లాక్ డౌన్.. ఓ అందమైన దేశపు సంప్రదాయం
మార్చి 25న ఆ దేశపు రోడ్లపై బైకులు, కార్ల రాకపోకలు లేవు. వీధుల్లో రోజూ నూడిల్స్ అమ్మేవారి కదలికలు లేవు. విమానాల చప్పుళ్లూ లేవు. ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదించేందుకు, నిశ్శబ్దంగా ఇంటి ముందు కూర్చుటే తూనీగల గుసగుసలు, కప్పల బెకబెకలు తప్ప ఏమీ వినిపించవు. ఇండోనేషియాలోని బాలీ అనే ఓ చిట్టి దేశం ముచ్చట్లు ఇవి..
ఇదంతా కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్ అనుకుంటే పొరపాటే. అది బాలీ నూతన సంవత్సరం రోజు ‘న్యేపీ’. ‘సైలెంట్ డే’ అని కూడా అంటారు. ఆ రోజు 24 గంటలూ బాలీ వాసులంతా ఇల్లు దాటి కాలు బయటపెట్టరు. ఒక సంవత్సరానికి ముగింపు పలుకుతూ, కొత్త ఏడాదికి సిద్ధం అవుతున్నట్లు సంకేతంగా ఆ రోజు అలా గడుపుతారు. ఈ ఆచారం ఏటా కొనసాగుతుంది.
సందడి తర్వాత నిశ్శబ్దం
ఆ రోజు తుపాను తర్వాత ప్రశాంతత మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే, అంతకుముందు మూడు రోజుల పాటు బాలీ ద్వీపం అంతటా సందడి వాతావరణం ఉంటుంది. రాక్షసుల ఆకారంలో భారీ దిష్టి బొమ్మలను తయారు చేసి, డబ్బు చప్పుళ్లతో ఊరేగిస్తారు. అదంతా ఒక భారీ వేడుకగా సాగుతుంది. ఆ బొమ్మలకు జంతువులను బలి ఇస్తారు. పచ్చి మాంసం, గుడ్లు, మద్యంతో పాటు రకరకాల వంటకాలను పెడతారు. ఆ రాక్షసులు శాంతించాక, వాటిని తమ ప్రాంతం నుంచి బయటకు సాగనంపేందుకు కాగడాలు పట్టుకుని, భారీ ఎత్తున కేకలు వేస్తూ, పరుగులు పెడతారు. ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత రోజు ‘న్యేపీ డే’ (కొత్త సంవత్సరం). చంద్రుడి గమనం ఆధారంగా సాకా క్యాలెండర్ ప్రకారం, బాలీలో కొత్త సంవత్సరం వేర్వేరు తేదీల్లో వస్తుంది. సాకా సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం 78వ సంవత్సరంలో భారత రాజు కనిష్కుడు స్థాపించారు. హిందూ మిషనరీలు దానిని ఇండోనేషియాలోని జావాకు విస్తరించారని, తర్వాత బాలీకి చేరుకున్నారని చరిత్రకారులు చెబుతారు. ప్రస్తుతం ఇండోనేషియాలో హిందువుల మెజారిటీ ఉన్న ఏకైక ద్వీపం బాలీనే. ఇండోనేషియా జనాభాలో 90 శాతం ముస్లింలే ఉన్నారు.
సకలం బంద్
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్ విధించడంతో జనాలు ఒక్కసారిగా షాకయ్యారు. కానీ, బాలీ వాసులకు అది కొత్తేమీ కాదు. వారు ‘న్యేపీ డే’ పేరుతో ఏటా పాటించేదే. అయితే, ఈసారి కరోనావైరస్ వల్ల దానిని పొడిగించినట్లు అయ్యింది. ఆ రోజు బాలీ ద్వీపం అంతటా ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టకూడదు. పనులకు వెళ్లకూడదు, విందులు, వినోద కార్యక్రమాలు ఉండవు. వ్యాపార కార్యకలాపాలన్నీ 24 గంటలు పూర్తిగా మూతపడతాయి. విమానాశ్రయాలను కూడా మూసివేస్తారు. కొంతమంది ఆ రోజు ఉపవాసం పాటిస్తారు. మరీ అవసరమైతే తప్పితే మొబైల్ ఫోన్లనూ వాడరు. అంతేకాదు, కుక్కలు, కోళ్లు కూడా ఆ రోజు నిశ్శబ్దంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. న్యేపీ డే నిబంధనలకు సంబంధించి ప్రత్యేక చట్టం కూడా ఉంది. ఆ చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించకుండా చూసేందుకు పోలీసులు వీధుల్లో గస్తీ తిరుగుతారు.
ఎందుకలా?
వెళ్లిపోయిన రాక్షసులు తిరిగొచ్చినా, “దీవి అంతా నిర్మానుశ్యంగా ఎడారిలా ఉందని అనుకుంటాయి. మరో ఏడాది దాకా రావొద్దని వెనక్కి వెళ్లిపోతాయి” అన్నది స్థానికుల నమ్మకం. ఆ నమ్మకాన్ని అటుంచితే, ఆ రోజును ఎంతో ఫలవంతంగా వాడుకుంటున్నామని చాలామంది చెబుతున్నారు. “ఈసారి నిశ్శబ్దం ధ్యానం చేసుకునేందుకు చాలా బాగా పనికొచ్చింది. నేను 40 ఏళ్లుగా న్యేపీ వేడుకలు చేసుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆచారం వెనకున్న మంచి గురించి ఇంకా తెలుసుకుంటున్నాను” అని స్థానిక హిందువు, పాఠశాల కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ దార్వియాతి చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కరోజైనా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం దొరకడం చాలా మందచిదని, భవిష్యత్తులో ఉత్పాదకతను పెంచేందుకు కూడా అది దోహదపడుతుందని ఆమె అంటున్నారు. టీవీలు, ఇంటర్నెట్‌లను పక్కన పెట్టేసి, ఆ రోజంతా కుటుంబంతో గడిపే వీలుంటోందని చెబుతున్నారు.
పర్యావరణానికి మేలు
అది కేవలం 24 గంటలే అయినా, పర్యావరణంపై మంచి సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. 2015లో ఇండోనేషియా వాతావరణ విభాగం జరిపిన ఒక అధ్యయనంలో బాలీ సైలెన్స్ డే సందర్భంగా అక్కడి పట్టణ ప్రాంతాల్లో గాలిలో కాలుష్య కారక రేణువుల సాంద్రత 73 శాతం నుంచి 78 శాతం మేర తగ్గిందని తేలింది. అదే రోజు కర్బన వాయు ఉద్గారాలు 33 శాతం మేర తగ్గాయని వాతావరణ మార్పులపై ఇండోనేషియా వేసిన కమిటీ వెల్లడించింది. కేవలం ఒక దీవిలో, ఒక్క రోజు అలా చేస్తేనే అంత సానుకూల మార్పు కనిపిస్తోందని, దేశమంతా దానిని అమలు చేస్తే మరింత మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని స్థానికులు అంటున్నారు. అది ఒక ఆచారంలా కాకుండా, ప్రకృతి పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి కోసం దానిని దేశమంతా అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
“కోవిడ్-19 రాకముందు ప్రపంచంలో ఏటా 24 గంటలు మూతపడే ఏకైక విమానాశ్రయం బాలీదే. ప్రధానంగా పర్యాటకంపైనే ఆధారపడి ఉన్న బాలీ, ప్రకృతి పరిరక్షణ, సంప్రదాయాలను గౌరవించడంలోనూ ముందుంది. ప్రకృతితో అనుసంధానం కావడం, కుటుంబ బంధాలను పెంచుకోవడం, మనతో మనం కనెక్ట్ కావడం పాశ్చాత్య దేశాల్లో తగ్గిపోతోంది. జీవితంలో చిన్ని చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యమన్నది ఆ దేశాలు గ్రహించాలి” అని దార్వియాతి అంటున్నారు.
-----------------------------------------------------------
On March 25, there were no bikes and cars on the roads of the country. There are no movement of noodle vendors on the streets daily. There are no flights. To enjoy that silence, nothing can be heard except the whisper whispers and the frogs' beakbuckles sitting quietly in front of the house. This introduction is all about Bali, which is a small country lies in Indonesia Island.
All this would be a lockdown of the coronavirus, which is a mistake. It's a New Year's Day in Bali. That's also called the silent day telephone. 24 Bali residents do not get out of the house 24 hours a day. That day is spent signaling the end of a year and preparing for a new year. This practice continues annually.
Silence after buzzing
The calm after the storm of the day is like that. This is because of the breezy weather throughout the island of Bali for the previous three days. They make huge scarecrows in the shape of monsters and swing with money. All this is going to be a huge celebration. Animals are sacrificed to those toys. Variety of dishes are prepared including raw meat, eggs and alcohol. Once the monsters have calmed down, they can grab the rags and scream and run away to get them out of their area. The day after those events ends. According to the Saka calendar, based on the lunar cycle, the new year in Bali falls on different dates. The Saka Empire was founded by Kanishka, the king of India, in the 78th year of Christ. Historians say that the Hindu missionaries extended it to Java in Indonesia and then to Bali. Balinese is currently the only island with a majority of Hindus in Indonesia. Muslims comprise 90 percent of Indonesia's population.
All will be closed..
Many countries have been shocked by the lockdown of several countries to curb the spread of coronavirus. But it is no stranger to Balinese. They practice annually under the name of nappy day number. However, this time it was extended by the coronavirus. No one should leave the house of Bali that day. There should be no chores, no dinners, no entertainment. All business operations are completely shut down for 24 hours. Airports are also closed. Some people fast that day. Never use mobile phones unless absolutely necessary. Locals say dogs and chickens are also quiet that day. There is also special legislation relating to napie day regulations. Police patrol the streets to see that no one has violated that law.
Why like that ?
The departed demons replied, “The island is thought to be inexorably desert. The locals believe that they will be left behind for another year. ” Many people say that if that belief is put in place, it will be used most effectively that day. “This time the silence is very good for meditation. I have been doing nappy celebrations for 40 years. Quite calm. I am still learning about the good behind this practice, ”said Sri Darwiyathi, who is the school's secretary for a local Hindu. She says that the chances of having fun with family members at home all day long are very slow and it will also help increase productivity in the future. Television and the Internet are set aside and the family is said to be spending the whole day.
Good for the environment
Even if it is just 24 hours, it is making a positive impact on the environment. A study by the Indonesian Meteorological Department in 2015 showed that during the Bali Silence Day, the concentration of air pollutant particles in urban areas decreased from 73 percent to 78 percent. Indonesia's Committee on Climate Change said carbon emissions fell 33 percent the same day. Locals say that just doing one day on a single island will see such a positive change and even better results if the country is to implement it. They feel that it is better than just a ritual, if it is implemented all over the country for nature conservation and clean air.
“Bali is the only airport in the world to shut down for 24 hours before the arrival of Kovid-19. Bali, which mainly relies on tourism, is also committed to respecting nature conservation and traditions. Connecting with nature, building family bonds, and connecting with us is diminishing in the West. Those countries must realize that even the smallest things in life are important, ”says Darwati.

Comments
Post a Comment