీలో అయితే మత ఘర్షణలూ చోటుచేసుకున్నాయి.
పోలీస్ స్టేషన్‌లో కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఏప్రిల్ 10, శుక్రవారం, రాత్రి 10.30కు సఫూరాను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తి కట్టడికి ఒకవైపు లాక్‌డౌన్ అమలవుతుండగా, నెల రోజుల నుంచీ ఆమెను కిక్కిరిసిన తీహార్ జైల్లో ఉంచారు. గర్భిణులకు కోవిడ్-19 సోకే ముప్పు ఎక్కువని ప్రభుత్వం విడుదల చేసిన అడ్వయిజరీ చెబుతోంది. బెయిల్ దొరకడం దాదాపు అసాధ్యమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద సఫూరాపై అభియోగాలు మోపారు.అరెస్టు అయిన తర్వాత, కేవలం రెండుసార్లు ఐదేసి నిమిషాలపాటు ఫోన్ చేసేందుకు ఆమెకు అనుమతించారు. దీంతో ఆమె ఒకసారి భర్తకు, మరోసారి లాయర్‌కు ఫోన్‌చేశారు. అయితే కోవిడ్-19 ఆంక్షల నడుమ వీరిద్దరూ ఆమెను కలిసేందుకు అనుమతించలేదు. మార్చి 25న లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచీ అరెస్టు అవుతున్న ముస్లిం విద్యార్థులు, సామాజిక కార్యకర్తల్లో సఫూరా కూడా ఒకరు. కరోనావైరస్ లాక్‌డౌన్‌ను అసమ్మతి గళాన్ని నొక్కేసేందుకు వాడుకుంటున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు కూడా వస్తున్నాయి.
జామియా కో-ఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) సభ్యురాలైన సఫూరా.. ఈశాన్య దిల్లీలో శాంతియుత నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించడంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఆమె చాలా ధైర్యవంతురాలని, నిజాయితీగా ఉంటారని, తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేవారని ఆమె సోదరి సమీయా చెప్పారు. అయితే, దిల్లీ ఘర్షణల ప్రధాన కుట్రదారుల్లో సఫూరా కూడా ఒకరని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘర్షణల్లో 53 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. సఫూరాపై ఆరోపణలను ఆమె కుటుంబం ఖండిస్తోంది. "ఆమేమీ నేరస్థురాలు కాదు. ఓ విద్యార్థిగా, సామాజిక కార్యకర్తగా తన నిరసన తెలిపే హక్కులను ఆమె ఉపయోగించుకున్నారు" అని ఆమె సోదరి చెప్పారు. "ఓ విద్యార్థిగా, తోటి విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు ఆమె ఎప్పుడూ వెళ్తుంటార"ని అన్నారు. అయితే, తాము నిజాయితీగా, ఎలాంటి పక్షపాతం లేకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామని పోలీసులు చెప్పారు. ఫొరెన్సిక్ ఆధారాల పరిశీలన, విశ్లేషణ తర్వాతే అరెస్టులు చేశామని వివరించారు. అయితే, కావాలనే పోలీసులు ఘర్షణలతో విద్యార్థులకు ముడిపెడుతూ అరెస్టులు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు.
"ఇవి దురుద్దేశపూరిత వేధింపుల్లా అనిపిస్తున్నాయి" అని బీబీసీతో లాయర్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ వివరించారు. "ప్రభుత్వం అసమ్మతిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. విద్యార్థులను, సామాజిక కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి నిరసనలూ లేకుండా చూడాలని వారు అనుకుంటున్నారు" "ఈ హింసలు ముస్లింలు బాధితులవుతున్నారు. వారు వేధింపులను ఎదుర్కొంటున్నారు" ఫిబ్రవరి 23 నుచి రెండు రోజులపాటు హిందూ నినాదాలు చేస్తూ కర్రలు, రాళ్లతో కొన్ని హిందూ మూకలు.. ముస్లిం నివాస ప్రాంతాలపై దాడులు చేస్తూ కనిపించాయి. కొందరు ముస్లింలపై మూక దాడులు జరిగాయి. వారి వ్యాపారాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. మసీదులను పడగొట్టారు. దీంతో వేల మంది ముస్లింలు తాత్కాలిక శిబిరాలకు తరలివెళ్లారు. వీటిలో తమ తప్పేమీ లేదని పోలీసులు చెబుతున్నా.. కొన్నిసార్లు చూసీచూడటనట్లు వ్యవహరించారని, మరికొన్నిసార్లు ఘర్షణలకు తెగబడేవారివైపు నిలిచారని చెప్పే ఆధారాలు బయటపడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చెందిన హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సభ్యులూ నిరసనలకు ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేస్తూ వీడియోల్లో కనిపించారు. ముగ్గురు బీజేపీ నాయకులను అరెస్టు చేయాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉంది. ముస్లింలకు వ్యతిరేకంగా కావాలనే ఈ ఘర్షణలను రెచ్చగొట్టారని చాలా మంది పత్రికల్లో వ్యాఖ్యానాలూ రాశారు. అయితే, బీజేపీ నాయకులు, మూకలపై చర్యలు తీసుకోవడానికి బదులు ముస్లిం విద్యార్థులు, సామాజిక కార్యకర్తలను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు. కోవిడ్-19 ఆంక్షలతో కోర్టులు అంతంత మాత్రంగా పనిచేస్తున్న సమయంలో యూఏపీఏ కింద అరెస్టు చేయడం, దేశద్రోహం అభియోగాలు మోపడం లాంటి చర్యలకు దిగుతున్నారని చెబుతున్నారు.
ఫిబ్రవరి ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 800 మందిని అరెస్టు చేశారు. పదుల సంఖ్యలో అరెస్టులు లాక్‌డౌన్ సమయంలోనే జరిగాయి. మోదీ ప్రభుత్వం కనుసన్నల్లోనే పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు. సఫూరాతోపాటు జామియా కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు మీరన్ హైదర్, జామీయా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షురాలు షీఫా ఉర్ రెహ్మాన్, ఎంబీఏ విద్యార్తి గుల్ఫిషా, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇష్రాత్ జహాన్‌లనూ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. ఘర్షణలకు కుట్ర పన్నారని, విద్వేష వ్యాఖ్యలతో మూకను రెచ్చ గొట్టారని ఆరోపిస్తూ యూఏపీఏ కింద వీరిని అరెస్టు చేశారు. "ఇది అధికార దుర్వినియోగం, అక్రమం" అని ఈ అరెస్టులను మానవ హక్కుల సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు ఖండించారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేపట్టినవారిని అక్రమంగా అరెస్టు చేయడం, భయపెట్టడం, వేధింపులకు గురిచేయడం లాంటివి ఇప్పటికైనా ఆపాలని వందల సంఖ్యలో మహిళా ఉద్యమకారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. "శాంతియుతంగా నిరసనలు చేపట్టినవారిపై తప్పుడు కేసులు బనాయించడం ఆపాలి. వారిపై మోపిన అవాస్తవ అభియోగాలను కొట్టివేసి విడుదల చేయాలి"
నాలుగు నెలల గర్భవతి అయిన సఫూరా.. ప్రస్తుతం విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ప్రభుత్వ అణచివేతకు ముఖచిత్రంగా మారారు. "అసమ్మతి, వాక్ స్వేచ్ఛ లాంటి హక్కులపై కేంద్ర ప్రభుత్వం చాలా అసహనంతో ఉంది" అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవినాశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. "కరోనావైరస్ వ్యాపిస్తున్న సమయంలో గర్భంతో ఉన్న సఫూరాను అరెస్టుచేసి కిక్కిరిసిన జైలుకు పంపడం దారుణం. దేశంలో అణచివేతను ఈ ఘటన కళ్లకు కడుతోంది" అని ఆ ప్రకటనలో తెలిపారు. మరోవైపు ప్రభుత్వానికి మద్దతుపలికే కొందరు.. అరెస్టవుతున్న సామాజిక కార్యకర్తలపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. గతవారం వందల మంది అతివాదులు, సఫూరాను ట్విటర్‌లో ట్రోల్ చేశారు. అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు ఆమెకింకా పెళ్లికాలేదని వ్యాఖ్యలు చేశారు. ఆమె గర్భం దాల్చడంపైనా ప్రశ్నలు సంధించారు. వి సపోర్ట్ నరేంద్ర మోదీ పేరుతో నిర్వహిస్తున్న ఓ ఫేస్‌బుక్ పేజీ.. ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేసిన పోర్న్ ఇమేజ్‌ను షేర్ చేసింది. "ఈ గ్రూప్ అసత్య ప్రచారాలు చేసే గ్రూప్. మోదీ, బీజేపీపై ఈ గ్రూప్ ప్రశంసలు కురిపిస్తుంటుంది. విపక్షాలను విమర్శిస్తుంటుంది"అని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ తెలిపింది. మరోవైపు ఘర్షణల్లో అమాయకుల మరణాలకు సఫూరా కారణమని కొన్ని అతివాద సంస్థలకు చెందిన, ప్రభుత్వం వైపు పనిచేసే మీడియా సంస్థలు ఆరోపించాయి.
అయితే, కోర్టులో విచారణ పూర్తయిన తర్వాతే ఆమె దోషో కాదో తెలుస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. విచారణ ప్రక్రియలు పూర్తయ్యేందుకు చాలా సమయం పడుతుంది. ఈ ప్రక్రియలే ఒక శిక్ష అని చెప్పొచ్చు. సఫూరాపై చేస్తున్న ట్రోలింగ్, దూషణలు.. ఆమె కుటుంబానికి తీవ్ర వేదన మిగులుస్తున్నాయి. గతవారంతో సఫూరాతో మాట్లాడిన ఆమె భర్త.. ఈ ట్రోలింగ్, దూషణల గురించి ఆమెకు చెప్పలేదు. "నేను చాలా మాట్లాడాలని అనుకున్నాను. అయితే సగం చెప్పేసరికే సమయం అయిపోయింది" అని ఆయన వివరించారు. ఐదు నిమిషాల ఫోన్ కాల్‌లో ఆమె ఆరోగ్యం, తీసుకుంటున్న ఆహారం, జైలులో పరిస్థితులు, లాక్‌డౌన్ నడుమ తనకు అవసరానికి ఏమైనా డబ్బులు ఇవ్వడం గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. "తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువుల గురించి ఆమె అడిగింది. తన గురించి బాధపడుతున్నారేమోనని తెలుసుకోవాలని అనుకుంది. మన కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలని ఆమెకు చెప్పాను" అని ఆయన వివరించారు.
-------------------------------------------------------------------
Police arrived at the Safura Jurger's home in southeast Delhi at around 2.30pm. She woke up and asked her to come with her. Safura, a 27-year-old student of sociology at Jamia Millia University, got married just 19 months ago. She was told that she was pregnant a week ago. "She is vomiting. It is very cold," her husband told the BBC. She told them that they had come from the Special Cell, the counter-terrorism unit of the Delhi police, and had to accompany them to the Central Office in central Delhi. She said she would like to address some questions about her role in the protest, which is contrary to the civil rights law. There have been protests in many parts of the country over the Citizenship Challenge Act (CAA), which has been accused of discrimination against Muslims. In Delhi, however, there were communal clashes.
Safura was arrested at 10.30 pm on Friday, April 10 after questioning for hours at the police station, police said. While the lockdown was running on one side of the coronavirus outbreak, she was kept in Tihar Jail for months. The Advisory released by the government says the Covid-19 threat to pregnant women is high. Safura was charged under the Unlawful Activities Prevention Act (UAPA), which makes it nearly impossible to find bail. She once phoned her husband and Marosari Lawyer. However, both of them were not allowed to cover her. Safura is one of the Muslim students and social activists who have been arrested since the lockdown began on March 25. There are also allegations that the corporation is using the coronavirus lockdown to press the dissenters.
Safura, a member of the Jamia Co-Ordination Committee (JCC), has been actively involved in organizing peaceful protests and demonstrations in Northeast Delhi. Her sister, Samia, said she was "very brave and honest" and that she was open-minded. However, police allege Safura was one of the chief conspirators of the Delhi clashes. 53 people have been killed in these clashes. Most of them are Muslims. Her family denies the allegations against Safura. "She is not a criminal. She used her right to protest as a student and as a social worker," her sister said. "As a student, she always goes out of her way to show solidarity to her fellow students," she said. However, the police said that they were acting honestly and without any bias. Analysis of forensic evidence and analysis revealed that the arrests were made. Critics say, however, that the police are deliberately making arrests in connection with student clashes.
"They look like malicious harassment," explained Prashant Bhushan, Lawyer and social worker with the BBC. "The government is trying to quell the dissent. The attacks seemed to be going on. There have been silent attacks on some Muslims. Their businesses were set on fire and destroyed. The mosques were demolished. Thousands of Muslims have returned to the makeshift camps. The police say there is nothing wrong with this .. There are some sources that say that they were sometimes looked down on, and that the clashes were a few times. Prime Minister Narendra Modi's Hindu Nationalist Bharatiya Janata Party (BJP) MPs have made videos of the protests. A petition in the Delhi High Court is also pending to arrest three BJP leaders. Many newspapers have commented that these clashes have been provoked by Muslims to be extravagant. Critics say, however, that the police are targeting Muslim students and social activists instead of taking action against the BJP leaders and silence. It is said that under the provisions of the Covid-19 sanctions, the courts are doing the same thing to arrest and treason charges under the UPA.
About 800 people have been arrested in connection with the February clashes. Tens of thousands of arrests were made on lockdown. Critics say the police are acting within the eyes of the Modi government. Besides Safura, Jamia Co-ordination Committee member Meeran Haidar, Jamia alumni association president Sheifa Ur Rehman, MBA student Gulfisha and former municipal councilor Ishrat Jahan were also present. He was arrested under the UPA for allegedly conspiring with the gang and infuriating them with hateful comments. The arrests have been condemned by human rights organizations and civil society respondents, saying: "This is a misuse of power." Hundreds of Tamil militants have issued a statement demanding that all those who are protesting the democratic protests be stopped, threatened and intimidated. "Those who have peacefully staged protests should stop misrepresenting the charges.
Safura, who is four months pregnant, has become the cover for the oppressive forces on students and social workers. Amnesty International India Executive Director Avinash Kumar said in a statement: "In the wake of the outbreak of coronavirus, pregnant Safura is being arrested and sent to prison. On the other hand, some are fighting against the government .. Social media is protesting against the arresting social workers. Hundreds of guests on Thursday trotted Safura on Twitter. She slandered with vulgar slogans and commented that she was not married. There were issues about her pregnancy. V Support Narendra Modi's Facebook page. She shared a porn image with her face morphing. "This group is a fraudulent propaganda group. It praises Modi and the BJP and criticizes the opposition," said the fact-checking website Alt News. On the other hand, media outlets have accused some extremist organizations of leading insurgency to blame innocent victims of clashes.
However, legal experts say that she will find out if she is guilty in court. It is very easy to complete the process. This process can be said to be a punishment. Trolling and blasphemy on Safura .. Her family is left with a great deal of pain. Her husband who spoke with Sufura in the past .. did not tell her about this trolling and blasphemy. "I wanted to talk a lot, but it was easy to talk," he explained. In a five-minute phone call, she said she was concerned about her health, her diet, her jail conditions, and any possible dabbling in the lockdown. "She asked about her parents, aunts and relatives. I wanted to know what she was suffering about.
Comments
Post a Comment