డ్రాగన్ మళ్లీ వణికెన్ !
ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రతాపం చూపుతున్న మహ్మమారి కరోనా వైరస్ను నియంత్రించడంలో చైనా కొంతమేర విజయం సాధించిన విషయం తెలిసిందే. వైరస్ పురుడుపోసుకున్న చైనాలోని వుహాన్ నగరంలో గడిచిన కొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదంటూ అక్కడి మీడియా పలు కథనాలను వెలవరించింది. ఈ నేపథ్యంలోనే చైనాలోని దక్షిణ ప్రాంతంలో తాజాగా
30 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ అధికారులు ప్రకటించారు. శనివారం నమోదైన
30 కేసుల్లో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని, ఐదుగురు మాత్రం స్థానికులేనని తెలిపారు.
అలాగే కరోనా లక్షణాలతో బాధపడుతున్న మరో 62 మందిని గుర్తించామని వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. గతకొన్నిరోజులుగా స్తబ్దంగా ఉన్న వైరస్ మరోసారి వెలుగుచూడటం ఆదేశ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిస్తోంది. కాగా ఇప్పటి వరకే చైనాలో 81,669 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా..
మృతుల సంఖ్య 3,329కి చేరింది. మరోవైపు కరోనా అనుమానితులను ముందుగానే గుర్తించి.. నిర్బంధంలోకి పంపుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్పై పోరుకు చైనా తొలి
50 రోజుల్లోనే అనేక కఠిన చర్యలను అమలు చేసిన విషయం తెలిసిందే.
---------------------------------------------------------------------------------
China has been somewhat
successful in controlling the pandemic corona virus, which plagues the world.
In the past few days in the city of Wuhan, China, where the virus has spread,
there have been numerous reports of new corona cases. Against this backdrop, 30
corona virus positive cases have been reported in the southern region of China.
Of the 30 cases registered on Saturday, 25 were from abroad and five were from
the state.
Doctors have also confirmed
that another 62 people diagnosed with coronary syndrome have been diagnosed.
The emergence of a virus that has been stagnant for the past few days is of
great concern to commanders. So far, 81,669 corona positive cases have been
registered in China. Corona suspects, on the other hand, are being identified
and sent into custody. China has implemented several stringent measures within
the first 50 days of fighting the deadly corona virus.
Comments
Post a Comment