అగ్నిగుండంలా తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రచండ భానుడి ఉగ్రరూపానికి తెలంగాణ విలవిల్లాడింది. ఎండ వేడికితోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి, ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాత్రిపూట కూడా ఆ వేడి తగ్గలేదు. ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు, చిరు వ్యాపారులు అల్లాడిపోయారు. రోహిణి కార్తె కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత దాటితే ఆయా ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిందని నమస్తే తెలంగాణ చెప్పింది. ఉష్ణోగ్రతలు అధికమవుతున్నందున వడగాల్పుల తీవ్రత సైతం పెరగనున్నట్లు, ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఆంఫన్ తుపాను వెళ్లిపోవడంతో తేమ కూడా దాంతోపాటు వెళ్లిపోయిందని, ఫలితంగా రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ అధికారులు తెలిపారని కథనంలో చెప్పారు. రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిందని పత్రిక చెప్పింది.
----------------------------------------------------------------
Telangana is on the verge of a rage on Sunday. Heavy temperatures have been reported in various districts with sunstroke and hail from the north. The maximum temperature of 46.3 degrees Celsius was recorded in the Adilabad district of Jainad. Similarly, the temperature was recorded at 46 degrees in the districts of Varanayi, Kamareddy, Nirmal, Jagjithala and Karimnagar. The sunny heat and the thunderstorm had choked people since 9am. That heat did not diminish even at night. Employment guarantees for sunny weather have waged wage laborers and petty traders. The Hyderabad Meteorological Department has warned the Hyderabad Meteorological Department that the situation is more severe with Rohini Karte, and that temperatures exceeding 45 degrees Celsius are likely to increase. The Hyderabad Meteorological Department said the hailstorms and extremes are coming from the north of India, particularly from Rajasthan, with severe sunshine and hail. According to the article, the weather officials said that the humidity was also accompanied by the passing of the orphan, resulting in dry weather in the state. The Hyderabad Meteorological Department said the prevailing intensification of rainfall in the state for the next two days will continue.
Comments
Post a Comment