అబ్దుల్ భాయ్.. కరోనా మృతుల ఏకైక ఆప్తుడు !


కరోనాతో మృతుల అంత్యక్రియలు చేయడం ఇప్పుడొక ప్రహసనంగా మారింది. దీనికి ఈమధ్యే కరొనతో చనిపోయిన నెల్లూరు డాక్టర్ పరిస్థితే ఉదాహరణ! ఈ డాక్టర్ అంత్యక్రియలు జరిపించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులు కూడా క్వారంటైన్ లో ఉండటం వల్ల అతికష్టం మీద మునిసిపల్ కార్మికులు ఓ విద్యుత్ దహన వాటిక వారికి డాక్టర్ శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నారు. కానీ, గుజరాత్ లోని సూరత్ నగరవాసులు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు. ఎందుకంటే, ఈ నగరంలో కులమతాలకతీతంగా "ఓ ముస్లిం" కరోనా మహమ్మారితో చనిపోయే వారి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు. అంతర్జాతీయ మీడియా సంస్థ "బీబీసీ"యే ఇతని సేవలను ప్రశంసిస్తూ తమ ఛానెల్లో ఓ ప్రత్యేక కథనం ప్రసారం చేసిందంటే, ఈ ముస్లిం ఎంతటి సేవాతత్పరుడో అర్థమవుతుంది. ఇంత చెప్పినా అతని పేరు చెప్పలేదు కదూ.. ఈ కరోనా మృతుల ఏకైక ఆప్తుడి పేరు.. " అబ్దుల్ మలబరీ ". 

అబ్దుల్ భాయ్ సుమారు 30 ఏళ్లుగా అనాథ మృతదేహాలకు తన కొంతమంది స్నేహితులతో కలిసి కులమతాలకతీతంగా అంత్యక్రియలు జరిపిస్తున్నారు. కేవలం అనాథ శవాలనే కాకుండా తమవారు కండ్ల ముందే చనిపోయినా అంత్యక్రియలు జరిపించలేని దీనావస్థలో ఉన్న పెదాలు, యాచకులు తదితర అంతిమ వీడ్కోలుకు నోచుకోని వారి మృతదేహాలకు "అబ్దుల్ భాయ్" ఒక్కడే ఆప్తుడిలా అన్నీ తానై చనిపోయిన వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు చేసి వారి ఆత్మలకు శాంతి కలిగిస్తున్నాడు.

మూడు దశాబ్దాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ఇప్పుడు కరోనా మృతులు కూడా తోడయ్యారు. మహమ్మారి కారణంగా ఈమధ్యే నలుగురు సూరత్ వాసులు చనిపోగా, వారి అంత్యక్రియలు ఎలా జరిపించాలా అనే సంధిగ్ధత నెలకొంది. అప్పుడే కరోనా మృతులకు వైద్యం చేసిన డాక్టర్లకు 'అబ్దుల్' చేస్తున్న సేవల గురించి తెలిసి, అతన్ని సంప్రదించారు. అబ్దుల్ వెంటనే కరోనా మృతులకు అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్నాడు. దీంతో కరోనాతో చనిపోయిన ఆ నలుగురి అంత్యక్రియల బాధ్యతను సూరత్ నగర పాలిక అబ్దుల్ కు అప్పగించి ఊపిరి పీల్చుకుంది.

ఇప్పుడు అబ్దుల్ భాయ్ సెల్ నెంబర్ సూరత్ లోని ప్రతి హాస్పిటల్లో ఉంది. దీనిపై అబ్దుల్ భాయ్ ను బీబీసీ ప్రశ్నించగా ఎవరూ అనాథలా చనిపోకూడదనే ఉద్దేశంతోనే తాను గత 30 సంవత్సరాలుగా ఈ అంత్యక్రియల బాధ్యతను నిర్వర్తిస్తున్నానని, ఇప్పుడు కరోనా మృతుల అంత్యక్రియలు చేస్తున్నందున ఈ మహమ్మారి పూర్తిగా శాంతించే వరకూ ఇంటికి కూడా పోకూడదని నిర్ణయుంచుకొని, తన కార్యాలయంలోనే ఉంటున్నానని అబ్దుల్ తెలిపారు. అబ్దుల్ తాను చేస్తున్నది ఏమంత గొప్ప పని కాదని, సాధారణంగా చెబుతున్నా.. ఇప్పుడు ప్రాణాలను ఫణంగా పెట్టి అతను చేస్తున్న సేవలకు కరోనా మృతుల కుటుంబీకులు ఎల్లకాలం రుణపడి ఉంటారనేది కాదనలేని సత్యం.. ఏదేమైనా 'అబ్దుల్ భాయ్' సేవలకు హృదయపూర్వక సలాం..
--------------------------------------------------------------------------

The death funeral with Corona has now become a farce. This is the example of the Nellore doctor who died of corona in the meantime! This doctor did not even come forward to perform the funeral. The family members were also in the Quarantine and the municipal workers handed over the corpse of the doctor to an electrocardiographer. But the people of Surat in Gujarat are very honored. This is because the city has come to the death of the "O Muslim" Corona pestilence in the city. The international media company "BBC" has published a special article on their channel praising the services of the Muslim community. This is the name of the only survivor of corona death. "Abdul Malabari". 

Abdul Bhai has been attending funerals for some 30 years with some friends of his orphans. Not just the orphans, but the dead lips and beggars who cannot die in front of their eyes, beggars, etc., the final farewell to their dead bodies. 

The program, which has been going on uninterrupted for over three decades, has now been joined by Corona deaths. In the meantime, four Surat residents have died due to the pandemic, and there is talk of how their funeral will be held. It was then that Corona came to know about the services of 'Abdul' to doctors who were treating the dead. Abdul immediately agreed to the funeral for Corona's dead. Surat city governor Abdul breathed his last on the funeral of the four men who died with corona. 

Now Abdul Bhai's cell number is in every hospital in Surat. Abdul Bhai was quizzed by the BBC, saying that he had been in charge of the funeral for the last 30 years, not wanting to die an orphan. Abdul Bhai 's services are not undoubtedly true. Corona's deceased family members are indebted for the services he is doing now.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !