ఇండియాకు పాకిస్తాన్ ప్రశంసలు


కరోనా కష్టకాలంలో జర్మనీకి విమానాలు నడిపిన ఎయిర్‌ ఇండియాపై పాకిస్తాన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) అధికారులు ప్రశంసలు కురిపించారు. మన దేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌ పౌరులను తరలించేందుకు, ఆయా దేశాల నుంచి కరోనా రిలీఫ్‌ మెటీరియల్స్‌ను తీసుకొచ్చేందుకు ఎయిర్‌ ఇండియా పలు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్‌ 2న రెండు ఎయిర్‌ ఇండియా విమానాలు పాకిస్తాన్‌ గగన తలం మీదుగా వెళ్తుండగా.. వాటికి అనుమతినివ్వడం ఆశ్చర్యం కలిగించిందని ఎయిర్‌ ఇండియా పైలట్‌ పాక్‌ ఏటీసీ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.
తొలుత పాకిస్తాన్‌ ఏటీసీ సిబ్బందిని సంప్రదిస్తే.. స్పందన రాలేదని, అనంతరం వారు తమను సంప్రదించి గొప్పగా రిసీవ్‌ చేసుకున్నారని పైలట్‌ చెప్పుకొచ్చారు. ‘మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో మీ సేవలపట్ల గర్వంగా ఉంది. గుడ్‌ లక్‌’ అని పాక్‌ ఏటీసీ అధికారులు పేర్కొన్నారు. ‘పాకిస్తాన్‌ అనుమతితో కరాచీ గుండా వెళ్లిన ఎయిర్‌ ఇండియా విమానాలకు 15 నిముషాల సమయం కలిసి వచ్చింది. అది మాత్రమే కాకుండా.. ఇరాన్‌ గగనతలంలోకి వెళ్లే ముందు.. ఆ దేశ వైమానిక సిబ్బందిని సంప్రదించడంలో ఇబ్బందులు తలెత్తితే పాకిస్తాన్‌ ఏటీసీ సాయం చేసింది. దాంతో ఇరాన్‌ కూడా మా గమ్యం త్వరగా చేరుకునే దిశగా మార్గం చూపించింది’ అని ఎయిర్‌ ఇండియా పైలట్‌ తెలిపారు. ఇక ఎయిర్‌ ఇండియా సేవలపై టర్కీ, జర్మనీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ కూడా ప్రశంసలు కురిపించారు.
---------------------------------------------------------------------------------
Pakistani Air Traffic Control (ATC) officials hailed Air India for flying to Germany during Corona's difficult time. Air India has re-launched a number of airlines to relocate trapped German, Canada, France and Ireland citizens and bring Corona Relief Materials from those countries. However, on April 2, two Air India flights were flying over Pakistan's airspace. This is the Karachi Control Room. Recalling the comments of Air India Pilot Pak ATS, it was a surprise and a surprise to say that Air India Relief flights were welcome.
Pilot said that when they first approached the Pakistani ATC staff, they did not respond. Proud of your services during this time of the pestilence. Pakistani ATC officials have called it a 'good luck'. Air India flights flying through Karachi with Pakistan's permission came together in 15 minutes. Not only that, but before the Iran flight, Pakistan ATS helped in case of difficulties in contacting the airmen of that country. Air India Pilot said that Iran was also the model to help us reach our destination quickly. Turkish and German air traffic controllers also praised Air India services.

Comments

New Shots

ఢిల్లీ పోలీస్ కమీషనర్ కు డీఎంసీ నోటీసులు

సాస్ తో.. తస్మాత్ జాగ్రత్త !!

కల్లోలంలో గందరగోళం - చనిపోయిన వృద్దురాలు వాపసొచ్చింది !

"చేనేత"లో లాక్ డౌన్ సంక్షోభం !

కరోనాతో పోరు కోసం మరో ముస్లిం వైద్యుడి అద్భుత ఆవిష్కరణ

పెళ్లి కోసమై వలలో చిక్కెనే పాపం పిలగాడు..!

లాక్ డౌన్ తర్వాత భర్తల పరిస్థితి.. ఇలా ఉండనుంది..!