రోగుల రక్తమే ఔషధంగా !



కరోనా మహమ్మారి నివారణకు ఇప్పటి వరకు దాని బారిన పడి కోలుకున్న వారి రక్తమే ఔషధంగా పని చేస్తుందని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాతో ఈ చికిత్స చేస్తారంట! ఇందుకు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఆమోదం కూడా తెలిపింది. వందేళ్ల కిందటి ఈ విధానం తప్ప ప్రస్తుతానికి వేరే గత్యంతరం లేదని పరిశోధకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే ప్లాస్మా సేకరణ మొదలవగా, తొందరలోనే మన దేశంలోనూ ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. యశోద హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎం.వి.రావు కూడా ఈ విధానాన్ని ధృవీకరించేలా చాలా దేశాల్లో ప్లాస్మా ద్వారా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పేషంట్లకు చికిత్స చేస్తున్నారని తెలిపారు. ఒకసారి వైరస్ సోకి కోలుకున్న వ్యక్తి శరీరంలో ఆ వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీస్ ఉండటం వల్ల ఇది సాధ్యపడుతుందని డాక్టర్ పేర్కొన్నారు. దీనికి ఒకే గ్రూప్ రక్తం ఉన్నవారు అవసరమవుతారని, కోలుకున్న వారికి ఎయిడ్స్ లాంటి రోగాలు ఉండకూడదని ఆయన వివరించారు. ఇదే జరిగితే కరోనా మహమ్మారికి విరుగుడు దొరికినట్లే!
---------------------------------------------------------------------------------
US and Chinese scientists say that the blood of the victims of the coronavirus epidemic has so far worked as a medicine. This treatment is done with the plasma in the blood of the recovering people! It is also approved by the US Food and Drugs Administration. Researchers also point out that there is nowhere else to go except for this approach over a hundred years. The plasma collection has already begun in the US and it is expected that the process will start in our country soon. Dr. MV Rao, Senior General Physician of Yashodha Hospital, said that in many countries treating patients with plasma in critical conditions is a validation of this procedure. The doctor claims that once the virus has recovered, the body has antibodies that fight the virus. He explained that this would require people with the same group of blood, and those who recover should not have AIDS-like illnesses. Corona epidemic is the antidote to this!

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !