ఆమెకు కరోనా సోకినా రుబాబు పోలేదు..
మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిణి పల్లవి జైన్ గొవిల్ వ్యవహారం మరీ విడ్డూరంగా ఉంది. ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ ఆమె. కొడుకు ట్రావెల్ హిస్టరీని దాచిపెట్టింది. విదేశాలనుంచి వచ్చిన కొడుకు కారణంగా ఆమెకు కరోనా సోకింది. అది బైటపడేలోపే.. ఆమె ఇతర అధికారులతో కలిపి అనేక సమీక్షలకు హాజరైంది. ఆమె కారణంగా మొత్తం 36 మందికి మధ్యప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖలో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పల్లవి జైన్ హోమ్ ఐసోలేషన్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ సమయంలో కూడా ఆమె రుబాబును వదలడంలేదు. ఆమె ఆస్పత్రికి రాకుండా ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వైద్యం అందించాలని హుకుం జారీ చేసింది. ఉన్నతాధికారి కావడంతో.. డాక్టర్ల బృందం ఉదయం, సాయంత్రం ఆమెకు వైద్యం అందించడానికి వెళ్తోంది. ఈ వ్యవహారంపై మానవహక్కుల సంఘం సీరియస్ గా స్పందించింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆస్పత్రికి ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఓ ఐఏఎస్ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
------------------------------------------------------------------------------------------
In Madhya Pradesh, IAS officer Pallavi Jain Govil's issue has been very serious. She is the Chief Secretary of the State Medical Health Department. The son hid travel history. Corona got infected by her son from abroad. Before attending to it, she attended several reviews along with other officials. Due to her, 36 people in the Madhya Pradesh Medical Department have been found to be coronary positive. This is in keeping with the Jain Home Isolation. Meanwhile, she is not leaving Rhubab even this time. And she ordered the doctors that they would come and provide medicine at home without her coming to the hospital. Being a boss .. A team of doctors is going to give her healing in the morning and evening. The Human Rights Council has responded seriously to the matter. The government has questioned why a person who came to Corona Positive could not be taken to hospital. There has been widespread criticism of OAS for its negligence.
Comments
Post a Comment