ఆఖరికి కూతుళ్లే అన్నీ అయ్యారు..


లాక్ డౌన్ వల్ల కరోనా ప్రభావం ఎంతగా తగ్గుతుందో తెలియదు గానీ.. దీని వల్ల పేదవారి జీవితాలు మాత్రం దినదిన గండంగా మారుతున్నాయనేది మాత్రం కాదనలేని నిజం. అసలే మానవత్వాన్ని మరిచిన మనిషి.. కరోనా భయంతో బంధాలూ బాంధవ్యాలకు దూరమవుతున్నాడు. ఈ వాక్యాలు నిజమని నిరూపించే సంఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో చోటు చేసుకుంది. అలీగఢ్ కు చెందిన సంజయ్ గత కొంత కాలంగా టీబీ రోగంతో బాధపడుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన సంజయ్ వైద్యం చేయించుకున్నది అంతంతమాత్రమే! ఇప్పుడు లాక్ డౌన్ వల్ల అతను ఆ కాస్త వైద్యం కూడా చేయించుకోలేక ఆదివారం తుదిశ్వాస విడిచాడు. సంజయ్ మృతి గురించి కుటుంబ సభ్యులు తమ బందువులకు సమాచారం అందించారు. కానీ వారు కరోనా భయంతో సంజయ్ ను చివరి చూపు చూడడానికి కూడా రాలేకపోయారు. దీంతో గత్యంతరం లేక అతని ఇద్దరు కూతుళ్లే అన్నీ తామై సంజయ్ అంత్యక్రియలను జరిపించారు. తండ్రి మృతదేహాన్ని కూడా పాడేపై ఉంచి ఆ ఇద్దరు అమ్మాయిలే తమ భుజాలపై మోస్తూ శ్మశానం వరకు తరలించారు. ఇద్దరు కూతుళ్లు ఏడుస్తూ తండ్రి శవాన్ని మోస్తుంటే ఇరుగుపొరుగు వారు చూస్తూ ఉండిపోయారే గానీ ఎవరూ కూడా వారికి సాయానికి రాకపోవడం గమనార్హం! కరోనా మహమ్మారి ఇంకా ఇలాంటి ఎన్ని మనస్సును ద్రవించే సంఘటనలు చూసి చల్లబడుతుందో ఆ దేవునికే తెలియాలి.
---------------------------------------------------------------------------------
While it is not known how much the corona effect will be diminished by the lockdown. The man who has forgotten the humanity of the original .. Corona fears that the bonds and relationships are alienated. An incident that proved these sentences to be true took place in Aligarh, Uttar Pradesh. Sanjay of Aligarh has been suffering from TB for some time now. Sanjay, a poor family, is endangered! Now, due to the lockdown, he was not able to do that kind of healing and gave up Sunday. Family members have informed their relatives about Sanjay's death. But they could not even come to see Sanjay at last, for fear of corona. This was the last time either Sanjay's funeral or his two daughters had been performed. The two girls were carried on their shoulders and carried to the graveyard, while the father's body was also placed on the singing. It is noteworthy that two neighbors were crying and carrying their father's body while the neighbors looked on and no one came to their aid! God knows how many mind-boggling events the corona epidemic has cooled down.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

కల్లోలంలో గందరగోళం - చనిపోయిన వృద్దురాలు వాపసొచ్చింది !

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

కరోనాతో పోరు కోసం మరో ముస్లిం వైద్యుడి అద్భుత ఆవిష్కరణ

పెళ్లి కోసమై వలలో చిక్కెనే పాపం పిలగాడు..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!