అధ్యక్షుడు.. కాల్చేయమన్నడు..!


కరోనా వైరస్ ప్రభావంతో భారత్ సహా ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ చేపట్టాయి. కానీ చాలా దేశాల్లో ప్రజలు యథేచ్ఛగా రోడ్ల మీదకు వస్తున్నారు. మన దగ్గర అతి స్వేచ్ఛ కాబట్టి.. పోలీసులు బతిమాలడం, లేదంటే రెండు తగిలించడం చేస్తున్నారు. కానీ ఫిలిప్పిన్స్లో మాత్రం లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కాల్చి పారేయండని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మాత్రం సంకోచించొద్దు.. ఎవరైనా మీపై దాడి చేసే పరిస్థితి తలెత్తితే.. కాల్చి చంపండి అని ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే పోలీసులు, ఆర్మీని ఆదేశించారు.

రాజధాని మనీలా సహా ఫిలిప్పిన్స్లో కఠినంగా క్వారంటైన్ అమలు చేస్తున్నారు. కానీ వామపక్షాల మద్దతుతో కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారనేది రోడ్రిగో బలంగా నమ్ముతున్నాడు. దీంతో లెఫ్టిస్టులకు వార్నింగ్ ఇచ్చాడు. ‘మీరు ప్రభుత్వంలో లేరనే విషయాన్ని గుర్తించుకోండి. ఇబ్బందులు కలగజేయొద్దు, ఘర్షణలకు కారణం కావొద్దు. లేదంటే కోవిడ్ మహమ్మారి అదుపులోకి వచ్చేంత వరకు మిమ్మల్ని అదుపులో తీసుకోమని ఆదేశించాల్సి ఉంటుందిఅని రోడ్రిగో హెచ్చరించాడు.

ఫిలిప్పిన్స్లో 16 శాతం జనాభా పేదరికంలో మగ్గుతోంది. దీంతో లాక్డౌన్తో వారు ఇబ్బందులు పడకుండా చూడటం కోసం రోడ్రిగో 4 బిలియన్ డాలర్లు కేటాయించారు. 1.8 కోట్ల మందికి మొత్తాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు. కానీ అర్హుల జాబితా రూపొందిస్తున్న కారణంతో ఇప్పటికీ పేదలకు సాయం అందలేదు.

కాల్చి పారేయండి అంటూ రోడ్రిగో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. సోషల్ మీడియాలో #OustDuterte (డ్యుటెర్టేను తొలగించండి) అనే హ్యాష ట్యాగ్ట్రెండ్ అయ్యింది. ఆకలితో అలమటిస్తుంటే ప్రజలు ఎలా సైలెంట్గా ఉంటారని స్టూడెంట్ గ్రూప్ సీఈజీపీ ప్రశ్నించింది. ఫిలిప్పిన్స్లో ఇప్పటి వరకూ 2311 కరోనా కేసులు నమోదు కాగా... 96 మంది చనిపోయారు.
---------------------------------------------------------------------------------
Most countries around the world, including India, have taken the lock-down under the influence of the corona virus. But in many countries people are flocking on the roads. Since we have so much freedom, the police are either staying or two. In the Philippines, however, police have been ordered to be shot in violation of lock-down rules. Philippine President Rodrigo Duterte has ordered the police and the Army to fire anybody who is attacking you

Quarantine is strictly enforced in the Philippines, including the capital Manila. But Rodrigo strongly believes that with the support of the Left, some are getting out of the house and raising concerns. This gave Warning the lieutenants. Recognize that you're not in government. Do not cause trouble or cause conflicts. Otherwise, Rodrigo warns you to be in custody until the Kovid pandemic comes into custody

In the Philippines, 16 percent of the population is living in poverty. With the lock-down, Rodrigo allocated $ 4 billion to ensure they don't get in trouble. It has been decided to distribute this amount to 1.8 crore people. But the cause of the eligible list is still not helping the poor

In protest of Rodrigo's comments, "Get shot!" Student group CEO GP queried how people are silent if they are hungry. So far 2311 coronation cases have been registered in the Philippines ... 96 people have died.


Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !