లక్ష లీటర్లు.. నేలపాలు..


అవును.. అక్షరాలా లక్ష లీటర్ల నీళ్లు  నేల పాలయ్యాయి.. ఈ సంఘటన సాక్షాత్ మన భాగ్యనగరంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
పూనకం వచ్చిన ఒక మహిళ చెప్పిందని హైదరాబాద్ రాంనగర్ ప్రాంతంలోని ఓ నీళ్ల ట్యాంకులో కొందరు స్థానిక  బీజేపీ నాయకులు పసుపు కలిపారు. ఇలా చేస్తే  రాదనీ ఆ మహిళ చెప్పిందట! కానీ ఇది నచ్చని కాలనీవాసులు విషయాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని ఆరా తీయగా ఎంతగా వారించినా వినకుండా స్థానిక బీజేపీ నాయకులు వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న వాచ్ మన్ ను తోసేసి బలవంతంగా ట్యాంక్ పైకి ఎక్కి పసుపు నీళ్లు కలిపారని ఎమ్మెల్యేకు వివరించారు.
ఎమ్మెల్యే సంబంధిత జల మండలి అధికారులకు విషయం తెలుపగా, వారు అక్కడికి చేరుకొని నీళ్లు తాగడానికి పనికి రావని నిర్ధారించి ట్యాంకులో ఉన్న లక్ష లీటర్ల నీటిని రోడ్డుపైకి వదిలారు. ఇదంతా కేవలం బీజేపీ నాయకుల మూర్ఖత్వం వల్లే జరిగిందని కాలనీవాసులు ఆగ్రహం  చేశారు.
---------------------------------------------------------------------------------
Yes, literally millions of liters of water fell to the ground. This incident took place in our fortune city. The details are as follows.
Some local BJP leaders have added turmeric in a water tank in Hyderabad's Ramnagar area, a woman from Poonam said. If you do this, the woman said! But the colonists, who did not like it, brought the matter to the attention of the MLA gang Gopal. The MLA reached there and asked the local BJP leaders not to listen to the sweep of the water, forcing the watchman near the water tank and forcing the yellow water into the tank.
According to MLA-related water board officials, they reached the spot and dumped lakhs of liters of water in the tank. The colonists were outraged that all this had just happened to the stupidity of the BJP leaders.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !