"వంటావార్పు"పై సానియా ఫైర్


కరోనా వైరస్‌తో జనం చస్తుంటే... చాలా మంది ఆకలితో అలమటిస్తుంటే సెలబ్రిటీలు వంటావార్పుల వీడియోలతో లాక్‌డౌన్‌ను పాటిస్తున్నట్లు షేర్‌ చేయడాన్ని టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తీవ్రంగా తప్పుబట్టింది. ట్విట్టర్‌ వేదికగా ఆమె ‘మన వంట వీడియోలు, రుచుల ఫొటోల పోస్టింగ్‌ పూర్తయ్యిందా లేదా’ అని ఘాటుగా స్పందించింది. ‘ఒక్కసారి ఆలోచిం చండి... మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మన చుట్టూ ఉన్న జనంలో వేలసంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. లక్షలాది మంది ఒక పూట తిండి దొరకడమే అదృష్టంగా భావిస్తున్నారు. ఇలాంటి సంక్షోభంలో అలాంటి వీడియోలు షేర్‌ చేయడమేంటి’ అని సానియా అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం ప్రధాని మోదీ 49 మంది భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనాను జయించేందుకు వారి సూచనలు, సలహాలు కోరిన సంగతి తెలిసిందే.
---------------------------------------------------------------------------------
Tennis star Sania Mirza has mistakenly shared that celebrities are following a lockdown with videos of cookouts if the people are tired of coronavirus. On Twitter, she responded vaguely to the posting of our cooking videos and photos of flavored photos. Just think ... the pestilence is killing thousands of people around us worldwide. Millions of people are lucky enough to find a meal. Sania has expressed embarrassment that such videos are a sharing item in a crisis. Prime Minister Modi on Friday asked 49 Indians for their suggestions and suggestions to conquer Corona in a video conference.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !