దీపాలు పెట్టినా దాడి చేశారు..



హర్యానా రాష్ట్రంలోని జింద్‌ జిల్లా, తాత్రాత్ గ్రామంలో మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి దీపాలు వెలింగించలేదని కొందరు మతోన్మాదులు తమ గ్రామానికే చెందిన నలుగురు ముస్లింలపై పదునైన ఆయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగుజూసింది. ఈ దాడిలో 36 ఏళ్ల బషీర్ ఖాన్, 34 ఏళ్ల సాదిక్ ఖాన్, 32 ఏళ్ల నజీర్ ఖాన్, 30 ఏళ్ల సందీప్ ఖాన్ అనే నలుగురు సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం జింద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చీఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అశ్విన్ షెన్వి తెలిపారు. 

గాయపడిన నలుగురు సోదరులలో ఒకరైన బషీర్ ఖాన్ కథనం ప్రకారం ఏప్రిల్ 5 న రాత్రి 9 గంటలకు తాను దీపాలు వెలిగిస్తున్నారనీ.. ఆ సమయంలోనే కొందరు కావాలని తమ ఇంటి ముందటి బల్బును పగులగొట్టడమే కాకుండా, దాదాపు డజను మంది లోనికి చొచ్చుకువచ్చి తన తమ్ముడు సాదిక్ ఖాన్‌పై పదునైన ఆయుధాలతో దాడి చేశారని తెలిపారు. ఇది తమ గ్రామంలో మొదటి సంఘటన కాదనీ, ఇంతకు ముందు కూడా తమ పొరుగున ఉన్న సంజయ్ కుమార్ అనేకసార్లు తమతో కావాలని హిందూ ముస్లిం వివాదం రేకేతించి మరీ గొడవ పడతాడని బషీర్ పేర్కొన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే తాను ఘటనా వైపు పరుగెత్తానని, అయితే అక్కడికి చేరుకునే సమయానికి అన్నదమ్ములు గాయపడ్డారని గ్రామ పెద్ద రామ్‌కేశ్ కుమార్ చెప్పారు. కేసు విచారణ జరుపుతున్న పోలీసు అధికారి రాకేశ్ కుమార్ మాట్లాడుతూ బాధిత ముస్లిం కుటుంబం దీపాలను వెలిగించి నా దాడి జరిగినట్లు తనకు తెలిసిందని, కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందనీ, ఆ తర్వాత నిజాలు తెలుస్తాయని తెలిపారు.
------------------------------------------------------------------
The incident has come to light lately when some fanatics attacked the four Muslims of their village with sharp weapons after Modi's call was not lit on Sunday night in the village of Tatrat in Jind district of Haryana. Four brothers, 36-year-old Basheer Khan, 34-year-old Sadiq Khan, 32-year-old Nazir Khan and 30-year-old Sandeep Khan were seriously injured in the attack. They are currently receiving treatment at a hospital in Jind. Chief Inspector General Ashwin Shenvi said four persons were registered in the case and arrested. 

According to the story of one of the four wounded brothers, Basheer Khan, at about 9 pm on April 5, he said that he had been illuminating the lights. Bashir said that this was not the first incident in their village and that Sanjay Kumar, a neighbor of his, had repeatedly wanted to be with them. According to village elder Ramkesh Kumar, he was rushed to the scene immediately after hearing the news, but was injured when he arrived. 

The case investigating police officer Rakesh Kumar said the victim's Muslim family was aware that my attack was carried out by lighting the lamps.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !