నిర్బంధంలో మరోసారి విరిసిన మతసామరస్యం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చనిపోయిన ఒక హిందూ మహిళకు నలుగురు ముస్లింలు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని ఖాన్పూర్ ప్రాంతంలో హిందువులు, ముస్లింల నివాసాలు పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ గతంలో మతపరమైన హింస కూడా చెలరేగింది. కరోనావైరస్ కారణంగా ఈ ప్రాంతంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే, తాజా ఘటన హిందూ-ముస్లిం ఐక్యతను చాటింది.
75 ఏళ్ల మహిళ మందాకిని త్రిపాఠి, ఖాన్పూర్‌లో ఉన్న ఉషా-కిరణ్ అపార్ట్‌మెంటులోని తన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండేవారు. ఆమె పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అయితే, గత సోమవారం ఆమె ఇంట్లో జారిపడ్డారు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే ప్రాంతానికి చెందిన ఖాసిం గత 25 ఏళ్లుగా మందాకిని ఇంటికి రోజూ పాలు తీసుకొచ్చేవారు. ఎప్పటిలాగే ఆయన ఆ రోజు వెళ్లి ఇంటి బెల్లు కొట్టగా లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ఆయన దగ్గర కూడా ఆ ఇంటి తాళంచెవి ఒకటి ఉంది. దానితో తలుపు తెరిచి చూడగా ఆమె నేలపై పడిపోయి కనిపించారు. ఖాసిం వెంటనే డాక్టర్‌కు ఫోన్ చేసి పిలిచారు. డాక్టర్ వచ్చి పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయారని చెప్పారు. దాంతో, ఆ విషయాన్ని అమెరికాలో ఉంటున్న మందాకిని కుమార్తెకు వీడియో కాల్ ద్వారా ఖాసిం చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా విమానాలు నడవకపోవడంతో ఆమె భారత్ రాలేకపోయారు. అహ్మదాబాద్‌లో ఉంటున్న తన మేనమామ రజనీకాంత్ భాయ్‌కి ఆమె సమాచారం ఇచ్చారు. ఆయన హుటాహుటిన బైకుపై మృతురాలి ఇంటికి వెళ్లారు. అంత్యక్రియలు చేద్దామంటే సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. ఆయన ఇబ్బందులను గమనించిన ఖాసిం అదే ప్రాంతంలో ఉండే డాక్టర్ హకీం యాసిర్, ఆరిఫ్ షేక్, సైజాద్ జరివాలా, ఫైజల్ భాయ్ మన్సూరీలను పిలిచారు.
"అంత్యక్రియలు నిర్వహించేందుకు వారి బంధువులు ఇబ్బంది పడుతుండటాన్ని మేము గమనించాం. వెంటనే మా ప్రాంతంలోనే ఉండే మరికొందరిని పిలించాం. హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు చేయడం మాకు పూర్తిగా తెలియదు. కాబట్టి, మృతురాలి సోదరుడు రజనీకాంత్ భాయ్ సూచనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాం” అని డాక్టర్ హకీం చెప్పారు. ఆ నలుగురు ముస్లింలు ఎవరో తనకు పరిచయం లేదని, అయినా వాళ్లు తనకు సాయం చేశారని రజనీకాంత్ తెలిపారు.
“అమెరికాలో ఉంటున్న మా మేనకోడలు, మరికొందరు బంధువులు మా అక్క అంత్యక్రియలను చూడాలని ఉందని అన్నారు. నా వయసు 64 ఏళ్లు. టెక్నాలజీ గురించి ఏమీ తెలియదు. దాంతో, ఆరిఫ్ షేక్ తన ఫోన్ నుంచి వీడియో కాల్ చేసి వాళ్లకు చూపించారు. మా బంధువులు కూడా కొద్ది మంది వచ్చారు. నలుగురు ముస్లిం సోదరుల సాయంతో శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లాం. మా అక్క ఉండేది నాలుగో అంతస్తులో. ముస్లిం సోదరులు నాకు సాయం చేయకపోతే, మా అక్క శవాన్ని కిందికి తీసుకురావడం నాకు సాధ్యమయ్యేదే కాదు” అని రజీకాంత్ వివరించారు. “మాతో పాటు ఈ ముస్లిం సోదరులు కూడా ‘హర హర మహాదేవ’ అంటూ నినాదాలు చేశారు. వాళ్లు చేసిన సాయాన్ని ఎన్నటికీ మరచిపోలేను” అని ఆయన అన్నారు.
“హిందు సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అవసరమయ్యే వస్తువులు తీసుకొచ్చేందుకు నేనే వెళ్లాను. ముస్లిం వ్యక్తి.. హిందువుల అంత్యక్రియల వస్తువుల కోసం వచ్చారేంటి? అని దుకాణం యజమాని అడిగారు. ఒక హిందూ మహిళ చనిపోయారు, అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం అని చెప్పాను. అది వినగానే వెంటనే ఆయన గులాబీ పూలు కూడా తెప్పించి ఇచ్చారు. వాటికి డబ్బులు కూడా తీసుకోలేదు. మిగతా వస్తువులకు కూడా చాలా తక్కువ డబ్బులే తీసుకున్నారు. మనుషులు ఒకరికొరు సాయం చేసుకోవాలి. ఒకరి మంచి గురించి మరొకరు ఆలోచించాలి” అని ఫైజల్ భాయ్ మన్సూరీ చెప్పారు.
------------------------------------------------
Four Muslims have attended a funeral for a Hindu woman found dead in Ahmedabad, Gujarat. The Khanpur area of Ahmedabad is home to Hindus and Muslims alike. There has also been religious violence in the past. There is currently no curfew in the area due to coronavirus. The latest event, however, is a Hindu-Muslim unity.
The 75-year-old woman, Mandakini, was alone in her flat at the Usha-Kiran apartment in Tripathi, Khanpur. Her children are staying in the US and Australia. However, she slid into her house last Monday. Serious injuries to the head. Qasim from the same area has been bringing milk to Mandakini's house for the past 25 years. As usual he went that day and hit the house bells and there was no answer from the inside.
He also has one of the locksmiths of the house. She opened the door with it and found herself lying on the floor. Qasim immediately phoned the doctor. The doctor came and examined her and said she was already dead. Qasim said in a video call to Mandakini's daughter, who is staying in the US. She was unable to come to India due to a flight due to a lockdown. She informed her uncle Rajinikanth Bhai, who is staying in Ahmedabad. He went to the deceased's house on a hooded bike. There is no one who can help with the funeral. Qasim, observing his troubles, summoned Dr. Hakim Yasir, Arif Sheikh, Saizad Zarivala and Faisal Bhai Mansuri in the same area.
"We have seen their relatives struggling to perform the funeral. We immediately summoned others in our area. But they did Rajinikanth said he had helped.
“Our niece and other relatives staying in the US said that we should visit our older sister's funeral. I am 64 years old. Nothing is known about technology. So Arif Sheikh made a video call from his phone and showed it to them. Even a few of our relatives came. With the help of four Muslim brothers, the corpse was taken to the crematorium. Our older sister was on the fourth floor. If the Muslim brothers did not help me, I would not be able to bring down the body of our older sister, ”explained Rajikant. “Along with us, these Muslim brothers also chanted 'Hara hara mahadeva'. They will never forget their help, ”he said.
“I went to fetch the things needed to perform funerals according to Hindu traditions. Muslim man .. How come for Hindu funerals? Asked the shop owner. I was told that a Hindu woman has died and is conducting a funeral. Upon hearing this, he immediately brought the rose flowers. They didn't even take the money. The rest of the items were also paid very little money. Humans should help each other. One must think about one's good, ”said Faisal Bhai Mansuri.
Comments
Post a Comment