కరోనాకు దీటుగా మరో రోగం.. 'ఫాసిజం' !
కరోనా వైరస్ గత్తర వ్యాప్తికి సమాంతరంగా, ఆధిపత్యం, నియో-ఫాసిజం అనే మరో గత్తర నెమ్మదిగానే కానీ ఖచ్చితంగా ప్రపంచాన్ని చుట్టుకుంటోంది . కరోనా నివారణను ఒక సాకుగా ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర మితవాద రాజకీయ నాయకులు ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన చట్టాలు, సంప్రదాయాలు, వ్యవస్థలను లాక్డౌన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని 175 దేశాలు సంపూర్ణంగానో లేదా పాక్షికంగానో లాక్డౌన్లో ఉండగా, అధికార దాహంతో ఉన్న తీవ్ర మితవాదపాలకులు, తాము బతికి ఉన్నంత కాలం అధికారంలో వుండాలనే ఆశతో కొత్త క్రూరమైన చట్టాలను తీసుకువస్తున్నారు. బిజెపి ఆధ్వర్యంలోని భారతదేశం కూడా ఇలాంటి మార్గాన్ని అనుసరించడానికి సంసిద్ధంగా ఉంది.
ఇంగ్లాండ్‌లో ఆమోదించబడిన, కరోనా వైరస్ చట్టం-2020 కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఏ పౌరుడినైనా అరెస్టు చేసే సంపూర్ణ అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది. అమెరికాలో, ట్రంప్ పరిపాలనలోని న్యాయ విభాగం నిరవధిక కాలావధి వరకు ప్రజలను అరెస్టు చేయడానికి ప్రధాన న్యాయమూర్తులకు అధికారాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ను కోరింది. అరెస్టు చేసిన వారు తమను నిర్దోషులుగా నిరూపించుకోవడానికి ఎటువంటి విచారణను ఎదుర్కొనే అవకాశం ఇవ్వబడదు. అటార్నీ జనరల్ కోరినట్లయితే ప్రధాన న్యాయమూర్తులు ఏ కోర్టు విచారణను అయినా వాయిదా వేయాల్సి ఉంటుందని కూడా అమెరికా న్యాయశాఖ విజ్ఞప్తి చేసింది.
ఇజ్రాయెల్‌లో, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్లమెంటును రద్దుచేసి తన ప్రభుత్వ పాలనను శాశ్వతం చేసుకోవడం కోసం,1939 లో బ్రిటిష్ వారు ఆమోదించిన కాలం చెల్లిన పాత అత్యవసర చట్టాన్ని తీసుకువచ్చాడు. కోర్టులను పాక్షికంగా మూసివేశాడు. ఇజ్రాయెల్ దేశంలోని ప్రతి పౌరుడిపై నిఘా వుంచమని దేశీయ భద్రతా సంస్థ షిన్ బెట్‌ను ఆదేశించాడు. నరేంద్ర మోడీలాగానే, నెతన్యాహు మొత్తం దేశానికి తాను మాత్రమే ప్రభుత్వ ప్రతినిధిగా టీవీలో కనిపిస్తున్నాడు.
హంగరీలో, ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ శాశ్వత నియంతగా మారాడు. దేశంలో అత్యవసర పరిస్థితిని నిరవధికంగా కొనసాగించడానికి వీలు కల్పించే బిల్లును పార్లమెంటుతో ఆమోదింపచేశాడు. వాస్తవానికి హంగేరియన్ రాజ్యాంగం వరసగా 15 రోజుల పాటు మాత్రమే అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి ప్రభుత్వానికి అనుమతిస్తుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితిని పొడిగించాల్సి వస్తే పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రధాన మంత్రి పార్లమెంటును సంప్రదించవలసిన అవసరం లేకుండా డిక్రీల ద్వారానే పరిపాలన చేయగలడు.
రష్యాలో, వ్లాదిమిర్ పుతిన్ తాను జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగడంకోసం అధ్యక్షపదవీ కాలపరిమితిని తొలగించాడు. ప్రతి రష్యన్ పౌరుడిని నిఘాపరిధిలోకి తీసుకురావడానికి వీలుగా ప్రభుత్వం కరోనా వైరస్ ను ఒక సాకుగా ముఖ గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానాన్ని వుపయోగిస్తోంది. బొలీవియాలో కేవలం 19 ధృవీకరించబడిన కరోనా వైరస్ కేసులు మాత్రమే ఉన్నప్పటికీ తాత్కాలిక అధ్యక్షుడు జీనిన్ అనెజ్ మే 3 న జరగనున్న జాతీయ ఎన్నికలను వాయిదా వేశాడు. పెరూలో, అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. ప్రజలు ఇళ్లలోనే వుండేట్లు చూడడానికీ, రహదారులను కాపలా కాయడానికీ సైన్యాన్ని మోహరించాడు.
భారతదేశంలో కరోనా గత్తర ప్రవేశించడానికి ముందే, కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం అపారమైన శక్తిని కేంద్రీకరించుకోడానికి కొత్త చట్టాలను తీసుకురావడం, అప్పటికే ఉన్న చట్టాలను సవరించడం ప్రారంభించింది. అధికారాన్ని మరింతగా గుత్తాధిపత్యం కిందకు తీసుకురావడానికి మోడీకి కరోనా మరో సాకునిచ్చింది.
లాక్డౌన్లో ఉన్న భారతదేశం ఇప్పటికే పోలీసు రాజ్యంగా మారింది. అదుపు లేని పోలీసు లాఠీలప్రయోగం ద్వారా ప్రజల కదలికల నియంత్రణ జరుగుతోంది.
బహిరంగ సభలకు అనుమతిలేకపోవడం వల్ల ప్రభుత్వంపై విమర్శలు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమయ్యాయి. సమావేశమయ్యే స్వేచ్ఛ, వాక్సాతంత్ర్యాలు ఇప్పటికే ధూళిలో కలిసిపోయాయి. లాక్డౌన్ కారణంగా భారతదేశం ఆసుపత్రులు రక్తం కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించడానికి కూడా ముందస్తు పోలీసు అనుమతి కోరడం తప్పనిసరి అవుతోంది.
మరిన్ని దారుణాలు జరగబోతున్నాయి. ఆర్థిక మాంద్యం ఇప్పటికే ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గిస్తుండటంతో, కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభుత్వ ఖజానాలను యింతకు ముందెన్నడూ లేనంతగా ఖాళీ చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ద్వారా దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టడానికీ, ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించడానికీ మోడీకి ఒక సాకును ఇస్తుంది. దేశమంతటా కానీ దేశం లోని ఏ భాగంలో నైనా ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఉందని భావిస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి ఆర్టికల్ 360 రాష్ట్రపతికి అనుమతిస్తుంది.
భారతదేశంలో నిజంగా ఆర్థిక అస్థిరత్వం ఏర్పడే ప్రమాదం ఉన్నదా? ప్రభుత్వ గణాంకాల ప్రకారం, లాక్డౌన్ విధించక ముందే ఆదాయపు పన్ను వసూలు 3.5 శాతం తగ్గింది. అంచనాల ప్రకారం, 2021 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో ఆర్థిక లోటు 62 శాతం ఉంటుంది. ఏప్రిల్ 2019 - ఫిబ్రవరి 2020 మధ్య లోటు 10.36 లక్షల కోట్లు. సవరించిన లక్ష్యం ప్రకారం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య ప్రభుత్వ ఆదాయాలు 74.5 శాతం. (అయినప్పటికీ ప్రభుత్వం కార్పొరేట్‌కు భారీ పన్ను మినహాయింపులను అనుమతించింది.) దేశం లాక్‌డౌన్ వల్ల వ్యాపారం స్తంభించిపోవడంతో ప్రభుత్వ ఆదాయయం మరింత తగ్గిపోవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి ముందస్తు పరిస్థితులు ఇప్పటికే తయారయ్యాయి.
మోడీ ప్రభుత్వం అక్కడివరకే ఆగకపోవచ్చు. లాక్డౌన్ కారణంగా భారతదేశంలోని 40 కోట్ల శ్రామికశక్తిలో దాదాపు 93 శాతానికి జీతాలు లేకపోవడంతో, దేశం ఒక సామూహిక అశాంతిని ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదాయ నష్టం చేపట్టాల్సిన సామాజిక భద్రతా ప్రాజెక్టులను తగ్గిస్తుంది కాబట్టి పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుంది.
సంపూర్ణ ఫాసిస్ట్ హిందూ రాజ్యాన్ని సృష్టించడమనే బిజెపి రాజకీయ లక్ష్యం దృష్ట్యా, ఆర్టికల్ 352 లేదా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అవకాశాన్ని తోసిపుచ్చలేము. బయటి నుంచి బెదిరిపులు లేదా అంతర్గత కల్లోలాల ఆధారంగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 అనుమతిస్తుంది.
(పీపుల్స్ మ్యాగజైన్ (peoplesmagazine.in) అనే వెబ్ సైట్ లో ఇంగ్లీషులో వచ్చిన వ్యాసానికి తెలుగు / ఇంగ్లీష్ అనువాదం, పద్మ కొండిపర్తి)
--------------------------------------------------------------------------------------
Parallel to the spread of Corona virus pandemic, yet another pandemic
is slowly but surely gripping the world – the pandemic of authoritarianism and
neo-fascism. Using prevention of Corona as an excuse, extreme right
political leaders across the globe are putting under lockdown those very laws,
customs and institutions which are supposed to protect democratic rights of the
people. While 175 countries in the world are now under total or partial
lockdown, the power-hungry extreme right rulers are bringing new draconian laws
so that they may remain in power as long as they are alive. India under BJP is
poised to follow a similar path.
In England, Corona Virus Act 2020 has been passed, which gives the
government sweeping powers to arrest any citizen “to prevent spread of Corona
virus.” In America, the Justice Department of Trump administration has asked
the Congress to give chief judges powers to arrest people for an indefinite
period. Those arrested will not be given a chance to face any trial to prove
themselves innocent. The US department of Justice also wants that if the
attorney general so desires, the chief judges will have to postpone any court
proceeding.
In Israel, Prime Minister Benjamin Netanyahu has activated an outdated
emergency law, passed by the British in 1939, to shut down the parliament and
extend his government’s rule for eternity. He has partially shut down the
courts and has asked the Shin Bet – the domestic security agency – to track and
spy on every citizen of Israel. Much like Narendra Modi, Netanyahu has started
appearing on TV regularly and is now the only government spokesman in the
entire country.
In Hungary, Prime Minister Viktor Orban has become a dictator for
life. Orban has passed a Bill in the parliament which allows him to indefinitely
prolong an emergency in the country. He can now rule by decree and does not
need to consult the parliament. This, inspite of the fact that the Hungarian
constitution allows the government to declare emergency for a maximum period of
15 days at a stretch. Its extension was have to be approved by
parliament.
In Russia, Vladimir Putin has removed term limits and so can remain
president for life. Corona has given his government the excuse to use facial
recognition technology so that every Russian citizen can be brought under
surveillance. In Bolivia the interim president Jeanine Anez has postponed
national elections slated for May 3, though Bolivia has only 19 confirmed
Corona cases. In Peru, President Sebastian Pinera has announced a state of
emergency in the country and has deployed the army to block roads and force
people indoors.
Is Prime Minister Narendra Modi moving along a similar path? Even
before the Corona pandemic hit India, the BJP-led NDA government at the Centre
had begun initiating new laws and amending existing laws to concentrate immense
power in the hands of the government. Corona has given Modi another excuse to
further monopolize power.
With the country under current lockdown, India has already turned into
a police state. The movement of people has been stopped by unrestricted use of
police batons. Criticism of the government has been restricted only to the
social media as no public gatherings are allowed. Freedom of assembly and
speech has already been turned to dust. Though India is facing acute shortage
of blood because of the lockdown, in some parts of the country seeking of prior
police permission has been made mandatory even for organizing blood donation
camps.
But more sinister possibilities are lurking on the horizon. With the
economic slowdown already reducing government’s revenue earnings, the ongoing
lockdown may dry up the government treasuries to an unprecedented level. This
will give Modi an excuse to introduce Financial Emergency in the country by
promulgating article 360 of the constitution and reduce salaries and allowance
of employees. Article 360 allows the President of India to clamp financial
emergency if he feels the financial stability of India or any part of the
country is under threat.
Is financial stability of India really under threat? According to
government data, income tax collection had already declined by 3.5 per cent
even before the lockdown was imposed. According to projections, fiscal deficit
could be 62 per cent of GDP in FY 21. Between April 2019 and February 2020 the
deficit was a whopping 10.36 lakh crore. Revenue earning of the
government between April-February was 74.5 per cent of revised target. (Yet the
government allowed huge tax rebates to the corporate.) With the country
under lockdown and business coming to a screeching halt, there will be further
reduction of government’s revenue. Pre-conditions for pronouncement of
Financial Emergency are already emerging.
The Modi government might not stop at that. With almost 93 per cent of
the India’s 40 crore workforce not earning their salaries because of the
lockdown, there is every possibility that the country may face a wave of mass
unrest. The situation is bound to aggravate since government’s increasing loss
of revenue will shrink its social security projects. Given BJP’s political
objective of creating a fully fascist Hindu Rastra, the possibility of imposing
Article 352 or National Emergency cannot be ruled out. Article 352 of Indian
constitution allows imposition of National emergency on grounds on external
threats or internal disturbances.
Comments
Post a Comment