పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయింది -:- ఆర్బీఐ గవర్నర్ దాస్


భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావం భారత ఆర్థిక రంగంపై తీవ్రంగా పడిందని అన్నారు. ప్రైవేట్ వినియోగం దారుణంగా పడిపోయిందని చెబుతూ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్లకు తగ్గించారు. అంటే, ఇప్పుడున్న 4.4 శాతం నుంచి రెపో రేట్ 4 శాతానికి తగ్గుతుందని శక్తికాంత దాస్ అన్నారు. రివర్స్ రెపో రేట్ కూడా 3.35 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకుముందు, మార్చి 27న కూడా ఆర్థిక వృద్ధి రేటును వేగవంతం చేయడం రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్లకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు. బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదు నిల్వలను నిరర్థకంగా అటి పెట్టుకోకుండా ఉండేలా చేసేందుకు రివర్స్ రెపో రేటును కూడా 3.75 శాతానికి తగ్గించారు. ఆ తరువాత ఇప్పుడు మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా, మార్కెట్లలో ద్రవ్య వినియోగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆర్థికరంగం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెండు నెలల వ్యవధిలో ఇది ఆర్బీఐ ఏర్పాటు చేసిన మూడో మీడియా సమావేశం.

ఆర్‌బీఐ గవర్నర్ ఇంకా ఏమన్నారు...
  1. కరోనా లాక్‌డౌన్ వల్ల దేశంలో పెట్టుబడుల ప్రవాహంపై గణనీయంగా ప్రభావం పడింది.
  2. కోవిడ్-19 వ్యాప్తి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది.
  3. మార్చిలో భారత పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం మేర పడిపోయింది.
  4. దేశంలో ఆరు పెద్ద పారిశ్రామిక రాష్ట్రాలు రెడ్ జోన్లో ఉన్నాయి.
  5. ఏప్రిల్‌లో తయారీరంగం ఎప్పుడూ లేనంత క్షీణత నమోదైంది.
  6. మార్చిలో కాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో 36 శాతం పతనం.
  7. వినియోగ వస్తువుల ఉత్పత్తి 33 శాతం పడిపోయింది.
  8. తయారీరంగంలో 21 శాతం తక్కువ వృద్ధి నమోదైంది.
  9. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
  10. ఆహారధాన్యాల ఉత్పత్తితో పెరుగుదలతో ఆహార భద్రతకు భరోసా వచ్చింది. ఖరీఫ్‌లో పంట దిగుబడి 44 శాతం పెరిగింది.
  11. మొదటిసారి లాక్‌డౌన్ విధించినప్పుడు మార్చి 27న మూడు నెలల మారటోరియం ప్రకటించాం. లాక్ డౌన్ పొడిగించడంతో ఇప్పుడు దాన్ని దాన్ని మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకూ పొడిగిస్తున్నాం.
  12. 2020-21లో భారత్ విదేశీ మారక నిల్వల్లో 9.2 బిలియన్ డాలర్ల వృద్ధి నమోదైంది. భారత విదేశీ మారక నిల్వలు ఇప్పుడు 487 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఈ రోజు ప్రకటించిన చర్యలకు ప్రధానంగా 4 లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అవి:
  • మార్కెట్ల పనితీరును మెరుగుపరుస్తూ ఎగుమతులు, దిగుమతులకు మద్దతు ఇవ్వడం
  • రుణ సేవలకు ఉపశమనం అందిస్తూ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడం.
  • వర్కింగ్ కాపిటల్‌ మెరుగు పరిచేందుకు నగదు లభ్యత పెంచడం
  • రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న ఆర్థిక అడ్డంకులను తగ్గించడం
కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం పడిందని చెప్పిన శక్తికాంత దాస్, సిడ్బీ రుణాల మారటోరియంను కూడా మరో 90 రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) రుణాత్మకంగా ఉన్నప్పటికీ, ద్వితీయార్థంలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
-----------------------------------------------------------------

Reserve Bank of India governor Shaktikanta Dasa told a media conference that the impact of Kovid has had a serious impact on the Indian financial sector. The bank announced interest rate cuts, saying private consumption had fallen. The repo rate has been reduced to 40 basis points. That means the repo rate will be reduced to 4% from the current 4.4%, ”said Shaktikantha Das. The reverse repo rate has also been reduced to 3.35%. Earlier, the Governor of RBI announced on March 27 that accelerating the rate of economic growth would reduce the repo rate to 75 basis points. The reverse repo rate has also been reduced to 3.75 per cent to ensure that banks do not have cash reserves. Then the decision was made to reduce it further. He said measures were being taken to increase the use of money in the markets. More measures are being taken to improve the economy. This is the third media conference organized by the RBI in a span of two months.

What the RBI governor says ...
  1. Corona lockdown has had a significant impact on the flow of investment in the country.
  2. The spread of the Kovid-19 has caused the global economy to fluctuate.
  3. Indian industrial output fell 17 percent in March.
  4. The six largest industrial states in the country are in the red zone.
  5. In April, manufacturing was on the decline.
  6. 36% fall in capital goods output in March
  7. Consumer goods output fell 33 percent.
  8. The manufacturing sector recorded a 21% growth.
  9. Foodgrains production has increased significantly in the country.
  10. Increasing food production has ensured food security. Crop yields increased by 44 percent in Kharif.
  11. A three-month marathoner was announced on March 27 when the first lockdown was imposed. With the lockdown extended, we are now extending it for another three months - 31st August.
  12. India's foreign exchange reserves are projected to grow by $ 9.2 billion in 2020-21. India's foreign exchange reserves have now reached $ 487 billion.

There are basically 4 targets for action announced today. They are:
  • Supporting exports and imports while improving the performance of markets
  • Reducing financial stress while relieving debt services.
  • Increasing cash availability to improve working capital
  • Reducing the financial constraints faced by state governments
Shaktikantha Das, who said that Kovid has had a serious impact on government revenues, also announced the extension of the Sidbi Loan Maratorium for another 90 days. Gross Domestic Product (GDP) is expected to rebound in the second half of this fiscal.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !