Posts

వలసజీవుల 'దేవుడు'.. ఈ ‘విలన్’ !

Image
"సోనూ సూద్ భయ్యా. ప్లీజ్ సాయం చేయండి. తూర్పు యూపీలో ఎక్కడికైనా నన్ను చేర్చండి. అక్కడి నుంచి ఇంటికి నడిచి వెళ్లిపోతా?" ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌కు ట్విటర్‌లో ఓ వ్యక్తి నుంచి వచ్చిన అభ్యర్థన ఇది. ‘‘నడిచి వెళ్లడం ఎందుకు మిత్రమా? నీ నంబర్ పంపించు’’ అని దానికి సోనూ స్పందించారు. గత కొన్ని రోజుల నుంచి సోనూ సూద్‌కు ఇలాంటి అభ్యర్థనలు ఎన్నో వచ్చాయి. ఆయన ఎన్నో సార్లు తిరిగి బదులిచ్చారు కూడా. లాక్‌డౌన్‌ వల్ల స్వస్థలాలకు వెళ్లలేక చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న వారికి సోనూ సాయం చేశారు. వారి కోసం బస్సులు ఏర్పాటు చేశారు. ఆహారం, నీళ్లు అందేలా చూశారు. వెండి తెరపై విలన్‌గా సోనూ చాలా మందికి తెలుసు. కానీ ఆయనను ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ‘హీరో’ అంటూ పొగుడుతున్నారు. వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉండలేకపోతున్నానని, వారిని ఇళ్లకు చేర్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తానని సోనూ సూద్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టుందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వేల మంది వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత అన్...

కలికాలం : యువతికి ఆరో తరగతి చ‌దివే బాలుడి వేధింపులు

Image
ఆ పిల్లాడు చ‌దివేది 6 త‌ర‌గ‌తి అంటే… 10 నుంచి 12 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉంటుంది. అత‌డు 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే..న‌మ్ముతారా. ఆశ్చ‌ర్యంగా అనిపించోచ్చు కానీ ఇది నిజం. ఇందుకు అత‌డు యువతి మార్ఫ్‌డ్‌ చిత్రాలను అస్త్రాలుగా వాడుకున్నాడు. డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్‌ చాట్‌ చేయాలంటూ వేధించ‌డం మొద‌లుపెట్టాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, వేధింపుల‌కు పాల్పడిన‌ పిల్లాడు ఓ టెలిగ్రామ్‌ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్ విద్యార్థుల‌కు సంబంధించిన‌ది. ఇందులో అన్ని వ‌య‌సుల వారు స‌భ్యులుగా ఉంటారు. సీనియ‌ర్లు, జూనియ‌ర్ల‌కు త‌లెత్తే డౌట్స్ క్లారిఫై చేస్తూ.. చ‌దువులో రాణించేందుకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ కంప్లీట్ చేసి.. ప్రజంట్ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్న యువతి ఈ గ్రూప్‌లో జాయిన్‌ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా ఈ గ్రూప్‌లో ఎప్ప‌ట్నుంచో ఉన్నాడు. ఆ గ్రూప్ లోనే ఇరువురికి పరిచ‌యం అయ్యింది. మొద‌ట ఆ పిల్లాడు..యువ‌తితో చ‌దువుకు సంబంధించిన విష‌యాలు క్లారిఫై చేయించుకునేవాడు. అలానే మంచివాడిగా న‌టిస్తూ ఆమె వ‌ద్ద న‌మ్మ‌కం పెంచుకున్నాడు. ...

ఉద్యోగం పోయినా.. కొట్లోచ్చి పడ్డాయి..

Image
అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతోంది.దూరదృష్టం తలుపు తీసేదాకా తలుపు కొడుతోంది అని ఒక సామెత కూడా ఉంది.జీవితంలో ఎవరైనాసరే అదృష్టం గురించి ఎదురుచూస్తూ ఉంటారు.ఎంతో ప్రయత్నించాం గాని అదృష్టం కలిసి రాలేదు అనే మాట కూడా మనం చాలాసార్లు వింటూనే ఉంటాం.ఎందుకు అదృష్టం గురించి మనిషి ఎక్కువగా ఎదురుచూస్తాడు అంటే ఒకే ఒక్కసారి అదృష్టం జీవితంలోకి వస్తే ఒక్కసారిగా జీవన విధానమే ఊహించనంతగా మారిపోతుంది.ఇప్పుడు అదృష్ట్రం గురించి చెప్పుకున్నదంతా కూడా మనకి పూర్తిగా ఒక్క విషయంతో అర్ధం కావాలి అంటే తాజాగా న్యూజిలాండ్ లో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే.వివరాల్లోకి వెళ్తే … ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే.దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.దీంతో ఎప్పుడూ లేనంతగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.కాగా ఇప్పటికే చాలా కంపినీలా నుండి భారీ స్థాయిలో ఉద్యోగులను విధుల నుండి తొలగించారు.సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లింది.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ లో ఓ వ్యక్తి ఉద్యోగం కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్నాడు..ఆ సమయంలో కంప్యూటర్లో ఏదో వెబ్ సైట్ చూస్త...

యోగి సర్కార్ మరో దుర్మార్గ చర్య

Image
ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ మరో దుర్మార్గమైనచర్యకు పాల్పడింది. ఇప్పటికే కార్మిక చట్టాలను కాలరాసిన ప్రభుత్వం ఇప్పుడు ఎస్మా ప్రయోగించింది. ఆరు నెలల పాటు అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగిస్తూ యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఈ ఆదేశాలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అనుమతి మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముకుల్ సింఘాల్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.ʹʹఈ గెజిట్ నోటిఫికేషన్ వెలువడినది మొదలు వచ్చే ఆరు నెలల పాటు రాష్ట్రంలో ప్రజా సేవలను స్తంభింపజేయడంపై నిషేధం విధించేందుకు గవర్నర్ సమ్మతించారు. ఈ ఆరు నెలలు ప్రభుత్వం, కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఆధీనంలోని ఎలాంటి సేవలైనా నిలిపివేయడం నిషేధం...ʹʹ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్మా చట్టం అమల్లో ఉండగా పోస్టల్, టెలీగ్రాఫ్, రైల్వే, పోర్టు కార్యకలాపాలు సహా అత్యవసర సేవల విభాగాలకు చెందిన ఉద్యోగులెవరూ సమ్మె చేసేందుకు వీల్లేకుండా నిషేధం కొనసాగుతుంది. దీన్ని ఉల్లంఘించిన పక్షంలో ఏడాది పాటు జైలుశిక్ష లేదా వెయ్యి రూపాయలు జరిమానా లేదా రెండూ వ...

ఇక గుమ్మం ముందుకే మద్యం !

Image
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి జొమాటోలు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్రం ఓకే చెప్పింది. దీంతో ఇక క్యూలైన్ లో మద్యం కోసం నిలబడడానికి నామోషీగా ఫీలయ్యే వారు.. బిజీగా ఉండి ఇక మద్యం షాపుకు వెళ్లలేని వారికి ఈ రెండు సంస్థలు మద్యం హోం డెలివరీ చేస్తాయి. ఫుడ్ తోపాటు మద్యం ను కూడా డెలివరీ చేసేందుకు ఈ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. స్విగ్గీ జొమాటోలు ఇక నుంచి మద్యం హోం డెలివరీ చేయనున్నాయి. ఈ మేరకు తొట్టతొలిగా జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇవాళ మద్యం హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించాయి. దీనికోసం యాప్ లో ‘వైన్ షాప్స్’ అనే ఆప్షన్ ను ప్రవేశపెట్టాయి. ఇక 18 ఏళ్లలోపు వారు వయసు ధ్రవీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా కార్డుతో సెల్ఫీ దిగి అందులో పోస్టు చేయాలి. మైనర్లకు మద్యం అమ్మకుండా యాప్ లో మార్పులు చేశారు. ఓటీపీ ద్వారా మద్యం డెలివరీ చేస్తారు. మద్యం కోసం క్యూలు కట్టడాలకు ఇక చెక్ పడనుంది… బడాబాబులు అందరూ కూడా ఇంట్లోనే ఉండి మద్యం తెప్పించుకునే వీలు కలగనుంది. --------------------------------------------------------------- ...

జైల్లోనే చచ్చిపోతాననుకున్నా..

Image
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తిండి కోసం కొట్టుకోవడం, పిల్లి-ఎలుకల్లా దెబ్బలాడుకోవడం... ఇది ఇండియాలోని జైళ్లలో వారు రోజూ ఎదుర్కొన్న పరిస్థితి. ఇరాక్, అఫ్గానిస్తాన్‌ దేశాల్లో పని చేసిన ఈ బ్రిటన్ మాజీ సైనికుడు జైల్లో ఎదురైన పరిస్థితులతో ఎలా పోరాడారో తాను రాసిన ఓ పుస్తకంలో చెప్పుకొచ్చారు. రాళ్లతో పరచిన గచ్చుపై ఆయన పడుకునేందుకు ఓ బొంత.. భారతీయ శైలిలో నిర్మించిన శిథిలావస్థలో ఉన్న శౌచాలయం.. తినడానికి పాడైపోయిన కారెట్లు, బంగాళ దుంపలు. చూడ్డానికి అంత స్పష్టంగా లేని ఆ ఫోటోలన్నింటినీ నిక్ తన వద్దనున్న స్పై పెన్‌తో చిత్రీకరించారు. నిజానికి ఆయనతో పాటు చైన్నై జైల్లో ఉన్న ఆయన సహచరులు రెండున్నర ఏళ్ల పాటు ఎదుర్కొన్న పరిస్థితులకి ఆ ఫోటోలు అద్దం పడతాయి. “జైలు గదులు అధ్వాన్నంగా, మురిగ్గా ఉండేది. ఏ రోజు చూసినా అదే పరిస్థితి” అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం నార్తంబర్‌లాండ్‌లోని అషింగ్టన్‌లో ఉన్న నిక్. నిక్ సహా తన ఐదుగురు స్నేహితులు కూడా సైన్యంలో పని చేసేవారు. 2013లో ఎంవి సీమన్ గార్డ్ ఒహియో నౌకలో హిందూ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో భారతీయ కోస్ట్ గార్డ్ దళాలు వారిని బంధించనంత వ...

ఆ రాజ్యాన్ని పగలూ రాత్రీ పంచుకున్నాయి !

Image
నార్వేలోని దీవుల సముదాయంలో గల స్వాల్బార్డ్ దీవికి విమానాల్లో వస్తున్నపుడు కిటికీల్లో నుంచి చూస్తే ముందుగా కనిపించేది మంచు టోపీలు పెట్టుకున్నట్లుండే పర్వతాలు. అదికూడా సంవత్సరంలో ప్రకాశవంతంగా ఉండే సగం కాలంలో వస్తేనే. ఈ కాలంలో అర్థరాత్రి కూడా సూరీడు ఉంటాడు.. వారంలో ప్రతి రోజూ 24 గంటలూ కనిపిస్తాడు. మిగతా అర్థ సంవత్సరంలో చీకటి రాజ్యమేలుతుంది. తరచుగా ఉత్తర కాంతి మెరుపులీనుతూ నాట్యం చేస్తుంటుంది. నార్వే ప్రధాన భూభాగానికి ఉత్తరంగా 800 కిలోమీటర్ల దూరంలో.. ఆర్కిటిక్ మహాసముద్రం మధ్యలో ఉంటుంది స్వాల్బార్డ్. ఇది ప్రపంచంలో ఉత్తర కొసన ఏడాది పొడవునా జనం ఉండే ఆవాస ప్రాంతం. ప్రపంచంలో ఉత్తరాన చిట్టచివరన గల యూనివర్సిటీ, చర్చి, బ్రూవరీ ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలో ఎవరైనా నివసించగలిగే అతి తక్కువ ప్రాంతాల్లో ఇదొకటి. స్వాల్బార్డ్ రాజధాని లాంగియర్బన్‌లో నివసించే 2,400 మంది జనాభాలో దాదాపు మూడో వంతు మంది వలస వచ్చినవారే. వారు 50 పైగా దేశాల నుంచి వచ్చారు. ఏ దేశ పౌరులైనా సరే ఒక ఉద్యోగం, నివసించటానికి ఒక ఇల్లు ఉంటే చాలు.. ఇక్కడ స్థిరపడొచ్చు. ఈ ప్రాంతానికి మొదటిగా 1,200 సంవత్సరం ప్రాంతంలో వైకింగులు వచ్చారని భా...

ఆవు పై అత్యాచారం

Image
అత్యంత జుగుప్సాకరమైన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. మానవ జాతి సిగ్గు పడాల్సిన సంఘటన ఆ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కామం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆవు మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇవే.. మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చాచోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగంజ్ కు చెందిన ఓ మూగవాడు శనివారం అర్ధరాత్రి ఆవుపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానిక నివాసి భవనంపై నుంచి ఆ అఘాయిత్యాన్ని వీడియో తీశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని చూసిన వారంతా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రేమికులు ఈ ఘటనను ఖండించారు. ఈ వీడియోను చూసిన స్థానికుడు ముఖేష్ శర్మ నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి, నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ----------------------------------------------------------- The most disgusting event has come to light in Madhya Pradesh. T...

'బాబు'కు మరో షాక్ !

Image
ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటివి తెలుగు రాజకీయాల్లో కొత్త కాకున్నా.. ఇటీవల కాలంలో మాత్రం మరింతగా పెరిగిపోయాయి. తాము అధికారపక్షంలో లేకుంటే ఊపిరి ఆడనట్లుగా ఫీలయ్యే నేతలు పెరిగారు. దీంతో.. పవర్ లో ఉన్నప్పుడు ఒకలా.. పవర్ చేజారిన వెంటనే మరోలా వ్యవహరించే తీరు అంతకంతకూ పెరుగుతోంది. ఆ మధ్య జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బాబుకు భారీగా పంచ్ లు ఇస్తూ.. తెలుగు తమ్ముళ్లు పలువురు పార్టీని వదిలేసి వెళ్లిన వైనం తెలిసిందే. లాక్ డౌన్ వేళలోనూ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు.. మరో మాజీ మంత్రి ఇద్దరూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ గూటికి చేరుకునేందుకు రెఢీ అవుతున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతోంది. సైకిల్ మీద ప్రయాణం కష్టంగా మారిందని.. ఎంచక్కా ఫ్యాన్ కింద కూర్చొని చల్లటి గాలికి సేద తీరాలని భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు పార్టీలో చేర్చటం తెలిసిందే. ఎమ్మెల్సీ పోతుల సునీత..చీరాల ఎమ్మెల్యే కమ్ టీడీపీకి వీర విధేయుడిగా చెప్పే కరణం బలరాంతోపాటు.. తన కుమారుడ్ని అధికార పార్టీలో చేర్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా పార...

తెలంగాణ కోవిడ్ టెస్టులు త‌క్కువ‌గా చేస్తోందా..?

Image
క‌రోనావైర‌స్ నిర్ధర‌ణ ప‌రీక్ష‌లను ఎక్కువ‌గా చేయ‌డంలేద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై తెలంగాణ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి కోరారు. అయితే తాము భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌క్కాగా అనుస‌రిస్తూ త‌గిన‌న్ని ప‌రీక్ష‌లు చేస్తున్నామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూదన్ మే7న రాసిన లేఖ‌ను ది ప్రింట్ ప్రచురించింది. రాష్ట్రంలో చేస్తున్న‌ టెస్టులను సమీక్షించాల‌ని, సంఖ్యనూ పెంచాలని లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కోరారు. దిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడుల‌తో పోలిస్తే రాష్ట్రంలో చాలా తక్కువ టెస్టులు చేస్తున్నారని గుర్తు చేశారు. గ‌త ఏడు రోజులుగా మాత్రం.. గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే, గత ఏడు రోజుల్లో మాత్రమే తెలంగాణలో టెస్టుల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చిన లేఖలు, హైకోర్టు విచారణలే దీనికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం మే 20 నాటికి తెలంగాణలో నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 30,076. వీటిలో 1,661 పాజిటివ్ కేసులు ...

పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది -:- ఆర్బీఐ గవర్నర్ దాస్

Image
భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం భారత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. ప్రైవేట్ వినియోగం దారుణంగా పడిపోయిందని చెబుతూ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. అంటే, ఇప్పుడున్న 4.4 శాతం నుంచి రెపో రేట్ 4 శాతానికి తగ్గుతుందని శక్తికాంత దాస్ అన్నారు. రివర్స్ రెపో రేట్ కూడా 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందు, మార్చి 27న కూడా ఆర్థిక వృద్ధి రేటును వేగవంతం చేయడం రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను నిరర్థకంగా అటి పెట్టుకోకుండా ఉండేలా చేసేందుకు రివర్స్ రెపో రేటును కూడా 3.75 శాతానికి తగ్గించారు. ఆ తరువాత ఇప్పుడు మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా, మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థికరంగం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు నెలల వ్యవధిలో ఇది ఆర్బీఐ ఏర్పాటు చేసిన మూడో మీడియా సమావేశం. ఆర్‌బీఐ గవర్నర్ ఇంకా ఏమన్...