బిస్కెట్ల కోసం బైటికొస్తే.. ముస్లిం యువకున్ని కొట్టి చంపేశారు..


కరోనా లాక్ డౌన్ పేదల ప్రాణాలను కేవలం ఆ రోగం వల్లనే కాకుండా.. ఆకలి వల్ల కూడా ఇప్పటివరకు బలిగొంటుండగా, ఖాకీల కర్కశత్వం కూడా ఇప్పుడు వాటికి తోడైంది. విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్ లోని అంబెడ్కర్ నగర్ జిల్లా టాండా తాలూకాలోని ఛజ్జాపూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల రిజ్వాన్ ఈనెల 15న సాయంత్రం ఇంట్లో తినడానికి ఏమీ లేకపోవడంతో బిస్కెట్లు కొనుక్కోవడానికి బైటికి వచ్చాడు. అప్పుడే అక్కడ గస్తీలో ఉన్న పోలీసులు రిజ్వాన్ చెప్పేది వినకుండా అతన్ని తీవ్రంగా చితకబాదారు. దీంతో రిజ్వాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న రిజ్వాన్ తండ్రి ఇజ్రాయిల్ చేరుకొని బాధితున్ని హాస్పిటల్ తరలించాడు. కానీ, అప్పటికే పోలీసుల దెబ్బలకు తాళలేక రిజ్వాన్ మృతిచెందాడు. పోలీసులు విచక్షణారహితంగా కొట్టడం వల్లే తన కొడుకు చనిపోయాడని మృతుడి తండ్రి ఇజ్రాయిల్ ఆరోపించారు. దీనిపై జిల్లా ఏఎస్పీ అవనీష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేగానీ ఏ విషయమూ చెప్పలేమనీ, అంతేకాకుండా సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా పరీశీలిస్తున్నామని, ఆ తర్వాత విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
---------------------------------------------------------------------------------

Corona Lockdown Down the lives of the poor not only because of the disease .. but also because of hunger, the khakis have now added to it. As a matter of fact, Rizwan of Chajjapur village in Tanda taluk of Ambedkar Nagar district of Uttar Pradesh came to buy biscuits on the evening of the 15th of this month. The police, who were on patrol there, severely tortured Rizwan by not listening to him. This left Rizwan unconscious. 

Realizing this, Rizwan's father reached Israel and rushed the victim to the hospital. But, Rizwan had already been killed by the police. The father of the deceased's father, Israel, alleges that his son was killed as police brutally beat him. District ASP Avinish Kumar Mishra said that the post-mortem report would not say anything, and that footage of the CC cameras is being investigated, followed by inquiries and action will be taken against those responsible.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !