శవాల దిబ్బలా అగ్రరాజ్యం


కరోనా మహమ్మారి బారిన పడి అమెరికా చిగురుటాకులా వణుకుతోంది. న్యూయార్క్‌ నగరంలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. చికిత్స పొందుతున్న బాధితులతో.. కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులతో.. రోగుల మరణాలతో అక్కడి ఆసుపత్రుల్లోని పరిస్థితులు భీతావహంగా మారాయి. న్యూయార్క్‌ సిటీ, బుష్‌విక్‌లోని వైకాఫ్‌ హైట్స్‌ మెడికల్‌ సెంటర్‌లో గత నెల 14న మొదటి కరోనా వైరస్‌ మరణం నమోదు కాగా, ఇప్పటివరకు నగర వ్యాప్తంగా 2,400 మంది మృత్యువాత పడ్డారు. అక్కడి ఆసుపత్రుల్లో ఎక్కడ చూసినా ఆరెంజ్‌, తెలుపు రంగు సంచుల్లో ఉంచిన శవాలు దర్శనమిస్తున్నాయి. మరణించిన వారిని ఉంచటం కోసం ఉన్న మార్చురీలు చాలక తాత్కాలిక, మొబైల్‌ మార్చురీలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది కూడా దినదినగండంగా గడుపుతున్నారు. కాగా, అమెరికాలో ఇప్పటివరకు 3లక్షల 36 వేల కేసులు నమోదు కాగా.. దాదాపు 10వేల మంది మృత్యువాత పడ్డారు.
---------------------------------------------------------------------------------
The American cortex is shaking as the corona plague hits. Conditions are worse in New York City. With the victims being treated, the new cases being reported positive, the deaths of the patients in the hospitals have become alarming. The first coronavirus death on the 14th of last month was recorded at Wyckoff Heights Medical Center in Bushwick, New York City, with 2,400 deaths so far. Corpses found in orange and white bags were found anywhere in the hospital. Mortgages for keeping the dead are also being set up in temporary, mobile mortars. Doctors and other staff who spend time with Corona patients are also spending the day. 3 million, 36 thousand cases so far in the US.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

కల్లోలంలో గందరగోళం - చనిపోయిన వృద్దురాలు వాపసొచ్చింది !

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

కరోనాతో పోరు కోసం మరో ముస్లిం వైద్యుడి అద్భుత ఆవిష్కరణ

పెళ్లి కోసమై వలలో చిక్కెనే పాపం పిలగాడు..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!