మత్తు కోసం మరణించారు


లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యానికి బానిసైనవారు మతి చెడినట్టుగా ప్రవర్తిస్తున్నారు. మత్తు కోసం ఏవేవో పుకార్లు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కూల్‌ డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని తాగడంతో నాలుగు రోజుల క్రితం కేరళలో ఓ వ్యక్తి మరణించిన ఘటన మరువకముందే.. తమిళనాడులోనూ అలాంటి విషాదమే వెలుగు చూసింది. పుదుకొట్టై జిల్లాలోని ఇద్దరు మత్స్యకార యువకులు కూల్‌ డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని తాగడంతో ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రిలో విషమ స్థితిలో ఉన్నారు.

కొట్టైపట్టినమ్‌కు చెందిన ముగ్గురు మత్స్యకార యువకులు ఎం.హసన్‌ మైదీన్‌ (35), పి.అన్వర్‌ రాజా (33), ఎం.అరుణ్‌ కంతియాన్‌ (29) నిత్యం మద్యం సేవించేవారు. అయితే, లాక్‌డౌన్‌తో మద్యం దుకాణాలు బంద్‌ కావడంతో.. ఎవరో చెప్పిన మాటలు విని.. శుక్రవారం రాత్రి కూల్‌డ్రింక్‌లో షేవింగ్‌ లోషన్‌ కలుపుకొని సేవించారు. అనంతరం ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే, మైదీన్‌, అరుణ్‌ వాంతులు చేసుకోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొంతుతూ వారు ప్రాణాలు విడిచారు. అస్వస్థతకు గురైన అన్వర్‌ను కూడా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ‘ఐసో ప్రొపిల్‌ ఆల్కహాల్‌’ ద్రావణం తాగి పశ్చిమ గోదావరిలో కూడా ఒక యువకుడు మరణించిన సంగతి తెలిసిందే.
---------------------------------------------------------------------------------
In the wake of the lockdown, alcohol addicts are behaving as if they are insane. Any rumors for intoxication are coming to life. Before the death of a person in Kerala four days ago when drinking a shaving lotion in a cool drink was forgotten. Two fishermen from Pudukottai district died after drinking shaved lotion in a cool drink. Another was in critical condition at the hospital.
Three fishermen from Kottayapattinam, M. Hassan Maiden (35), P. Anwar Raja (33) and M. Arun Kantian (29), are regular drinkers. However, with the lockdown, the liquor stores were on the bandwagon. After whom they have gone their way. However, Maiden and Arun were hospitalized after vomiting. They survived while receiving treatment. Anwar was also taken to the hospital for treatment. It is reported that his condition is serious. Meanwhile, a young man was reportedly killed in West Godavari after drinking a drink of Iso propyl alcohol.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !