ఇక గుమ్మం ముందుకే మద్యం !


ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి జొమాటోలు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్రం ఓకే చెప్పింది. దీంతో ఇక క్యూలైన్ లో మద్యం కోసం నిలబడడానికి నామోషీగా ఫీలయ్యే వారు.. బిజీగా ఉండి ఇక మద్యం షాపుకు వెళ్లలేని వారికి ఈ రెండు సంస్థలు మద్యం హోం డెలివరీ చేస్తాయి. ఫుడ్ తోపాటు మద్యం ను కూడా డెలివరీ చేసేందుకు ఈ సంస్థలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

స్విగ్గీ జొమాటోలు ఇక నుంచి మద్యం హోం డెలివరీ చేయనున్నాయి. ఈ మేరకు తొట్టతొలిగా జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇవాళ మద్యం హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించాయి. దీనికోసం యాప్ లో ‘వైన్ షాప్స్’ అనే ఆప్షన్ ను ప్రవేశపెట్టాయి. ఇక 18 ఏళ్లలోపు వారు వయసు ధ్రవీకరణ కోసం ఆధార్ లేదా ఏదైనా కార్డుతో సెల్ఫీ దిగి అందులో పోస్టు చేయాలి. మైనర్లకు మద్యం అమ్మకుండా యాప్ లో మార్పులు చేశారు. ఓటీపీ ద్వారా మద్యం డెలివరీ చేస్తారు.

మద్యం కోసం క్యూలు కట్టడాలకు ఇక చెక్ పడనుంది… బడాబాబులు అందరూ కూడా ఇంట్లోనే ఉండి మద్యం తెప్పించుకునే వీలు కలగనుంది.
---------------------------------------------------------------

The Center says it is okay for leading food delivery companies Swiggy Zomatos to make memorandums of understanding with state governments. These two companies make alcohol home delivery to those who are busy and can no longer go to the liquor store. The companies are also contracting to deliver food, including food.

Swiggy Tomatoes will no longer be home to alcohol. To this end, the Jharkhand Government has entered into an agreement. Launching of eco liquor home delivery services in Ranchi, capital of Jharkhand. For this purpose, Wine Shops has introduced an option called app in the app. Anyone under 18 years of age should submit a selfie with Aadhaar or any card for age verification. Minors made changes to the app without selling alcohol. Alcohol is delivered by OTP.

The queues for alcohol will no longer be checked… all the badgers will be at home and will be able to get alcohol.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !