కరీంనగర్ దవాఖాన మతవివక్ష!
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓల్గా పిల్లల దవాఖాన మానవత్వాన్ని మరిచి ఓ ముస్లిం చిన్నారికి వైద్యం చేయనని చెప్పి ప్రదర్శించింది. వివరాల్లోకి వెళితే ఇంతకు ముందే ఆ హాస్పిటల్లో తన బిడ్డకు వైద్యం చేయించిన ఓ ముస్లిం మహిళా లాక్ డౌన్ వల్ల డాక్టర్ ఎప్పుడు కలుస్తారోనని తెలుసుకునేందుకు ఓల్గా హాస్పిటల్ అధికారిక నెంబర్ పై ఫోన్ చేసింది. ఫోనెత్తిన దవాఖాన సిబ్బంది ఒకరు పేషెంట్ పేరు చెప్పగానే, తాము ముస్లింలకు వైద్యం చేయమని తెగేసి చెప్పారు. సదరు మహిళా ఎంతగా బతిమిలాడినా వినకుండా కాల్ కట్ చేశారు. అయితే యాదృచ్చికంగా ఈ ఫోన్ కాల్ రికార్డ్ కావడం, స్థానిక మజ్లిస్ బచావో తెహ్రీఖ్ ప్రతినిధి అంజదుల్లాహ్ ఖాన్ ఈ ఫోన్ కాల్ ఆడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ విషయం తెలిసి ఆగ్రహించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఓల్గా హాస్పిటల్ పై చర్యలకు ఆదేశించినట్లు తెలిసింది. కరోనాతో పోరాటంలో ఓవైపు చాలామంది డాక్టర్లు తమ ప్రాణాలకు తెగించి సేవలందిస్తుంటే, ఓల్గా లాంటి దవాఖానాలు వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరించడం శోచనీయమని నెటిజెన్లతోపాటు కరీంనగర్ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
ఇదీ ఆ ఆడియో :-
-----------------------------------------------------------------------------
An audio clip of a Karimnagar hospital staff refusing to treat a Muslim patient has gone viral on social media. In a recording of a phone conversation between a patient’s mother and a hospital staff of Olga Children’s Hospital, the latter can be heard denying treatment to the child because the hospital cannot treat patients from the Muslim community.
Taking cognizance of the issue, the Telangana State Human Rights Commission (SHRC) has sought a report from the Health Medical and Family Welfare Department of the government of Telangana, along with other respondents from the Karimnagar hospital on May 4, 2020.
A spokesman for Majlis Bachao Tehreek (MBT), Amjed Ullah Khan, tweeted the audio clip. “@KTRTRS Sir, Shocked to hear an audio from Karimnagar that muslims will not be treated in Olga Children’s Hospital, Couldn’t believe this happening in TS which has a record of #GangaJamuniTehzeeb, Pl ask @TelanganaDGP & @cpkarimnagar to do in-depth investigate TelanganaCOPs,” he wrote.
Comments
Post a Comment