ఇప్పటి కోరంటి దవాఖానే.. అప్పట్లో క్వారంటైన్ హాస్పిటల్


క్వారంటైన్.. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. కానీ, ఈ ‘క్వారంటైన్’ పదంతో పాటు ‘క్వారంటైన్’లో ఉండటం కూడా హైదరాబాదీలకు కొత్తేం కాదు. 100 ఏళ్ల క్రితమే నగరంలో క్వారంటైన్ ఆస్పత్రిని నిర్మించారు. నిజాం కాలంలో ప్రబలిన అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో ఆ ఆస్పత్రి కీలక పాత్ర పోషించించింది. అదే ఇప్పటికీ నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిగా సేవలందిస్తోంది. ఇదీ ఆ దవాఖానా కథ.

1921లో రాబర్ట్ చావెలో రాసిన 'మిస్టీరియస్ ఇండియా' పుస్తకంలో హైదరాబాద్‌ను "ల్యాండ్ అఫ్ థౌజండ్ అండ్ వన్ నైట్స్"గా అభివర్ణించారు. ఈ పుస్తకంలో హైదరాబాద్, గోల్కొండ గురించి రాస్తూ అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తాను తిరిగిన అనుభవాల గురించి చావెలో వివరించారు. అందులో ఆయన హైదరాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాక ఎదురైన ఒక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. స్టేషన్‌లో రాత్రి ఏడు గంటలకు దిగిన తరువాత ఒక పోలీస్ అధికారి వచ్చి తనను ప్రశ్నించారని, తాను ఎక్కడి నుంచి వచ్చారు.. ఎన్ని రోజులు ఉంటారు.. ఎక్కడెక్కడికి వెళ్తారు.. ఇలా అనేక ప్రశ్నలను ఆ అధికారి అడిగినట్లు తెలిపారు.

తనకు మొదటి రౌండ్ ప్లేగు పరీక్ష పూర్తయ్యాక రెండో దఫా స్క్రీనింగ్, శానిటేషన్ టెస్ట్‌ల కోసం పంపారని, తన 'ప్లేగ్-పాస్‌పోర్ట్'ను పరీక్షించి తదుపరి వైద్య పరీక్షల కోసం సివిల్ హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించినట్లు చావెలో తన పుస్తకంలో ప్రస్తావించారు.

హైదరాబాద్‌లో అంటు వ్యాధులు తీవ్రంగా ప్రబలుతున్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక్క సంఘటన చాలు అప్పటి ప్రభుత్వాల సంసిద్ధత గురించి చెప్పడానికి అంటారు చరిత్రకారులు. అయితే "ప్లేగ్-పాస్‌పోర్ట్"ను ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు అనే దానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, ఈ పుస్తకంలో రాసిన వివరాలను బట్టి చూస్తే.. అప్పట్లో ప్రయాణీకుల్ని స్క్రీనింగ్ చేసి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ప్లేగ్ పాస్‌పోర్ట్ లేని వారిని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేవారని హెరిటేజ్ యాక్టివిస్ట్, ఇన్‌టాక్(ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) సభ్యురాలు పి.అనురాధ రెడ్డి అంటున్నారు.

ప్లేగుకు పరీక్ష చేయించుకొని, శానిటైజేషన్ ప్రక్రియ అంతా పూర్తయ్యాక, 10 రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్నవారికి ఈ ప్లేగ్ పాస్‌పోర్టును అందజేసేవారు. 1931లో నిజాం ప్రభువుకి అందించిన నివేదికలలో ఐసొలేషన్ హాస్పిటల్ గురించి ప్రస్తావిస్తూ.. కలరా, పైరెక్సియా, టీబీ, స్మాల్ పాక్స్ వంటి అంటు వ్యాధులకు చికిత్స పొందేందుకు ఐసొలేషన్ హాస్పిటల్‌కి రోగులు వస్తున్నారని ఆ నివేదికలో తెలిపారు. 1930-31 మధ్య నిజాం ప్రభువుకు అందిన ఓ నివేదిక ప్రకారం.. "ఐసొలేషన్ హాస్పిటల్‌కు ఇది వరకు సీరియస్ కేసులకు మాత్రమే చికిత్స కోసం వచ్చేవారు. కానీ, ఇప్పుడు దాని ప్రాధాన్యం బాగా పెరిగింది. టీబీతో పాటు ఇతర వ్యాధుల చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది’’ అని అందులో ప్రస్తావించారు.
క్వారంటైన్ ఇలా మొదలైంది
అంటువ్యాధులు కూడా చరిత్రలో ఓ భాగమని, అప్పట్లో వ్యాపారులు ఓడల ద్వారా అంటువ్యాధులను మోసుకొచ్చేవారని చరిత్రకారులు చెబుతారు. వ్యాపారులు తీసుకొచ్చే ఓడల్లో సామగ్రితో పాటు ఎలుకలు కూడా ఉండేవి. వాటి ద్వారా వ్యాధులు కూడా వ్యాపించేవి. మొదట్లో ఇలా ఎలుకల ద్వారా అంటు వ్యాధులు ప్రబలాయని, ప్లేగు కూడా అలానే వ్యాపించిందని యూరప్‌లో గుర్తించారు.

‘‘ఇటలీ భాషలో ‘క్వారంటా’ అంటే 40. క్వారంటా జియార్నీ అంటే.. అంటువ్యాధులు ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన ఓడల్ని 40 రోజుల పాటు పోర్టులోకి రానివ్వకుండా తీరంలోనే యాంకర్‌కు కట్టేసి పెట్టేవారు. ఓడలో నుంచి కూడా 40 రోజుల పాటు ఎవరినీ నేల మీదకు రానిచ్చేవారు కాదు. అలా క్వారంటైన్ అనే పదం వాడుకలోకి వచ్చింది. మొదట వెనీస్‌లో ఈ క్వారంటైన్‌ను అనుసరించినట్లు చరిత్ర చెబుతోంది’’ అంటారు అనురాధ.

ఆ స్ఫూర్తితోనే 1915లో హైదరాబాద్ రాష్ట్రంలో స్పానిష్ ఫ్లూ మహమ్మారిని అరికట్టేందుకు క్వారంటైన్ పద్ధతిని పాటించాలని నిజాం పాలకులు భావించారు. అప్పట్లో హైదరాబాద్ శివార్లలో ఉన్న ఎర్రన్నగుట్టపై గుఢారాలు వేసి వ్యాధిగ్రస్తులను అక్కడికి తరలించి చికిత్స అందించడం మొదలుపెట్టారు.

‘‘నాటి నిజాం పాలకుడు వైద్య రంగంలో చాలా ముందు చూపుతో ఉండేవారు. దానికి తగ్గట్టుగానే స్పానిష్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న సమయంలో బోయిగూడ, సీతాఫల్ మండి, ముషీరాబాద్, పాతబస్తి లాంటి అనేక ప్రాంతాల్లో ఇలా ఐసొలేషన్ క్యాంపులు ఏర్పాటుచేశారు. ఈ క్యాంపులకు వ్యాధిగ్రస్తులను కాకుండా ముందు జాగ్రత్తగా కేవలం ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే తరలించేవారు. వ్యాధి తీవ్రత తగ్గేవరకు ఈ శిబిరాలను నిర్వహించేవారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఈ క్యాంపుల గురించి చెప్పటం నాకు గుర్తుంది" అన్నారు అనురాధ రెడ్డి.

1915లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ ఆస్పత్రి 1923 వరకు ఎర్రన్నగుట్ట మీదే ఉండేది. అంటే ప్రస్తుతం నల్లకుంటలో ఉన్న ఫీవర్ హాస్పిటల్‌కి సరిగ్గా ఎదురుగా ఉండేది. "ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్ ఉన్న ప్రాంతాన్ని అప్పట్లో ఊరు చివరిగా భావించేవారు. అక్కడ చాలా ఖాళీ స్థలం ఉండేది. అందులోనూ గుట్ట మీద స్వచ్ఛమైన గాలి వీస్తుందని భావించి గుఢారాలను అక్కడ ఏర్పాటు చేసుండొచ్చు. ఆ తరువాత 1923‌లో ప్రస్తుతం ఉన్న ఫీవర్ హాస్పిటల్ ప్రాంగణానికి ఆ ఆస్పత్రి మారింది.

ఆ ఆస్పత్రిని క్వారంటైన్ కోసం ఉపయోగించేవారు కాబట్టి దాన్ని క్వారంటైన్ ఆస్పత్రి అనేవారు. కానీ, చాలామందికి దాన్ని పలకడం క్లిష్టంగా అనిపించడంతో క్రమంగా దాన్ని కోరంటి ఫీవర్ హాస్పిటల్ అని పిలిచేవారు’’ అని అనురాధ వివరించారు. ఆ ఆస్పత్రి ఉన్న ప్రాంతాన్ని కూడా ఇప్పుడు కోరంటి అనే పిలుస్తున్నారు.

----------------------------------------------

Quarantine .. This is the word that has been the most commonly heard in recent times. But, this is no stranger to Hyderabad's quarantine code. The Quarantine Hospital was built in the city 100 years ago. The hospital was instrumental in combating the spread of infectious diseases during the Nizam's time. The same is still serving as the Black Fever Hospital. This is the story.

In the book "Mysterious India" by Robert Chavelo in 1921, Hyderabad was described as "Land of Thousand and One Nights". In this book, Chavello describes his experiences in the then Hyderabad state, writing about Hyderabad and Golconda. He recalled an experience he had after reaching the Hyderabad railway station. After landing at about seven o'clock in the night, a police officer came and questioned him. He said that he was from where he was. How many days would he go?

Chavelo mentioned in his book that he had been sent for a second screening and sanitation test after completing his first round of plague tests and had been ordered to go to the Civil Hospital for further medical examination by examining his 'plague-passport'.

These are the days when infectious diseases are raging in Hyderabad. Historians are known to say that this single incident was put in place by the governments of the time. However, there is no clear evidence from when the "plague-passport" was issued. But, according to the details of the book, Heritage Activist, Intac (Indian National Trust for Art and Cultural Heritage) member P. Anuratha Reddy said that the screening of passengers at the time, the necessary medical checkups and preventing the entry of the plague passport into the state. After the plague was tested and the sanitization process was completed, the plague passport was issued to those who were healthy for 10 days.

Referring to Isolation Hospital in 1931 reports to the Nizam said that patients are coming to Isolation Hospital for treatment of infectious diseases such as cholera, pyrexia, TB and smallpox. According to a report by the Nizam of the period from 1930-31, "Isolation Hospital was used to treat only serious cases. But now its popularity is increasing.

The Quarantine began as follows
Historians say that epidemics were also a part of history, and that merchants carried the epidemic by ship. The merchants' ships were accompanied by mice and equipment. Diseases can also spread through them. Initially, it was found in Europe that rodents were infectious and that the plague had spread. In Quantum Giorni means 40. Quaranta giorni means that the vessel from infected areas is tied to the anchor on the shore without leaving the port for 40 days. Not even 40 days from the ship would land anyone. Thus the term quarantine came into use. History tells us that the Quarantine was first followed in Venice.

It was in that spirit that the Nizam's rulers hoped to adopt the Quarantine method in 1915 to curb the Spanish flu epidemic in Hyderabad. At that time, the red flags were placed on the outskirts of Hyderabad and the sick were moved there and started treatment.

The Nizam's ruler of the time was a forerunner in the medical field. At the same time, Isolation camps were set up in many areas such as Boiguda, Sitaphal Mandi, Musheerabad and Old Basti during the spread of the Spanish flu. These camps move the sick, not just the sick, but the healthy. The camps were maintained until the severity of the disease subsided. I remember my grandmother telling us about these camps as a kid, ”said Anuradha Reddy. Established in 1915, the Special Quarantine Hospital was a red quarantine until 1923. That is exactly opposite the now defunct Fever Hospital.

"The area where the Fever Hospital is now is considered the end of the town. There was a lot of empty space and the gutters were set up so that the breeze would get clean air. The hospital was called Quarantine Hospital because it was used for Quarantine. But, as many people find it difficult to pronounce it, Anuradha described it as a telephone service called gradual Fever Hospital. The area where the hospital is located is now called Koranti.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !