దీపాలు కాల్చమంటే.. తుపాకీ పేల్చింది..
ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ ప్రాంతానికి చెందిన బీజేపీ మహిళా నాయకురాలు అత్యుత్సాహంతో ఓ వివాదంలో చిక్కుకుంది. ఏప్రిల్ 5న ప్రధాని మోడీ దీపాలు వెలిగించమంటే ఈవిడ ఏకంగా రివాల్వర్ తో గాలిలోకి కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. దీంతో పోలీసులు ఈమెపై కేసు నమోదు చేశారు. ఆ నాయకురాలి పేరు మంజు తివారీ కాగా, ఈ దృశ్యాన్ని ఆమె అనుచరులే వీడియో తీసి వైరల్ చేయడం గమనార్హం! మరి ఈమె చిన్నాచితకా నాయకురాలు కూడా కాదు.. బీజేపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలట! ఇదిలా ఉంటే పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 286 (పేలుడు పదార్థానికి సంబంధించి నిర్లక్ష్య ప్రవర్తన) మరియు ఆయుధ చట్టం 1959 లోని సెక్షన్ 30 కింద తివారీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
------------------------------------------------------------
A BJP woman leader from
Uttar Pradesh's Balarampur area has been embroiled in a controversy. On April
5, Prime Minister Modi lit up the lights, firing into the air with a revolver,
terrifying the locals. The police registered a case against her. The heroine's
name is Manju Tiwari while her followers are making the video go viral! She is not even a Galli
leader.. She is District President of Women Wing of BJP. Meanwhile, the police
have registered an FIR on Tiwari under Section 286 of Indian Penal Code
(Reckless Conduct of Explosives) and Section 30 of the Weapons Act, 1959.
Comments
Post a Comment