సాయం చేస్తున్న యువకులపై దాడి


ప్రజలకు సహాయం అందించే స్వచ్ఛంద కార్యకర్తలకు ఎవరైనా అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్నాటక‌ ముఖ్యమంత్రి బి.ఎస్. యడ్యూరప్ప ప్రకటించిన మర్నాడే బెంగళూరులోని మురికివాడల్లో ప్రజలకు ఆహార పదార్థాలు పంచిపెడుతున్న ముస్లిం యువకులపై దాడి జరిగింది. ఈ దాడిలో 5గురు యువకులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
ʹకీ బోర్డ్ జర్నల్ డాట్ కామ్ʹ అనే మళయాలం వెబ్ సైట్, ʹసియాసత్ డాట్ కామ్ʹ అనే ఇంగ్లీష్ వెబ్ సైట్ ల‌ కథనాల‌ ప్రకారం.. లాక్ డౌన్ తో రోజు కూలీ చేసుకునే లక్షలాది మంది తిండి లేక మలమల మాడుతున్న పరిస్థితుల్లో బెంగళూరులో అనేక స్వచ్చంద సంస్థలు పేదలకు ఆహారం అందిస్తున్నాయి. స్వరాజ్ అభియాన్ అనే స్వచ్చంద సంస్థ కూడా బెంగుళూరులోని మురికివాడల్లో ప్రజలకు ఆహారం అందిస్తోంది. స్వరాజ్ అభియాన్ బెంగళూరు జిల్లా కార్యదర్శి సయ్యద్ తబ్రేజ్, కార్యకర్తలు కిరణ్, జునైద్, రియాజ్, ఫిరోజ్, అమ్జాద్ లు బెంగుళూరు నగరంలోని మురికి వాడల్లో రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ 4 న వీళ్ళు ఆహారం పంచుతుండగా కొంతమంది వీరిని బెదిరించారు. ఆహారం పంచడాన్ని అడ్డుకున్నారు. అడ్డుకున్న‌ వాళ్ళంతా ఆరెస్సెస్ కు చెందినవాళ్ళుగా స్వరాజ్ అభియాన్ కార్యకర్తలు గుర్తించారు. వారిపై అమృతల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీకేమీ కాకుండా తాము చూసుకుంటామని చెప్పి పోలీసులు హామీ ఇవ్వడంతో తిరిగొచ్చేశారు. ఏప్రిల్ 6 ఉదయం అదే మురికివాడలో మళ్ళీ ఆహారం పంపిణీ చేస్తున్నట్లు అభియాన్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ మురికివాడకు చేరుకున్న ఆరుగురు కార్యకర్తలు ప్రజలకు ఆహారం పంచడం మొదలుపెట్టగానే దాదాపు 20 మంది క్రికెట్ బ్యాట్లు, రాళ్ళతో వీరిపై దాడి చేశారు. మీరు వైరస్ వ్యాప్తి చేయడానికే ఆహారాన్ని పంచుతున్నారని, మీరు ప్రజలకు విషం కలిపిన ఆహారం ఇస్తున్నారని ఆరోపిస్తూ దారుణంగా కొట్టారు. ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని షాంపూర్‌లోని డాక్టర్ అంబేద్కర్ మెడికల్ కాలేజీలో చేర్చారు. దాడి చేసినవాళ్ళంతా ఆరెస్సెస్ కార్యకర్తలేనని బాధితులు గుర్తించారు.
ఈ సంఘటనపై స్వరాజ్ అభియాన్ కార్యకర్త, జరీన్ సియాసత్ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ తాను గత రెండు సంవత్సరాలుగా స్వరాజ్ అభియాన్తో కలిసి పనిచేస్తున్నానని, విద్య మరియు అనారోగ్యానికి ఆర్థిక సహాయం అవసరమైన వారికి సహాయం చేస్తున్నానని చెప్పారు. దాడికి గురైన‌ వారిలో ముగ్గురు సయ్యద్ తబ్రేజ్, కిరణ్, జునైద్ తలపై, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని వాళ్ళు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
---------------------------------------------------------------------------------
Karnataka Chief Minister BS Krishna said that if anyone tries to interfere with the volunteers who help the people, they will take strict action. Announcing Yeddyurappa's death marnade in Bengaluru's slums, Muslim youths are being attacked for distributing food to people. Five youths are being treated at the hospital for serious injuries. According Malayalam website “Keyboard Journal.Com and “Siasat.Com” the realities are as follows..
Many volunteers in Bengaluru are feeding the poor in the face of millions of food or malnutrition waged on a day-to-day basis. Swaraj Abhiyan, a volunteer, is also feeding people in the slums of Bangalore. Swaraj Abhiyan Bangalore District Secretary Syed Tabrez and activists Kiran, Junaid, Riaz, Firoz and Amzad are distributing rations in the dirty bins of Bangalore city. On April 4, they threatened some people while they were sharing food. Blocked food sharing. Swaraj Abhiyan activists identified all those who were blocked as belonging to the RSS. They lodged a complaint at the Amrithalli police station. The police promised to look after them rather than you, and they returned. Abhiyan activists informed the police that they were distributing food again in the same slum on the morning of April 6.
As the six activists approached the slum, they began to feed the public, attacking them with about 20 cricket bats and stones. You have been sharing food to spread the virus, and you have been brutally accused of giving people poisoned food. Five young men were seriously injured. They were admitted to Dr Ambedkar Medical College, Shampur. The victims identified that all of the attackers were activists.
Swaraj Abhiyan activist and Zarine Siyasat, a spokesman for the magazine, said that he has been working with Swaraj Abhiyan for the past two years and is helping those who need financial assistance for education and illness. Three of the victims, Syed Tabrez, Kiran and Junaid, suffered serious injuries to the head, arms and legs and are currently receiving treatment at the hospital.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !