పారిశుధ్య కార్మికుడిపై బ్రాహ్మణ వృద్దుడి కులాహంకార ప్రదర్శన
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న ప్రస్తుత కాలంలో మనల్ని కాపాడడానికి తమ జీవితాన్ని ఫణంగా పెట్టి రాత్రింబవళ్ళు కష్టపడుతున్న పారిశుధ్య కార్మికులను కులం పేరుతో నానాబూతులు తిడుతూ ఓ బ్రాహ్మణ వృద్దుడు దుర్మార్గంగా ప్రవర్తించిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకొని, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
చెన్నైలోని పల్లికరనై ప్రాంతంలో వున్న ఐఐటి కాలనీ నివాసి బ్రాహ్మణ కులానికి చెందిన చంద్రశేకర్ అనే వృద్దుడు ప్రైవేట్ పారిశుద్ధ్య వాహనం డ్రైవర్ మణికందన్ ని కులం పేరుతో నిందించాడు. ʹమీరు మా వల్ల సంపాదిస్తున్నారు. మేము ఇక్కడ వచ్చి వుండడం వల్లనే మీరు మా మలం ఎత్తగలుగుతున్నారు. ఆ పని చేసి సంపాదించడం వల్లనే మీరు తినగలుగుతున్నారు" అని కోపంగా అరిచాడు. "మేము పియ్యి తింటామని మీరు అంటున్నారా?" అని పారిశుధ్య కార్మికుడు అడిగితే, ఏ జంకూ లేకుండా ʹఅవును, మీరు మా పియ్యి తింటున్నారు అని" అని పొగరుగా జవాబిచ్చాడు.
మణికందన్ వీడియో తీయడాన్ని చూసి "తీసుకో నాకేం భయం లేదు. ఇంకా మాట్లాడితే నిన్నేం చేస్తానో చూడు" అని బెదిరించాడు. ఈ ఘటనపై పల్లికరనై పోలీసులు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 (బి) (బహిరంగంగా అశ్లీల పదాలు వాడటం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ సెక్షన్ క్రింద వృద్దుడికి మూడు నెలల వరకు జైలు శిక్ష / లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.
పోలీసుల కథనం ప్రకారం చంద్రశేఖర్ ఇంటి ముందు నుంచి వున్న దారి దగ్గరి దారి కావడంతో పని పూర్తయిన తర్వాత మణికందన్ ఆ దారిలో తిరిగి వెళ్దామనుకున్నాడు. కానీ చంద్రశేఖర్ తమ ఇంటిముందున్న దారిని ఉపయోగించడానికి వీల్లేదనీ వచ్చిన దారినే తిరిగి వెళ్లమనీ అడ్డుకోవడంతో వారిద్దరి మధ్య వాదన జరిగింది.. ఏప్రిల్ 17న సాయంత్రం పోలీసులు చంద్రశేఖర్‌ను ప్రశ్నించారు. అతను బ్రాహ్మణ కులస్తుడని ధృవీకరించారు. 77 సంవత్సరాల వృద్ధుడు కాబట్టి కోర్టులు మళ్ళీ తెరిచేదాకా అరెస్టు చేయబోమని పోలీసులు అంటున్నారు.
--------------------------------------------------------------------
In the current era of coronary pandemonium, a Brahmin old man behaving badly in the name of caste has been working in the name of caste of sanitary laborers who have been working night and day to save our lives. The details are as follows.
Chandrashekar, an old man of the Brahmin clan, an IIT colony resident in Pallikaranai area of Chennai, has accused Manikandan, the driver of a private sanitation vehicle, under the caste name. రుYou are earning because of us. You are able to lift our stool just because we are here. You can eat it because you have earned it. "When the sanitation worker asked," Do you think we should eat the stove? "
Manikandan watched the video and threatened to say, "I am not afraid to take it. Pallikaranai police registered an FIR under Section 294 (b) of the Indian Penal Code. Under this section there is the possibility of imprisonment and / or a fine of up to three months for aging.
According to a police report, Manikandan decided to go back to work after Chandrashekhar's house was near the front of the road. But Chandrashekhar had a dispute between the two of them when they blocked the way back to the house or the way they used to. He confirmed that he was a Brahmin caste. Police say the 77-year-old will not be arrested until the courts reopen.
Comments
Post a Comment