ఆయన మాస్క్ పెట్టుకోడట !
కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. తాను మాత్రం మాస్క్‌లు ధరించనని తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ మాస్క్‌లు ధరించినా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారి కట్టడికి సామాజిక దూరం పాటించడం అనేది అత్యవసరమని తెలిపారు. మాస్క్‌లు ధరించడం, ధరించకపోవడం అనేది వ్యక్తిగతమైన విషయమని, తాను మాత్రం ముఖానికి మాస్క్ ధరించకూడదని నిర్ణయించుకున్నానని ట్రంప్ తెలిపారు. అయితే ఎందుకు మాస్క్ ధరించడం లేదని ట్రంప్‌ని ప్రశ్నించగా తాను అనేక దేశాల అధ్యక్షులను, ప్రధానులను, ఉన్నతాధికారులను, రాజులను, రాణులను కలుస్తూ ఉంటానని ఆ సమయంలో మాస్క్‌లతో వారిని కలవడం ఇష్టం లేదని వివరించారు.
------------------------------------------------------------------------------
US President Donald Trump has urged everyone to voluntarily wear masks to
prevent corona outbreaks. He said he was not wearing masks. At a press
conference on Friday, Trump said that everyone should wear social masks.
Corona said the social distance to the pestilence was imperative. Trump
said that wearing and not wearing masks is a personal matter and that he has
decided not to wear a mask to his face. Asked Trump why he didn't wear the
mask, he explained that he was meeting with the presidents, dignitaries,
bosses, kings and queens of many countries and did not want to meet them at the
time.
Comments
Post a Comment