మరోసారి విషంగక్కిన "ఏబీపీ న్యూస్ ఛానల్"
దేశంలో కరోనా వ్యాప్తికి కేవలం ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లీఘీ జమాత్ మర్కజ్ మాత్రమే కారణమనుకేలా విషం చిమ్మే వార్తలను ప్రసారం చేసి ప్రత్యక్షంగానే విద్వేషాలను రెచ్చగొట్టిన "ఏబీపీ న్యూస్ ఛానల్" నిన్న సోమవారం కూడా మరో అసత్యపు కరోనా వార్తను ప్రసారం చేసి మరోసారి ముస్లింలపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ఛానల్ నిన్న మహారాష్ట్రలోని కాన్పూర్ నగరంలోని ఓ మదర్సాలో చదువుతున్న 53 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలిందని ఓ అబద్దపు వార్తను వండివార్చింది. వాస్తవమేమిటంటే, దీని గురించి కనీసం సదరు మదర్సా నిర్వాహకులకు కూడా తెలియదు. "ఏబీపీ న్యూస్ ఛానల్" చుసిన తర్వాతే తమకు తెలిసిందని నిర్వాహకులు తెలుపడం గమనార్హం! అయినా ఎందుకైనా మంచిదని ఈ విషయం తెలుసుకున్న కాన్పూర్ నగర వైద్యాధికారి మదర్సాకు చేరుకొని విచారణ జరుపగా, "ఏబీపీ న్యూస్ ఛానల్" వార్త అసత్యమని తేలింది. సదరు అధికారే "ఏబీపీ న్యూస్ ఛానల్" ప్రసారం చేసిన మదర్సాలో కరోనా పాజిటివ్ వార్త అబద్దమని, ఇటువంటి వార్తల ప్రసారం ఆ ఛానెల్కు తగదని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. "ఏబీపీ న్యూస్ ఛానల్" పనిగట్టుకొని ముస్లింలపై అసత్య ఆరోపణలు చేస్తోందని దీనితో తేటతెల్లమైంది.
-------------------------------------------------------------------------------------------------------------
Tablighi Jamaat Markaz of Delhi's Nizamuddin area was the only cause of coronal outbreak in the country. The channel reported yesterday that the coronation of 53 students studying in a madarsa in Kanpur city of Maharashtra was positive. In fact, not even the madrassa organizers knew about it. Notice that the managers of the ABP News Channel said that they were aware of it! However, when Kanpur city physician, aware of the matter, approached Madarsa and inquired, "ABP News Channel" reported that the news was untrue. He also stated that Corona Positive News in Madarsa, which was broadcast by "ABP News Channel", is a liar and that such news coverage is inappropriate and will be investigated. "ABP News Channel" has been accused of making false allegations against Muslims.

Comments
Post a Comment