జడ్జీకే ఝలక్ ! వార్నింగ్ ఇచ్చిన కానిస్టేబుల్


ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో ఈ ఘటన జరిగింది. ఆ కానిస్టేబుల్ పేరు అరుణ్ కుమార్. లాక్ డౌన్ డ్యూటీలో ఉన్నాడు. లాక్ డౌన్ లో పోలీసులు ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా మేజిస్ట్రేట్ కారులో రోడ్డు మీదకు వచ్చారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా రోడ్డు మీదకు రాకూడదు. సికంద్రబాద్ ప్రాంతంలో కానిస్టేబుల్ అరుణ్, ఆ కారుని ఆపాడు. ఎందుకు రోడ్డుపైకి వచ్చారని డ్రైవర్ ని అడిగాడు. ఆ తర్వాత వారికి ఓ వార్నింగ్ ఇచ్చి పంపేశాడు. దానికి ముందు లాక్ డౌన్ రూల్స్ ఏంటో వారికి వివరించాడు. అకారణంగా రోడ్డు మీదకు రావొద్దని కోరాడు. కరోనా వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నాడు. కాగా అదే కారులో వెనుక సీటులో జిల్లా మేజిస్ట్రేట్ ఉన్నారు. ఈ విషయం కానిస్టేబుల్ కు తెలియదు.
మరోసారి రూల్ బ్రేక్ చేయొద్దని వార్నింగ్..
''కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సికింద్రాబాద్ ప్రాంతంలో కారు ఆపాడు. ఎలాంటి అనుమతి లేకుండా రోడ్డు మీదకు ఎందుకు వచ్చారని కారులో ఉన్న వారిని నిలదీశాడు. అంతేకాదు కారులో ముగ్గురు వ్యక్తులు వెళ్లడానికి పర్మిషన్ లేదన్నాడు. ఆ తర్వాత వారికి ఓ వార్నింగ్ ఇచ్చి పంపేశాడు. మరోసారి నిబంధనలు బ్రేక్ చేయొద్దన్నాడు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే జరిమానా వేస్తామని హెచ్చరించాడు'' అని బులంద్ షహర్ ఎస్ఎస్పీ సంతోష్ తెలిపారు.
కానిస్టేబుల్ పై ప్రశంసల వర్షం..
కానిస్టేబుల్ అరుణ్ కుమార్ డ్యూటీ మైండెండ్ ను జిల్లా మేజిస్ట్రేట్ ప్రశంసించారు. ఎంతో నిబద్దతగా డ్యూటీ చేశావని మెచ్చుకున్నారు. అరుణ్ కు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అంతేకాదు రూ.2వేల రివార్డ్ కూడా ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ పోలీసులు ఎంతో నిబద్దతగా విధులు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పోలీసు ఉన్నాధికారులు అన్నారు.
----------------------------------------------------------------
The event took place in Bulandshahr, Uttar Pradesh. The constable's name is Arun Kumar. Lockdown is on duty. Officers are conducting contingency checks to determine how the police operate in the lockdown. As part of this, the district magistrate's car came on the road. Do not get on the road without permission under lockdown rules. Constable Arun of Secunderabad area stopped the car. The driver asked why he was on the road. He then sent them a word. He explained to them the lockdown rules before that. He was apparently asked not to get on the road. Everyone wants to contribute to the corona virus. The District Magistrate was in the back seat of the same car. The matter was not known to the constable.
Warning not to break the rule again..
“Constable Arun Kumar stopped the car in Secunderabad area. He stood by the men in the car as to why they came on the road without any permission. Also, three people in the car did not get permission to go. He then sent them a word. Once again, he did not break the rules. Once again, he has warned that if you make a mistake like this, you will be fined, ”said Buland Shahar SSP Santosh.
Rain of applause on the constable
Constable Arun Kumar praised the duty minded district district magistrate. Very grateful to have done the duty. Arun was presented with a testimonial. He also gave a reward of Rs. Police chiefs said that they are very happy to perform the duties of the police in the face of such disasters.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !