అప్పుడే పుట్టిన ఆ చిన్నారులు ఎలా ఉన్నారు?
ముంబయి నగరంలో కరోనావైరస్ సోకిన గర్భిణులు 100 మందికి పైగా బిడ్డలకు జన్మనిచ్చారు. గత నెలలో లోక్ మాన్య తిలక్ హాస్పిటల్లో జన్మించిన 115 మంది శిశువులలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కానీ, వారు వ్యాధి నుంచి కోలుకున్నట్లు తర్వాత నిర్వహించిన పరీక్షలు వెల్లడించాయి. ఇద్దరు గర్భిణులు కోవిడ్ సోకి మరణించారు. అందులో ఒకామె బిడ్డకు జన్మనివ్వక ముందే మరణించారు. ముంబయిలో ఇప్పటికే 20 వేలకు పైగా మంది కోవిడ్ 19కు గురైనట్లు నమోదు కాగా, 730 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో, భారత ఆర్ధిక రాజధాని కోవిడ్‌కు కేంద్రంగా మారింది. సియోన్ హాస్పిటల్లో సగం మంది శిశువులు కరోనావైరస్ సోకిన తల్లులకు జన్మించారు. ఇందులో చాలా మందికి సిజేరియన్ చేసి కాన్పు చేయవలసి రాగా, మిగిలినవి సహజ ప్రసవాలు అని వైద్య అధికారులు చెప్పారు. అందులో 56 మంది మగ శిశువులు ఉండగా 59 మంది ఆడ శిశువులు ఉన్నారు. కరోనావైరస్ సోకిన 22 మంది మహిళలు ఇతర ఆస్పత్రుల నుంచి వచ్చారు. అయితే, వీరికి వైరస్ ఇంటి వద్ద ఉన్నప్పుడే సోకిందా లేక హాస్పిటల్ వార్డులో సోకిందా అనేది తెలియదు. 40 బెడ్లు ఉన్న ప్రత్యేక వార్డులో 65 మంది డాక్టర్లు, 24 మంది నర్సులతో కూడిన వైద్య బృందాలు గర్భిణులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో గర్భిణుల కోసం హాస్పిటల్ ఇంకొక 34 పడకలను పెంచాలని చూస్తోంది.
డాక్టర్లు, నర్సులు, మత్తు మందు ఇచ్చే అనస్థిస్టులు రక్షణ పరికరాలు ధరించి ఆరు టేబుళ్ల పై మూడు ఆపరేషన్ థియేటర్లలో ఈ డెలివరీలు చేస్తున్నారు. "వైరస్ పాజిటివ్ వచ్చిన చాలా మంది మహిళల్లో వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం ఒక అదృష్టం” అని గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ అరుణ్ నాయక్ చెప్పారు. “కొంత మందికి మాత్రం జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపించాయి. వారికి చికిత్స అందించి కాన్పు తర్వాత ఇంటికి పంపినట్లు" చెప్పారు. “తల్లులలో చాలా ఆందోళన చెందుతున్నారు. మేం మరణించినా పర్వాలేదు, బిడ్డను మాత్రం బతికించండి అని అడుగుతూ ఉండేవార'ని అన్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లులను కోవిడ్ 19 ప్రత్యేక వార్డులో ఒక వారం రోజుల పాటు ఉంచి హైడ్రోక్సిక్లోరోక్విన్ మందుని ఇచ్చినట్లు వారు చెప్పారు. తర్వాత క్వారంటీన్లో 10 రోజుల పాటు ఉంచినట్లు చెప్పారు. తల్లులు ఫేస్ మాస్క్లు ధరించి పిల్లలకి తల్లి పాలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. పిల్లలని తల్లుల నుంచి పూర్తిగా దూరం చేయలేదు.
ఈ వైరస్ పుట్టిన చైనాలోని వుహాన్‌లో ఒక శిశువుకు పుట్టిన 30 గంటలలోపే వైరస్ సోకినట్లు ఫిబ్రవరిలో నమోదైంది. మార్చి నెలలో చికాగోలో కోవిడ్‌కు గురై ఏడాది నిండని పాప మరణించింది. కనక్టికట్‌లో కోవిడ్ 19 లక్షణాలతో 6 వారాల చిన్నారి ప్రాణాలు కోల్పోగా ఈ నెల మొదట్లో 3 సంవత్సరాల చిన్నారి వేల్స్ లో మరణించినట్లు వార్తలు వచ్చాయి. బిడ్డ తల్లి గర్భంలో ఉండగా తల్లి నుంచి బిడ్డకి వైరస్ సంక్రమించడం అరుదని న్యూ యార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చిన్నపిల్లల అంటువ్యాధుల విభాగం డైరెక్టర్ డాక్టర్ ఆడమ్ రాట్నర్ చెప్పారు. అయితే, ఈ పరిస్థితి మారేందుకు అవకాశాలు ఉన్నాయని అయన అన్నారు. ప్రతి రోజు కోవిడ్ లక్షణాలు, వ్యాప్తి గురించి కొత్త సమాచారం అందుబాటులోకి వస్తోందని చెప్పారు. తల్లి గర్భంలో ఉండే మావి పొరల్లో కూడా కరోనావైరస్ కనిపిస్తోందని కొత్తగా నివేదికలు వస్తున్నాయని అన్నారు. కానీ, అది బిడ్డని ఇన్ఫెక్షన్ కి గురి చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
వైరస్ తీవ్రంగా సోకిన కొంత మంది గర్భిణీల కడుపులోనే శిశువులు మరణిస్తున్న నివేదికలు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే, అది పూర్తిగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకడం వలనేనని చెప్పడానికి లేదని అన్నారు. ఒక్కొక్కసారి శిశువులు గర్భంలో ఉండగానే వైరస్ బారిన పడుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయని రాట్నర్ తెలిపారు. "కోవిడ్ 19 సోకిన తల్లులకు పుట్టిన బిడ్డల ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉందని" ఆయన అంటున్నారు. రాట్నర్ తాను స్వయంగా కోవిడ్ సోకిన తల్లులకు పుట్టిన బిడ్డల సంరక్షణను పర్యవేక్షించానని చెప్పారు. వైరస్ తల్లి నుంచి బిడ్డకి సోకకుండా పిల్లలకి తల్లి పాలు ఇప్పించే ఏర్పాట్లు చేశామని. వైరస్ సోకిన చాలా మంది పిల్లలు త్వరగానే కోలుకున్నారని ఆయన చెప్పారు. ముంబయి హాస్పిటల్లో కోవిడ్ 19 సోకిన తల్లులకు పుట్టిన పిల్లల సంఖ్య అంతే వ్యవధిలో సాధారణంగా జరిగే కాన్పుల కన్నా 20 శాతం ఎక్కువగా ఉంది. “గత వారం ఒక 28 ఏళ్ళ గర్భిణి ఒక బిడ్డకు జన్మనిచ్చాక మరణించడం మమ్మల్ని చాలా బాధకు గురి చేసింది. ఆమె లివర్ దెబ్బ తినడంతో ఇక కోలుకోవడం సాధ్యపడలేదు” అని నాయక్ చెప్పారు. “ఆమెకు చికిత్స అందిస్తున్నప్పుడు మేమెంత నిస్సహాయులమో అర్ధమైంది. నన్ను కాపాడటానికి ఏదైనా చేయగలరా? అని ఆమె దీనంగా అడుగుతూనే ఉంది."
------------------------------------------------------------
More than 100 babies have been born in Mumbai. Three out of 115 babies born at Lok Manya Tilak Hospital last month were found to be positive. But later tests revealed that they had recovered from the disease. Kovid Soki died of two pregnancies. Only one of them died before the baby was born. More than 20 thousand people have been reported to have been killed by Kovid 19 in Mumbai and 730 deaths. With this, India's financial capital became the center of Kovid. About half of the babies at Zion Hospital were born to mothers infected with coronavirus. Most of them have had a cesarean section, while the rest are natural births, medical officials said. Of these, 56 were male and 59 were female. 22 women infected with coronavirus were from other hospitals. However, they do not know if the virus is infected while at home or in the hospital ward. A 40-bed special ward with 65 doctors and 24 nurses is providing medical care to pregnant women. As the number of infections increases, the hospital is looking to increase another 34 beds for pregnant women.
Doctors, nurses and anesthetists perform these deliveries in three operating theaters on six tables wearing protective equipment. "It is fortunate that most of the women who get the virus have no symptoms," said Dr. Arun Nayak, head of gynecology. “Moms are very concerned. Never mind that we are dead, they are asking for the child to live. ” They said that after giving birth, mothers were placed in the Covid 19 Special Ward for a week and then given hydroxychloroquine. He said he was kept in Quarantine for 10 days. Mothers donned face masks and arranged for mothers to breastfeed. The child is not completely alienated from the mothers.
It was reported in February that the virus was infected within 30 hours of the birth of a baby in Wuhan, China. Covid died in Chicago in March and died a year later. In Connecticut, Kovid reportedly died in Wales after a 6-week-old child with 19 symptoms died earlier this month in Wales. Dr. Adam Ratner, director of the Division of Pediatric Infections at the New York University School of Medicine, says the virus is not passed from mother to child while the mother is in the womb. However, there are chances that this situation will change, he said. Every day new information about Kovid's symptoms and spread is becoming available. There are new reports that coronaviruses are also found in the placenta of the mother's womb. But it is of the view that the baby may not be infected.
There have also been reports of infants dying in the womb of some pregnant women who are infected with the virus. However, it does not say that it was completely infected with coronavirus infection. Ratner said some reports say that once in a while babies are infected with the virus. “There is a need to closely monitor the health of newborns for Kovid 19 infected mothers,” he says. Ratner said he himself oversees the care of newborns for mosquito-borne mothers. Arrangements have been made to breastfeed the child without the virus being passed from mother to child. Most children infected with the virus recovered quickly, he said. The number of babies born to mosquito-infected mothers at Mumbai Hospital is 20 per cent higher than the usual condoms. “Last week, a 28-year-old pregnant woman died after giving birth to a baby. She could no longer recover from a liver injury, ”Nayak said. “I understand how helpless she is when she is being treated. Is there anything you can do to save me? That is what she is asking for. "
Comments
Post a Comment