మద్యంతోపాటే ప్రమాదాలూ ప్రారంభం


లాక్ డౌన్ తో ఇన్నాళ్లు మద్యానికి ప్రజలు దూరమయ్యారు. దాదాపు 44 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అలా తెరుచుకున్న మొదటి రోజే మద్యం ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మద్యం తాగి వాహనాలు నడపడం తో యాక్సిడెంట్లు జరిగాయి. ఇన్నాళ్లు మద్యం లేక ప్రమాదాలు తగ్గుముఖం పట్టగా.. తాజాగా మద్యం దుకాణాలు తెరిచిన తొలిరోజే మద్యంమత్తులో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటనలు ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే.. ఆ వివరాలు తెలుసుకోండి. కేంద్రం ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. నెలన్నర రోజుల తర్వాత మద్యం దుకాణాలకు భారీగా గిరాకీ ఏర్పడింది. ఎప్పుడూ చూడని రద్దీ కనిపించింది. కిలోమీటర్ల మేర క్యూలో నిలబడి మరీ మద్యం కోసం వేచి ఉన్న పరిస్థితులు చూసే ఉంటారు. ఈ విధంగా కొందరు మద్యం అతికష్టమ్మీద కొన్నారు. ఆ కొన్నవారు తాపీగా తాగారు. అయితే తాగిన మైకంలో వాహనం నడపడంతో ఒకరు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తోటపల్లిగూడూరు మండలం కోడూరు పాత పాతాళెంకు చెందిన తులసీ గారి యాదాద్రి (24) సుజిత్ ఇద్దరు మద్యం సేవించారు. అయితే మద్యంమత్తులో బైక్ నడుపుతూ తుల్లుతూ ఎటు వెళ్తున్నారో తెలియక ఆవును ఢీకొట్టి ఆ వెంటనే చెట్టుకు ఢీ కొన్నారు. వారిద్దరూ కింద పడిపోయారు. గమనించిన స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలపాలైన యాదాద్రి మార్గమధ్యంలోనే మృతిచెందాడు. అతడి వెనక కూర్చున్న సుజిత్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు యాదాద్రికి వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా మద్యంమత్తులో బండి నడిపి ప్రాణాలు కోల్పోవడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇక కృష్ణాజిల్లాలో మరో సంఘటన చోటుచేసుకుంది. జగ్గయ్యపేటలోని శాంతినగర్లో మద్యం సేవించిన ముగ్గురు స్నేహితులు బైక్ పై వెళ్తున్నారు. ఆ క్రమంలో ఓ వృద్ధురాలిని ఢీకొట్టారు. వారు కూడా కిందపడ్డారు. వెంటనే గమనించిన స్థానికులు ఆ వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆమెకు తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి కారణమైన తాగి బండి నడిపిన ఆ ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మద్యం విక్రయాలు ప్రారంభమైన తొలిరోజే ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో మద్యం విక్రయాలు బంద్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.

-------------------------------------------------------------

With the lockdown, people have been away for years with alcohol. Almost 44 days later the liquor stores opened. On the first day of the opening, road accidents occurred under the influence of alcohol. Accidents were done with drunk driving. Alcohol or accidents have declined in recent years. These events are not somewhere in the state of Andhra Pradesh .. Find out all those details. According to the Center, liquor sales in Andhra Pradesh state began on Monday. After a month and a half there was a huge demand for liquor stores. There was a rush of never seen. There are many people waiting in queues for a few minutes waiting for alcohol. In this way some people buy alcohol. Those buyers drank it. However, the incident in Nellore district where one person died after being hit by a vehicle while intoxicated. Tulsi Gary Yadadri, 24, of Old Patalem, Kodur, Sujith, served two liquor. However, not knowing where the bike was going, riding a bike, hitting the cow and immediately hit the tree. Both of them fell under. The locals were rushed to the hospital in 108. Yadadri, however, died on the way. Sujit, who was sitting behind him, suffered serious injuries. He is currently receiving treatment at the hospital. The family was in tears after the death of Yadadri, who was due to marry next month.

Another incident took place in Krishnajila. Three friends riding a bike in Shantinagar, Jaggaiahpet. In that order, an old woman was struck. They are also under. The locals immediately noticed that the elderly man was rushed to the hospital. She is being treated in hospital for serious injuries. Her condition is poisonous. However, the three youths who were involved in the accident had been taken into custody by the police.

With the onset of alcohol sales in the first place, the demand for liquor sales is on the rise.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !