కరోనాతో పోరు కోసం మరో ముస్లిం వైద్యుడి అద్భుత ఆవిష్కరణ
కరోనాతో పోరులో ముస్లిం డాక్టర్లు మిగతా వారి కంటే ముందున్నారు. మొన్ననదీమ్ రహ్మాన్ అనే ఢిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన డాక్టర్ కరోనా పై యుద్ధం చేయటానికి కేవలం రూ.500/- లకే COVID-19 టెస్టింగ్ కిట్ ను రూపొందిస్తే... ఇప్పుడు పాకిస్థాన్ దేశానికి చెందిన డాక్టర్ సౌద్ అన్వర్ ఏక కాలంలో ఒకే వెంటిలేటర్ 7 గురికి పనిచేసే విన్నూత్న “స్ప్లిట్టర్” రూపొందించి ప్రష్మసాలు అందుకుంటున్నాడు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రతీ దేశంలో హాస్పిటల్ వెంటిలేటర్ బెడ్స్ కు మించి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల వెంటిలేటర్లు సరిపెట్టలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి కష్ట సమయంలో అమెరికాలో ఉంటున్న పాకిస్తాన్ ముస్లిం అయిన పల్మనరీ స్పెషలిస్ట్ డాక్టర్ సౌద్ అన్వర్ ఈ సమస్యకు చెక్ పెడుతూ, ఒకే వెంటిలేటర్ ఏక కాలంలో 7 గురికి ఉపయోగించగలిగే వినూత్న ‘వెంటిలేటర్ స్ప్లిట్టర్’ను రూపొందించి, దాన్ని "కరోనా వారియర్"గా అభివర్ణించాడు.
ఈ విషయం సదరు డాక్టర్ ఉంటున్న 'సౌత్ విండ్సర్' వాసులకు తెలియగానే వారు ఆ డాక్టర్ సౌద్ అన్వర్ గౌరవార్థం "Your Heroism Inspired Us " అనే ప్లకార్డులు చేతబట్టి చప్పట్లు కొడుతూ “అన్ సంగ్ హీరో పరేడ్”ను నిర్వహించి డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు చూపిన అభిమానానికి ఆ సందర్భంలో డాక్టర్ సౌద్ అన్వర్ ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత తాను రూపొందించిన ఈ వెంటిలేటర్ స్ప్లిట్టర్ సులువైన పద్ధతిలో ఎలా రూపొందించవచ్చో.. అనేక మంది కరోనా పెషంట్లకు ఎలా వినియోగించవచ్చో స్వయంగా డాక్టర్ సౌద్ అన్వర్ వివరించారు. ఈ వీడియోను క్రింది లింక్ లో చూడవచ్చు.
డాక్టర్ ఉదారతకు తలవంచాల్సిందే..
ఇక్కడ చెప్పుకోతగ్గ విషయం ఏమిటంటే డాక్టర్ సౌద్ అన్వర్ రూపొందించిన ఈ వినూత్న “వెంటిలేటర్ స్ప్లిట్టర్ (Splitter)” పేటెంట్ రైట్స్ కోసం పాకులాడకుండా, దానిని వ్యాపారాత్మకంగా మార్చుకోకూడదనే సదుద్దేశంతో ఈ పాకిస్థానీ డాక్టర్ దీని డిజైన్ ను అన్ని దేశాలలో ఎవరైనా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునేలా తన ఫేస్ బుక్ పేజ్ లోనే అప్ లోడ్ చెయ్యడం ఆయన ఉదార గుణానికి నిదర్శనం.
ఇప్పటికే 1000కి పైగా డౌన్లోడ్లు..
ఇప్పటికే 100 దేశాలలో 1000 సార్లకు పైగా ఈ 'వెంటిలేటర్ స్ప్లిట్టర్' డిజైన్ ను డౌన్ లోడ్ చేసుకోవటం జరిగింది. అతి సులువుగా తయారయ్యే ఈ పరికరం వల్ల ఒకే వెంటిలేటర్ ఏక కాలంలో 7 నుండి 8 మంది ప్రాణాలను నిలుపుతుంది. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ఇలాంటి విన్నుత్న పరికరం తయారుచేసి అనేక మంది ప్రాణాలను కాపాడటానికి కారణమైన డాక్టర్ సౌద్ అన్వర్ నిజంగా అభినందనీయులు.
ఈనాడు ఏ ముస్లిములనైతే కరోనా జిహాద్ చేస్తున్నారని కొందరు మతోన్మాదులు విమర్శిస్తున్నారో.. ఆ ముస్లిములే కరోనాపై యుద్ధం చేయటానికి వినూత్న టెస్టింగ్ కిట్, విన్నుత్న వెంటిలేటర్ స్ప్లిట్టర్ లాంటి ఎంతో ఉపయోగకరమైన పరికరాలు రూపొందించి అనేక మంది ప్రాణాలు నిలబడటానికి కారణమవుతున్నారు.
------------------------------------------------------------------------------------------
Comments
Post a Comment