మద్రాసులో మహమ్మారి వ్యాప్తికి కుట్ర !
చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండడం కలకలం రేగుతోంది. నోట్ల మాటున కరోనా వ్యాప్తికి కుట్ర జరుగుతోందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలోని పురసైవాక్కం, వెస్ట్ మాంబళం, మాధవరం తదితర ప్రాంతాల్లోని ఇళ్ల ముందు రాత్రివేళ నోట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నెల 2 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చెన్నై మాధవరం పాలకొట్టం సమీపంలోని కేకే తాళై మాణిక్యం వీధిలో ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 కరెన్సీ నోట్లను చల్లి వెళ్లిపోయారు. గమనించిన కొందరు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా చిక్కలేదు.
నోట్లు చల్లిన వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో వాటిని తీసుకునేందుకు జనం భయపడ్డారు. నోట్లను వీడియో తీసిన ఓ మహిళ ఇలాంటివి ఇళ్ల ముందు కనిపిస్తే తీసుకోవద్దని, కరోనా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు.
------------------------------------------------------------------
Currency notes are showing up in front of houses in many parts of Chennai. There is suspicion that there is a conspiracy to spread the corona over the mouths. The notes are being seen in front of houses in Purasivakkam, West Mambalam and Madhavaram in Chennai. On the night of this month, some unidentified persons spilled currency notes of Rs 20, Rs 50 and Rs 100 in front of a house at Keke Talai Manikyam Street near Madhavaram Palakkottam, Chennai. Some of the observers tried to catch them but were not caught.
The people were afraid to take them because the way they sprinkled the notes was suspicious. A woman who videotaped the notes posted on social media warning her not to take any such pictures in front of the house, and that Corona is likely to be infected. Police responded after the video went viral on social media. The accused are being based on CCTV cameras.

Comments
Post a Comment