బ్రిటన్ ప్రధాని పరిస్థితి విషమం!


కరోనా వైరస్‌ బారిన పడిన బ్రిటన్‌ ప్రధాన మంత్రి బోరిస్‌ జాన్సన్‌(55) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూకు తరలించారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 26 నుంచి ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆదివారం లండన్ ఆసుపత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కొన్ని కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరానని బోరిస్‌ ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే సోమవారం మాత్ర వ్యాధి తీవ్రత పెరగడంతో ఆయన్ను ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. ప్రధాని ఆసుపత్రిలో చేరడంతో యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ ప్రభుత్వ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక బ్రిటన్‌లో కరోనా కేసులు సంఖ్య 51,608 కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి 5,373 మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 13,46,990 మందికి కరోనా సోకగా, 74,702 మంది మృతి చెందారు.
---------------------------------------------------------------------------------
Britain's Prime Minister Boris Johnson, 55, is said to be in critical health after being infected with the corona virus. Doctors rushed Aion to the ICU as the disease progressed. He has been in self-incarceration since March 26 after being diagnosed with corona symptoms. However, he was admitted to a London hospital on Sunday following a doctor's suggestion that his condition was not changed. Boris also released a video showing that his condition is stable and that he has been hospitalized due to some coronary symptoms. On Monday, however, as the pill disease intensified, Aion was moved to the ICU and treated. Dominic Robb, UK Secretary of State, has been in charge of the government since the prime minister's hospitalization. The number of corona cases in Britain rose to 51,608. The epidemic killed 5,373 people. Worldwide, 13,46,990 people died of coronary heart disease and 74,702 died.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !