అమెజాన్ అధిపతే.. అత్యధిక సంపన్నుడు


క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ అమెజాన్ ఫౌండ‌ర్‌, సీఈవో జెఫ్ బేజోస్ ప్ర‌పంచ సంప‌న్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ త‌న 34వ‌ వార్సిక బిలియ‌నీర్ల జాబితాను రిలీజ్ చేసింది. 113 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో జెఫ్ బేజోస్ తొలి స్థానంలో నిలిచారు. రెండ‌వ స్థానంలో 98 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌తో బిల్ గేట్స్ నిలిచారు. ఎల్‌వీఎంహెచ్ సంస్థ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ .. ఫోర్బ్స్ జాబితాలో మూడ‌వ స్థానానికి ఎగ‌బాకారు. ఆయ‌న సంప‌ద 76 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉన్న‌ది. ఇక వారెన్ బ‌ఫెట్ నాలుగ‌వ స్థానానికి ప‌డిపోయారు. బ‌ఫెట్ ఆస్తులు 67.5 బిలియ‌న్ డాల‌ర్లు ఉన్న‌ట్లు ఫోర్బ్స్ పేర్కొన్న‌ది. అయితే తాజా లిస్టులో జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకంజీ బేజోస్ చేర‌డం గ‌మ‌నార్హం. 36 బిలియ‌న్ల డాల‌ర్ల సంప‌ద‌తో ఆమె లిస్టులో 22వ స్థానంలో నిలిచారు. కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల సంప‌న్నుల జాబితా నుంచి సుమారు 267 మంది ఔట‌య్యారు. దాదాపు వెయ్యి మంది వ‌ర‌కు త‌మ ఆస్తుల‌ను కోల్పోయారు.
---------------------------------------------------------------------------------
Amazon founder and CEO Jeff Bezos became the richest man in the world during Corona. Forbes has released its list of 34th Annual Billionaires. Jeff Bezos tops the list with a fortune of $ 113 billion. Bill Gates placed second with $ 98 billion. Bernard Arnault, CEO of LVMH Company, ranks third on the Forbes list. His wealth is estimated at $ 76 billion. Warren Buffett finished fourth. According to Forbes, Buffett's assets are $ 67.5 billion. The latest list, however, includes Jeff Bezos' ex-wife McKenzie Bezos. She was ranked 22nd with a fortune of $ 36 billion. About 267 people have been evicted from the list of wealthy people due to the Kovid pandemic. Nearly a thousand people lost their assets.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

మర్కజ్లో ఒక్కరికి కూడా కరోనా లేదు..

ముందున్నదా.. మొసళ్ల పండుగా..?

విద్వేషపూరిత సమాచారం.. ఏబీపీలో ప్రసారం..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!

కరోనా కానని దేశమొకటుందని తెలుసా..?

ఇకపై వాళ్లు కుక్కలు, పిల్లులు తినరట !