ఈ నెల 7న ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం


మే 7 న బుద్ధపూర్ణిమ. పౌర్ణమి రోజున మాత్రమే ఫుల్ మూన్ దర్శనం ఇస్తుంది. అయితే ఈ ఏడాది ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతున్నట్టు నాసా ధ్రువీకరించింది. మే 7న ఆకాశంలో చందమామ ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు … డీప్ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. బుద్ధపూర్ణిమ రోజున వచ్చే చంద్రుడిని ఫుల్ మూన్ బ్లడ్ మూన్ అనే పేరుతో పిలుస్తుంటారు. కానీ ఈసారి ఆకాశంలో దర్శనం ఇవ్వబోతున్న చంద్రుడికి ఫ్లవర్ మూన్ గా పిలుస్తున్నారు. ఇది ఈ సంవత్సరం కనిపించే నాలుగో చివరి సూపర్ మూన్. ఈ ఏడాది ఇప్పటికే మనం మూడు సూపర్మూన్ లను చూశాం. ఏప్రిల్లో సూపర్ పింక్ మూన్ వచ్చింది. ఇప్పుడు మరోసారి సూపర్ మూన్ రాబోతోంది. భూమికి చందమామ అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని సూపర్ మూన్ అంటారు. దాన్ని ఒక్కో నెలలో ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. మే 7న కనిపించే చందమామ రోజూ కంటే… 14 శాతం పెద్దదిగా ఉంటుంది. అలాగే… రోజు కంటే 30 శాతం ఎక్కువ కాంతితో కనిపిస్తుంది.

చంద్రుడు భూమికి మరింత దగ్గరకు వస్తున్నందువలన ఇలా మూడు రోజులపాటు ఫుల్ మూన్ దర్శనం ఇవ్వబోతున్నట్టు నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంతకీ దీన్ని సూపర్ ఫ్లవర్ మూన్ అని ఎందుకంటున్నారంటే… ఈ సమయంలో… మే నెలలో ఎక్కువగా పూలు పుస్తాయి. అందువల్ల అలా పిలుస్తున్నారు. అమెరికాలో గిరిజనులు… మే నెలలో పూలతో కొన్ని ఆచారాలు పాటించేవారు. అందువల్ల కూడా మేలో వస్తున్న చందమామను సూపర్ ఫ్లవర్ మూన్ గా పిలుస్తారు.

------------------------------------------------------------------

Buddha Purnima on May 7th. Full Moon only gives sight on full moon day. But NASA has confirmed that a miracle is going to take place in the sky this year. When the moon rises in the sky on May 7th… Deep orange is visible in color. Scientists say that the scenery is great. The moon that comes on the day of Buddha Purnima is called Full Moon Blood Moon. But this time it is called the flower moon to the moon which is giving a view of the sky. This is the fourth last super moon seen this year. We have already seen three supermoons this year. The Super Pink Moon came in April. Now Super Moon is coming once again. When the Moon is closest to Earth, it is called the Super Moon. It's called every month, every month. The moon on May 7 is 14 percent larger than it is on a regular basis. Also… it looks 30 percent more light than day.

NASA scientists say the full moon will be in sight for three days as the moon gets closer to Earth. This is why it is called the Super Flower Moon… At this time… Most flowers bloom in May. That's why it's called so. Tribes in America… some of the rituals are performed in May. Hence, Chandamama is also known as Super Flower Moon which is coming in May.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !