వలసజీవుల 'దేవుడు'.. ఈ ‘విలన్’ !


"సోనూ సూద్ భయ్యా. ప్లీజ్ సాయం చేయండి. తూర్పు యూపీలో ఎక్కడికైనా నన్ను చేర్చండి. అక్కడి నుంచి ఇంటికి నడిచి వెళ్లిపోతా?" ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్‌కు ట్విటర్‌లో ఓ వ్యక్తి నుంచి వచ్చిన అభ్యర్థన ఇది. ‘‘నడిచి వెళ్లడం ఎందుకు మిత్రమా? నీ నంబర్ పంపించు’’ అని దానికి సోనూ స్పందించారు. గత కొన్ని రోజుల నుంచి సోనూ సూద్‌కు ఇలాంటి అభ్యర్థనలు ఎన్నో వచ్చాయి. ఆయన ఎన్నో సార్లు తిరిగి బదులిచ్చారు కూడా. లాక్‌డౌన్‌ వల్ల స్వస్థలాలకు వెళ్లలేక చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న వారికి సోనూ సాయం చేశారు. వారి కోసం బస్సులు ఏర్పాటు చేశారు. ఆహారం, నీళ్లు అందేలా చూశారు.

వెండి తెరపై విలన్‌గా సోనూ చాలా మందికి తెలుసు. కానీ ఆయనను ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ‘హీరో’ అంటూ పొగుడుతున్నారు. వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులు చూస్తూ ఉండలేకపోతున్నానని, వారిని ఇళ్లకు చేర్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తానని సోనూ సూద్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టుందుకు విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వేల మంది వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలపై నిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో చాలా మంది కార్మికులు కాలినడకన తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సోనూ సూద్ కార్మికులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వలస కార్మికులను వారి వారి ఇళ్లకు చేరవేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆయన ప్రత్యేక అనుమతి తీసుకుని అనేక బస్సులను ఏర్పాటు చేశారు. అంతకుముందు కర్ణాటకలోనూ ఆయన చాలా మంది కార్మికుల కోసం ఇలాగే బస్సులు ఏర్పాటు చేశారు.

‘‘రోడ్లపై నడుస్తూ తమ ఊర్లకు వెళ్తున్న కార్మికులను చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతోంది. ఆఖరి కార్మికుడు ఇంటికి చేరే వరకూ నేను ఈ సాయం చేస్తూనే ఉంటా’’ అని సోనూ సూద్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకతోపాటు బిహార్, ఝార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లోనూ కార్మికులు వారి వారి స్వస్థలాలకు చేరేందుకు సోనూ సూద్ సాయపడ్డారు. పంజాబ్‌లోని వైద్యులు, వైద్య సిబ్బంది కోసం 1,500 పీపీఈ కిట్లు కూడా ఆయన దానం చేశారు. ముంబయిలోని తన హోటల్‌ను వైద్య సిబ్బంది కోసం కేటాయించారు. మహారాష్ట్రలోని భివండీ ప్రాంతంలో వేల మంది పేదలకు, కార్మికులకు రంజాన్ మాసంలో భోజనం ఏర్పాటు చేశారు. కార్మికుల బస్సులను కొబ్బరి కాయలు కొడుతూ ఆయన ప్రారంభిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్విటర్‌లో, మిగతా సోషల్ మీడియా వేదికల్లో ఆయనపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఆయన్ను ఓవైపు అభినందిస్తూనే, మరో వైపు నవ్వులు పూయిస్తూ చాలా మీమ్స్ కూడా ప్రచారమయ్యాయి. కరోనావైరస్‌కు వ్యాక్సిన్ వస్తుందో, లేదో తెలియదు గానీ, వలస కార్మికుల కష్టాలకు సోనూ సూద్ వ్యాక్సిన్‌లా పనిచేశారంటూ వ్యాఖ్యలు కనిపించాయి.

సినిమాల్లో ‘విలన్’ అయినా, నిజ జీవితంలో సోనూ సూద్ హీరో అని ట్విటర్‌లో కొందరు పొగిడారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కన్నా, సోనూ సూద్ బాగా పనిచేస్తున్నారని మనీష్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు. ప్రముఖ షెఫ్ వికాస్ ఖన్నా కూడా సోనూ సూద్ చేస్తున్న సాయంపై స్పందించారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సోనూకు గౌరవసూచకంగా ఆయన సొంత ప్రాంతం మోగా (పంజాబ్) పేరును తాను రూపొందించిన ఓ డిష్‌కు పెట్టారు వికాస్.
--------------------------------------------------------------

"Sonu Sood bhaiyya. Please help me. Join me anywhere in Eastern UP. Do you want to walk home from there?" This is a request from a person on Twitter for famous movie star Sonu Sood. Why not walk Sonu responded that your number is a telephone number. Sonu Sood has received many such requests in the past few days. Even when he replied many times. Sonu has helped those who are struggling to get back home due to the lockdown. Buses were arranged for them. Food and water were provided.

Most people know Sonu as the villain on the silver screen. But he is now praised by everyone on social media as a hero. Sonu Sood told PTI that the migrant workers are unable to cope with the difficulties they are facing and all efforts are being made to bring them home. Thousands of migrant workers have been stranded in different parts of the country due to a lockdown imposed to prevent the spread of coronavirus. The ban on all forms of public transit came into effect after the lockdown was announced. This forced many workers to return to their homes on foot. At such a difficult time, Sonu Sood came forward to help the workers. He obtained special permission from the Uttar Pradesh government to set up a number of buses to get migrant workers back to their homes. Earlier, he had set up similar buses for many workers in Karnataka.

I am very disturbed when I see workers walking on their roads. Sonu Sood said I will continue to help till the last worker comes home. Sonu Sood has helped workers to return to their homes in states like Uttar Pradesh, Karnataka and Bihar and Jharkhand. He also donated 1,500 PPE kits to doctors and medical staff in Punjab. He reserved his hotel in Mumbai for the medical staff. Thousands of poor and laborers in the Bhiwandi region of Maharashtra have organized meals during the Ramadan month. One of his videos, which begins with coconuts on workers' buses, has gone viral on social media. On Twitter and other social media platforms, he posted a lot of praise on him. Many compliment memes, while congratulating Aayan on the other side and smiling at the other side. It is not known whether the coronavirus is vaccinated or not, but it is said that Sonu Sood worked as a vaccine for migrant workers.

Despite being the villain in the movies, some on Twitter have praised Sonu Sood as a hero. Manish believes that Sonu Sood is doing better than the central and state governments now. Veteran chef Vikas Khanna also responded with the help of Sonu Sood. He thanked him. In honor of Sonu, Vikas has named his own region Moga (Punjab), a dish he has designed.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

కల్లోలంలో గందరగోళం - చనిపోయిన వృద్దురాలు వాపసొచ్చింది !

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

కరోనాతో పోరు కోసం మరో ముస్లిం వైద్యుడి అద్భుత ఆవిష్కరణ

పెళ్లి కోసమై వలలో చిక్కెనే పాపం పిలగాడు..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!